నాకు నచ్చిన పద్యం


బాధ  పడినంత మాత్రాన,బరువు దిగినట్లు కాదు.తెల్లవారైనంత  మాత్రాన, కల ముగిసినట్టు   కాదు.లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన, ముద్దాయివైనట్లు కాదు.విజయం దక్కనంత మాత్రాన,జీవితం ముగిసినట్లు కాదు.పోరాడు మిత్రమా... పోరాడు....

తెలంగాణా విమోచన దినోత్సవం


1947 ఆగష్టు 15 బ్రిటిష్ పాలన అంతమైంది దీన్ని స్వతంత్రం  అన్నారు..
1948 సెప్టెంబర్ 17 న నిజాం పాలన అంతమైంది దీన్ని ఏమంటారు..?
చెప్పలేని నిస్సహాయతలో  ఉంది  మన తెలంగాణ....

ఎవరో చేసిన తప్పిదానికి... నేటికీ మథన పడుతుంది తెలంగాణ
అధికారంలో లేన్నప్పుడు ఒకమాటా... అధికారం వచ్చినతర్వాత ఒకమాట
పార్టీ మనుగడకు ఒకమాటా... పార్టీ గద్దె నెక్కిన తర్వాత ఒకమాట
దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుబావులను గుర్తు చేసుకోడానికి
ఒకరోజు ఉన్నట్లే... తెలంగాణ కోసం అమరులైన వీరులకు గుర్తు చేసుకోడానికి  ఒక్కరోజైనా లేకుండా చేశారే...?
కుటిల స్వార్ధ రాజకీయాలు ఇంకా  ఏన్నాళ్లూ. ..?