కాముని పూర్ణిము వ‌స్తుందంటే..చిన్న‌ప్పుడేంత సంతోష‌మో..




కాలికి తోలు చేప్పులు..
న‌డుముకు తువలు క‌ట్టు..
త‌ల‌పై చిరిగిన టోపితో..
గోడ్డ‌లి ప‌ట్టుకోని సేల‌క‌ల‌ల్లో..
చెల‌ల్లో..
తిరిగి తిరిగి అల‌సి పోయి..
తోట్టికాల‌ బావి ద‌గ్గ‌ర సేద‌తీరుతూ..
ముచ్చ‌డించుకున్న ఆ ముచ్చట్లు...
ఇప్ప‌టికి
నా చేవిలో మారుమోగుతున్న‌వి.
బంక తిద్దామ‌నోక్క‌డు..
రెగి పండ్లు ఎరుదామ‌నోక్క‌డు...
తేనె జోపుదామ‌నోక్క‌డు..
ఈతక‌ల్లు త‌గుదామ‌నోక్క‌డు...
ఇలా ముచ్చ‌ట్లో లీన‌మైపోతున్న మాకు
 ఎంచేస్తున్న‌ర్రా...ఇక్క‌డ..!
 అని ఓ గంభీర స్వ‌రంతో వినిపించ‌డంతో..
ఉహించ‌ని ఈ ప‌రినామంతో అంద‌రం భ‌య‌ప‌డిపోయాం...
మా ముందు అరు అడుగుల ఓ పేద్ద‌మ‌నిషి..
మ‌ల్లెపూవ్వు లా మెరిసె తెల్ల‌టి బ‌ట్ట‌లు ద‌రించి..
 పెద్ద పెద్ద మిసాలు, ఎర్ర‌బారిన కండ్లను చూసేస‌రికి
అంద‌రం భ‌య‌ప‌డి ప‌రుగులు తీసాం...
ఇంత‌లో అటు వైపు వెలుతున్న స‌త్తిరెడ్డి జీత‌గాడు న‌న్ను ప‌ల‌క‌రించాడు...
ఎం ప‌ని మీద వ‌చ్చిర్ర‌ని..!
కాముని పూర్ణిము వ‌స్తుందిగా..
కాముని క‌ర్ర‌ల కోసం చ‌క్కటి...
తుమ్మ‌ కోమ్మ‌ను వెత‌క‌డ‌నికి వ‌చ్చ‌మ‌ని, ఇక్క‌డ తుమ్మ చెట్టు ఎక్క‌డున్నాయి...
అని అమాయ‌కంగా అడిగాము.
అత‌నె ద‌గ్గ‌రుండి ఉడుం కోమ్మ‌ను కోట్టిచ్చాడు..
ఈ ఉడుం క‌ర్ర చాల గ‌ట్టిద‌ని చెప్పి..
అంద‌రికి కోలాట క‌ర్ర‌ల కోట్టి, చెక్కిచాడు..

 


మిగితా క‌థ... త‌రువాయి.. రోజు