వానకొండ లక్ష్మినరసింహస్వామి.... గోవింద.. గోవింద...


 ఈ సోమవారం17-03-2014 తేది నుండి తీర్దం(ఉత్సవం) మొదలైన సందర్బంగా వానకొండ లక్ష్మి నరసింహ స్వామి భక్తులకోసం.........


కడవెండి సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో శ్రీ వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద లక్ష్మి  నరసింహస్వామి వారు ప్రతి సంవత్సరం సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా ఎక్కువగా  మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము  (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు గుట్ట పై ఆసీనులౌతారు. అంటే హోలీ పండుగ ని పురస్కరించుకొని 'కామ'దహనం' ముగిసిన తర్వాత గుట్టపై వెలుస్తాడు.
ఈ గుట్టను "శ్రీ వానకొండ లక్ష్మి నరసింహ స్వామి" గుట్టగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు.  ఇలా వెలసిన లక్ష్మి నరసింహ స్వామి వారు 15 రోజుల పాటు(ఉగాది వరకు) భక్తుల పూజలను అందుకుంటాడు.


ముఖ్యంగా  దేవరుప్పుల మండలం లోని గ్రామాల ప్రజలు  ప్రతి ఇంటికొక ఎడ్లబండిని కట్టి గుట్ట దగ్గరికి వస్తున్న క్రమంలో ముందు ఆంజనేయ స్వామి గుడి వస్తుంది మొదట ఇక్కడ బండిని ఆపి ఆంజనేయ స్వామి వారికీ కోబరికాయ కొట్టి స్వామి వారి ఆశిషులు తీసుకుంటాము. ఈ ఆంజనేయ స్వామి గుడిని సీతారాంపురం గ్రామా భక్తుడు పునరుద్దిన్చినట్లు చెపుతారు. ఇక్కడి నుండి వానకొండ గుట్టకు చేరుకుంటాము. ఈ గుట్ట  క్రింద పెద్ద గుండు(బండ రాయి) చుట్టూ ఎడ్లబండ్లని తిప్పుతూ

గోవింద............ గోవింద................ వనకొండ లక్ష్మి నరసింహస్వామి......

 గోవింద............. గోవింద.............. అనుకుంటూ వారి భక్తిని చాటుతారు.
ఈ గుండు వద్దేనే  మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు.ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు, హుషారుగా పాల్గొన్నారు.  గుట్టపై వెలసిన స్వామి వారికీ  కొబ్బరికాయలు,ప్రత్యేక పూజలతో  స్వామి వారిని దర్శించుకుంటారు. గుట్ట కింద  భక్తులు వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇక్కడ అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి. ఇక్కడికి తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులతోటి ఈ ప్రాంత మంత తడిసిముద్దవుతుంది. సాయంత్రసమయములో భక్తులు దుకాణాలలో కిక్కిరిసి పోతారు.


ఈ 15 రోజులు   "శ్రీ వాన కొండ లక్ష్మి నరసింహస్వామి" వారు భక్తుల కోరికలను తీరుస్తాడు. చివరి రోజైన "ఉగాది పండగ" రోజు స్వామి వారు "ఉగాది పచ్చడి" ని తాగి తిరిగి కడవెండి గ్రామానికి చేరుకుంటాడు.
ఇంతటి తో ఈ ఉత్సవం ముగిస్తుంది.

మీ
కడవెండి సీతారాంపురం.