మా ఊరి క్రిస్మస్స్

                    
                    క్రిస్మస్స్ పండగ అంటే ఏసు క్రీస్తు పుట్టిన రోజు. ఈ పండగ ప్రపంచంలోని అదిక దేశాలల్లో నున్న క్రిస్టియన్స్ అందరు ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన దేశంలోను, అందులో మన గ్రామంలొను వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.


మా ఊరిలో క్రిస్టియన్ మతంలొకి కన్వర్ట్ అయిన మొదటి వ్యక్తి "పెండం బాలస్వామి" గా గ్రామస్థులు చెప్పుకుంటారు. ఆ తరువాత మరికొంతమంది ఈ మతంలొకి కన్వర్ట్ అయినారు. కొంత కాలం తరువాత వీరందరూ ప్రార్ధన చేయడానికి క్రిస్టియన్ సంస్థల సహాయంతో మన గ్రామంలో చర్చిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం సుమారుగా పది కుటుంబాలకు పైగా ఈ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాయి.
నిత్యం ప్రార్ధనలతో చర్చి ప్రాంతమంత మారుమోగుతుంది. క్రిస్మస్స్ పండుగ వచ్చిందంటే కన్వర్ట్ క్రిస్టియన్స్ ల ఇంట్లో సందడి సందడిగా వుంటుంది. వారి ఇంట్లో వుండే చెట్లను అలంకరించి, స్టార్ గుర్తులొ ఉండే విద్యుత్ కాంతులు ఇంటిముందు అలంకరిస్తారు. ఈరోజు చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, తమ ఇంటిలో విందు భోజనం ఏర్పాటు చేసి .గ్రామస్థులను అతిధులుగా పిలుస్తారు.ఈ రోజు మొత్తం యేసు క్రీస్తు పాటలతో గ్రామం మొత్తం మారుమోగుతుంది.
చిన్నగొర్రె పిల్లను నేను యేసయ్య ........ మెల్ల మెల్ల గా నడుపు యేసయ్య...
అనే ఈ పాట ఎక్కువగా వినిపించేది.


నాకు ఎదురైనా ఒక చిన్న సంఘటన:-
ఒకరోజు మా అమ్మకు ఉదయం ఐదు గంటల సమయంలో కాలుకు తేలు కుట్టింది. విపరీతమైన నొప్పితో అమ్మ ఏడుస్తుంది. ఆ సమయంలో నాకు ఏమిచెయ్యాలో తోచలేదు. డాక్టర్ గారి దగ్గరకు తేసుకపోదామని అనుకొంటుండగా మా అమ్మ చర్చి దగ్గరికి తేసుకపోరా? పాస్టర్ గారు ఏవో నూనెతో రాస్తే నొప్పి తగ్గుతదటారా... అని ఏడుస్తూ చెప్పింది. నేను నమ్మలేదు కానీ మరో మార్గంలేదు. ఎందుకంటే అది ఉదయం ఐదు గంటల సమయం ఎవరు లేస్తారు ఇంత పొద్దుగాలనే అనీ ఆలోచించుకుంటూ అమ్మని తీసుకొని చర్చిదగ్గరికి చెరాను.
పాస్టర్ గారు నిద్ర లేవలేదు, గట్టిగా పాస్టర్.. పాస్టర్.. అనుకుంటూ తలుపులు కొట్టాను. చాలా తోందరగానే తలుపులు తెరిచి, ఏమైంది అన్ని అడిగాడు. కాలికి తేలుకుట్టింది పాస్టర్ అని బదులిచ్చాను. చర్చిలోనికి రండి అని, ఫ్రెష్(ఇంతవరకూ ఉపయోగించని) కొబ్బరి నునె తీసుకొనిరా అని చెప్పాడు. ఇంట్లో కొత్త కొబ్బరి నునె డబ్బాలోంచి కొంచెం తీసుకొని చర్చిలొనికి వెళ్ళాను. ఇదే నేను మొదటి సారి చర్చిలొ అడుగుపెట్టడం చాల విశాలంగా ఉందే మన చర్చి అనుకున్నాను.
నేను తెచ్చిన కొబ్బరి నునెను పాస్టర్ గారు తన ముందు పెట్టుకొని "పరలోకంలో నున్న ప్రభువా..... అనుకుంటూ ఏవో ప్రార్ధన చదివి, ఆ కొబ్బరి నునెను తేలుకుట్టిన దగ్గర వ్రాయమని చెప్పాడు అలా 15 నిమిషాల పాటు వ్రాయగా కొద్దికొద్దిగా... నొప్పి తగ్గుతున్నదని అమ్మ చెప్పిన మాటలు విని అర్చేర్యపోయాను. ఇది ఏమిటి మందు వెయ్యలేదు, సూదీతో పనిలేదు, నాటు వైద్యమన్న చేయ్యలేదు అయీనా నొప్పి తగ్గింది. ఇది అంతా నమ్మసఖ్యంగా అనిపించకపోయీనా నా కన్నులారా చూశాను కనుక నమ్మనూ. పరలోక ప్రభువా...... మా యందు దయతలిచి మా పాపములను తొలగించుటకు వచ్చావా ప్రభూ.... అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను.


