ఇది నా సమాజమా ?


డబ్బులేని వాణ్ణి , మనిషిగా చూడని నా సమాజమా..

భిదవాని ఆత్మాభిమానాన్ని కాలరాసే నా సమాజమా..

నిరుద్యోగిని హేళన చేసే నా సమాజమా..

చిరుద్యోగిని చిన్నచుపుచుసే నా సమాజమా..
వృద్ధులను బిచ్చగాళ్ళను చేసే నా సమాజమా..
దేశ సంప్రదాయాలను అపవిత్రం చేసే నా సమాజమా...
స్త్రీజాతిని అవమానించే నా సమాజమా..
పేదవానిచెమటచుక్కనుఅత్తరుగాజల్లుకునేరాజకీయమాఇదినాసమాజమా..?

విదేశీ పెట్టుబడులకు అమ్ముడు పోయేన నా భారతమా ఇది నా సమాజమా..?
కుక్కలకున్న విలువ తోటి మనిషి పై లేకున్నదే నా సమాజమా..
రైతు రాజైతే రాజు ఆత్మహత్యాలెందుకే నా సమాజమా..
పేద వాణి బ్రతుకు బారమై, ఐశ్వర్య వంతులకు విలసమయేనే నా సమాజమా
ప్రాణం కన్నా డబ్బే మిన్నంటున్న నా సమాజమా..
మనవ సంబందాలు మంటగాలేపేనేడు నా సమాజమా..
పేదవానికి చిరిగినా గుడ్డ, ఉన్నోనికి చింపిన గుడ్డ నా సమాజమా..

ప్రస్తుత రోజులలో ఆదునిక ప్రపంచంలో సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చూసి

 ఆనందించాలో లేక రోజు రోజుకు దిగజారుతున్న నైతిక విలువలు చూసి 

బాదపపడలో తెలియని స్థితి నాసమాజానిది.
మనిషి మానవత్వావిలువలను కాలరాసి వ్యక్తిపై ఉండే నమ్మకం కంటే 

డబ్బుపై ఉండే నమ్మకం( ప్రేమ) ఎక్కువై, ఆధునిక సుఖలోగిలిలో బానిసై ,

 స్వార్దంతో, కక్ష్యతో, దోపిడిలతో, రాక్షశానందలతో , కామామధవాత్స కోరికలతో 

నేటి మానవత్వ విలువలనుమంటగలిపి డబ్బుకై పరిగెడుతున్న నా సమాజమా...

ఎటు పోతున్నాం మనం...?

అవసరానికి మించి డబ్బు అవసరమా ..?

మానవతసంబందలకంటే మనీసంబందలే గొప్పవా?

సంపాదించడం తప్పుకాదు ఆ క్రమంలో

చుట్టూ ఉన్నవారిని వదేలేసుకోవడం తప్పు కదా..?

మనవ విలువలను లెక్కచేయకుండా సంపాదించినా డబ్బు చిరకాలం నీతో ఉంటుందా ..?


ఒకడు విజయం సాదించాడంటే మిత్రుల, శేయోబిలషుల చేయూత అవసరం
కనుక మీ మిత్రులకు మీ సమర్దతకు తగ్గటుగా సహాయ పడి, మానవత విలువలను కాపాడండి.
నాటి భారతాన్ని నేటి ప్రపంచానికి చాటి చెప్పలేమా?
ఆలోచించండి మిత్రులారా..!!

 
మీ
కడవెండి సీతారాంపురం.

బాల్యస్మృతులు :


ప్రతి ఆటలో గెలుపు కోసం పోరాటమే..

ఓడిపోతే ఉక్రోషామే ..

తొండాటలు..

తగువులు...

అలకలు....

మూతి బిగించుకోవటాలు..

ఇవన్నీ చెయ్యని పిల్లలు ఉంటారా?


నాకు తెలిసిన కొన్ని ఆటలు..
మీ కోసం...