ప్రపంచంలో ఎక్కువగా మత ప్రచారం, మత మార్పిడి చేస్తున్నది ఈ క్రిస్టియన్ మతంలోనే అని చెప్పడంలో సందేహంలేదు. ఈ మార్పు అనేది నేటి ప్రపంచికరణలో విద్య అబివృద్ది చెందిన దేశాలల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నవి. ప్రాచిన ,ఆధునిక కాలానికి మానవ జీవితంలో అనేక మార్పులు చేర్పులు జరిగినవి. ఈ మార్పు అంత ఒక విద్య ద్వారానే సాధ్యమైంది. కుల, మత, ప్రాంత,వర్ణ,వర్గ బెదాలను కలారాసింది ఈ విద్య. ఎవరికి నచ్చిన మతం లోకి వారు తమ మనస్సాక్షిగా స్వికరిస్తున్నారు. తాము స్వీకరించిన మతాన్ని పూజిస్తూ పాపదోషాలను కడిగేసుకున్తున్నారు. కాని.. ఈ క్రిస్టియన్ మతంలో కొన్ని క్రైసవ మిషనరీ సంస్థల ద్వార బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు. దీన్ని కడవెండి సీతారాంపురం తీవ్రంగా కండిస్తుంది.


కొన్ని విషయాలు:-
ఏసు క్రీస్తు పుట్టిన గ్రామం == జెరూసలేం
ఏసు క్రీస్తు జన్మించిన దేశం == ఇశ్రాయెల్
ఏసు క్రీస్తు తండ్రి == యెహోవా
హల్లెలూయ == దేవుడు స్తుతింపబడును గాక
ఆమెన్== అలా జరుగును గాక
పరలోకం == స్వర్గలోకం
పరిశుద్ధ గ్రంధము== బైబిల్
కొత్త నిబంధన == బైబిల్
పాస్టర్== ప్రొటస్టెంట్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి.
బిషప్ == కేథలిక్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి
పోప్ == రోమన్ కేథలిక్ చర్చిలకు అధికారి.
భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి == "ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ద్వార "

ప్రార్ధన (వికిపిడియా నుండి)

పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!

క్రిస్మస్స్ శుభాకాంక్షలతో......

మీ,
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బస్సు

మన ఊరి నుండి పొద్దుగాలనే హైదరాబాద్ కి పోవాలంటే కడవెండి గ్రామం నుండి వచ్చే బస్సు 5 గంటలకు మన ఊరికి చేరుకునేది. అప్పుడు హైదరాబాద్ కి ఛార్జ్ 52 రూపాయలే అని గుర్తు. ఈ బస్సు నవాబ్ పేట గ్రామానికి కూడా వెళ్ళేది అక్కడినుండి జనగాం వయ భువనగిరి టూ హైదరాబాద్ కి ఉదయం 8 గంటలకి చేరుకునేది. కానీ ఇప్పుడు మన గ్రామం నుండి హైదరాబాద్ కి పోవాలంటే కడవెండి బస్సు ఎక్కి జనగాం లో దిగి అక్కడి నుండి మళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కడవెండి బస్సు ఇప్పుడు చిన్న మడుర్ కి కూడా వెళ్ళుతుంది. డైరెక్ట్ హైదరాబాద్ బస్సు సర్వీస్ ని రద్దు చేసి జనగాం వరకే సేర్విసుని కొనసాగిస్తునారు మన జనగాం డిపో మేనేజర్ గారు. బస్సు ఛార్జ్ ఒకప్పుడు జనగాంకి 10రూ. ఉండే ఆతర్వాత 14,17 ఉండే, ఇప్పుడు ఏకంగా 21 రుపాయలైంది. అంటే గత 20 సంవత్సరాల తో పోలిస్తే రెండింతలైంది. హైదరాబాద్ కి వచ్చే సరికి 100 రూ అవుతుంది. అర్ టి సి మరియు ప్రభుత్వాలు కలసి ప్రజలపై ఎంత బారాన్ని మోపుతుందో అర్ధమౌతుంది.
అసలు మన గ్రామం నుండి హైదరాబాద్ బస్సు సర్వీస్ ను ఎందుకు రద్దు చేసినట్టు? కనీసం కడవెండి మరియు సీతారాంపురం నుండి 20 కి తక్కువ కాకుండా రోజు హైదరాబాద్ కి వెళ్ళుతారు. ఇంకొందరు జనగాం కి మరికొందరు సింగరాజుపల్లి, చిన్న మడుర్, నవాబు పేట మద్యలో వచ్చే ఊరిలోనుండి కనీసం ఓ పది మంది , జనగాం లో 10 మంది మొత్తంగా సుమారు 40 కి తక్కువ కాకుండా హైదరాబాద్ కి బస్సు చేరుతది. మరి అలాంటప్పుడు ఈ కడవెండి బస్సు సర్వీస్ ని జనగాం వరకే ఎందుకు సవరించారు..? పోనీ ఒక సమయంలో తక్కువ మంది ప్రయాణం చేయడం వల్ల జనగాం మేనేజర్ గారు ఈ బస్సు సేరివిసు ని కుదించారా?
మరి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ కి వెళ్ళుతున్నారు కదా దీన్ని మేనేజర్ గారు మరియు కడవెండి, సీతారాంపురం గ్రామా ప్రజలు, నాయకులూ గమనించి కడవెండి బస్సు ని హైదరాబాద్ వరకు పొడగించ వలసిందిగా జనగాం డిపో మేనేజర్ గారికి విజ్ఞేప్తి పత్రంను అందజేయ వలసినది గా కోరుతున్నాను.
మళ్ళి మన గ్రామనికి జనగాం నుండి ఈ బస్సు సర్వీస్ ఉదయం 9:20 కి ఉంటుంది. 10 గంటలవరకు మన గ్రామానికి చేరుకుంటుంది. తిరిగి ఈ బస్సు 10:30కి బయలుదేరుతుంది. రాత్రి సమయంలో ఈ బస్సు జనగాం నుండి 7:15 నిముషాలకు బయలుదేరి 8:30కి మన గ్రామంలో ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ ను మన కడవెండి మరియు సీతారాంపురం గ్రామస్తులందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతూ...........

సీతారాంపురంలో సామాజిక...రాజకీయ....ఆర్ధిక.... పరిస్థితి..



సీతారాంపురం గ్రామానికి ప్రధాన ఆధారం వ్యవసాయం.కొందరు వారికి సాయం చేసి కూలి అనిపించుకుంటారు. మరి కొందరు వ్యవసాయ ఆధార పనులు చేస్తారు. ఇంకొందరు పశువులు( బర్లు,ఆవులు) ద్వార పాల ఉత్పతిని పెంచి ఆదాయాన్ని పొందుతారు.మా ఊరిలో వివిధ మతాల వారు అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో రజక,కుమ్మరి, కమ్మరి, ఎరికల, మాదిగ,పిచ్చకుంట్ల, లంబాడి, వడ్డెర, ముదిరాజ్, కురుమ, పద్మశాలి ,గౌడ్స్ , కాపు, అరె, బ్రాహ్మడ్లు ,కోమట్లు మొదలైన కులస్థుల వారు ఉన్నారు. వీరిలో కురుమ ,అరె,గౌడ్స్, పద్మశాలి, ముదిరాజ్, కాపు, మొ!! కులస్తుల జనాభ ఎక్కవ. ఈ గ్రామంలో హిందువులు , ముస్లింస్, క్రిస్టియన్స్ మతాలకు చెందిన వారు ఉన్నారు, అందరు ఎక్కువగా వ్యవసాయంపై ఆధాపపడి జివిస్తునారు.

గ్రామంలో గోల్లకుర్మలు గొర్రెల పోషణను , గౌడ కులస్తులు కల్లును , రజకులు బట్టలుతుకుతు, ముదిరాజ్ కులస్తులు చేపలు, తోటల పెంపకం,పద్మశాలీలు వస్త్రాలను తాయారు చేసి వ్యాపారం చేయడం, కోమట్లు వ్యాపారం, కుమ్మరొల్లు కుండలపని, కమ్మరొల్లు వ్యవసాయానికి సంబందించిన కమ్మరి పని, బ్రాహ్మలు అర్చకులుగా, ఇలా వారి వారి కులవృత్తిలను చేసుకుంటూ కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తునారు. మిగిలిన కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మరి కొందరు మేస్త్రి పని,హమాలి కూలి పని, (కరెంట్) ఎలాక్రిషణ్ పని, డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకుని సొంత ఆటోల ద్వార కొందరు, దర్జీ పనిలో మరి కొందరు, ఉపాద్యాయ వృత్తి లో ఇలా తమ జీవితాన్ని సీతారాంపురం లో కొనసాగిస్తునారు. మా ఊరి యువత ఎక్కవ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మొగ్గు చూపుతున్నారు.నేటి తరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు, పడుతున్నారు.


ఎక్కువగా యువత చదువులకోసం,ఉద్యోగాలకోసం గ్రామాన్ని విడిచి వలసలుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి వలసవేల్లరు. హైదరాబాద్ లో ఉప్పల్, రామంతపూర్, చింతల్ , జగదిర్గుట్ట, చర్లపెల్లి, ఇ సి ఐ ఎల్ మొ!! ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇంకొంత మంది , జనగామ,వరంగల్, సూరత్, మొ!! ప్రదేశాలల్లో, మరి కొందరు దుబాయ్ ,అమెరికా దేశాలల్లో ఎక్కువగా వలసలు పోయారు.

మా ఊరిలో దాదాపు నాలుగు వెయ్యీల జనాభా ఉంది. పద్దేమ్మిద్దివందల ఓటర్లు ఉన్నారు. మా ఊరిలో ప్రతి పనిలో రాజకీయం నడుస్తుంది. మా ఊరిలో ప్రదానంగా కాంగ్రెస్, టి డి పి, టి అర్ఎస్ పార్టీలకు చెందినా నాయకులూ, కార్యకర్తలున్నారు. మా ఊరిలో ఎక్కువగా గౌడ్స్ దే రాజ్యాధికారం. యువత కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

గూగుల్ మ్యాప్ లో మన గ్రామం




అనాధ వృద్ద అశ్రమం

సీతారాంపురం లో Mr. Masetti Laxminarayana గారు స్థాపించిన => ప్రేమ సదనం అనాధ వృద్ద సంగం గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వెబ్ సైట్ లో పొందు పర్చబదినవి. ఈ లింక్ ని క్లిక్ చేయండి.  
                    
ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమం

మీ సలహాలు పంపవలసిన మెయిల్ ఐ డి

ప్రియమైన  మిత్రులారా మన సీతారాంపురం పల్లె జీవనం కు సంబంధించి  మధుర జ్ఞాపకాలు , మిమ్మల్ని కదిలించిన, మీరు స్పూర్తి పొందిన సంగటనలు, వ్యాసాలను, మీ రచనలు, మీకు నచ్చిన మన గ్రామ నాయకులు మొదలైన వారిగురించి మాకు  పంపండి. ఈ పేజీ లో ఉంచుతాము. ఫోటో లు ఐన పరవాలేదు  ఏదైనా సరే మా ఇ మెయిల్ ఐ డి కి సెండ్ చేయండి.
మా  Mail ID: kadavendisitharampuram@gmail.com

ఇట్లు
మీ,
కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో శుద్దజల కేంద్రం