1)కర్ర బిళ్ళ,2) చెరువులో ఈతలు, 3)కోతి కొమ్మచ్చి,4)వైకుంఠపాళి, 5)వామనగుంటలు,

6) చింతగింజలాటలు,7) తొక్కుడుబిళ్ళ, 8)బంక మట్టి బొమ్మలు,9) కబడ్డీ,10) కోకో, 11)కోలాటాలు,12)కళ్ళగ్గంతలు,13)ఇసకలో ఇల్లు కట్టుకొనే ఆట,14)బొంగరాలు,15)ఉయ్యాల ఊగడం,16)తాడాట(స్కిప్పింగ్),17)పులి మేక, 18)గవ్వలు, 19)కాగితాలతో విమానం తయారు చేయడం 

20)రింగు ఆట 21)చుక్ చుక్ రైలు 22) వంగుడు దూకుడు 23)చుక్కల ఆట 24) పదాలు వెతుకుట 

25)కాగితంతో పడవల్లాంటి ఆకారాలు 26)కాగితాలతో తుపాకి తయారు చేయడం 27)దారం తో చిక్కుముళ్ళ ఆట,28)సినిమాలు ప్రదర్శన 29)కొబ్బరి ఈనేలు పైకి పంపే ఆట,30)అగ్గి పెట్టేల సేకరణ 31)గాలిఫటాలు,

32)కూల్ డ్రింకు మూతకు హోల్స్ వేసి దానిలో దారము పెట్టి ఆడే ఆట, 33) పత్తాలాట 34) అంతక్షరి 35)క్రికెట్,36)చదరంగము,37) అన్నంకూర ఆట 38) మొగుడు పెళ్ళాం 39) రాయి రంగాన్న - పెండల బుర్రి 

40) చేతులతో చేపలను కడిగే ఆట 41) పైసలాట,42) ఉప్పు రాళ్ల ఆట

ఇలా చెప్పుకుంటూపోతే చాల ఆటలున్నవి. నాకు తెలిసిన కొన్ని ఆటలను మాత్రమే పరిచయం చేశాను. కొన్ని మరచీపోయి ఉండచ్చు.. మీకు తెలిసిన ఆటలను పరిచయం చేయండి.

మీ,
కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


6.గోలీలాట:


గ్రామాలల్లో పెరిగిన ప్రతి ఒక్కరు ఈ ఆటను ఆడే ఉంటారు.
చిన్ననాటి ఆటల్లో ఆతి ముఖ్యమైన ఆటగా ఈ గోలీలాటను చేపుకోవచ్చును.
ఈ గోలిలతో ఆనేక మైన ఆటలను ఆడుకోవచ్చును.
గచ్చు, బద్దిలాట, రౌండ్ గా గోలీలను జల్లి మల్లి ఒక గోలితో కొట్టాలి, రౌండ్ ఆవతల పడితే మొత్తం గోలిలన్ని మనకే ఇలా ఎన్నో ఆటలను ఆడుకోవచును. మేమైతే గ్రామా పంచాయతి ముందు సుమారుగా 100కు పైగా గోలీలను గచ్చులొ పెట్టి ఆడేటోల్లం.
బడి బయట స్నేహింతులతో విరామ సమయంలో ఆడేటోల్లం. బావి దగ్గర పశువులను మేపుతూ కూడా ఆడేటోల్లం.ఈ గోలిలన్ని మా గోశాల దగ్గర & ఇంటి వెనుకల భూమిలో గోతి తిసి మరి దశేటోన్ని ,ఇలా ఎక్కడ గోలీలను దశింది గుత్తులేకుండేది. మొన్న ఉగాది రోజున ఇంటి వెనకాల కనకంబ్ర చెట్టును పెడుతుంటే 38 గోలీలు దొరికినవి.
ఎంత థ్రిల్లింగ అన్పించిదో... చెప్పడానికి ఆక్షరాలు దొరకడం లేదు.

ఇట్లు
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


5. దాడి ఆట :


ఈ ఆట మెదడుకు పని చెప్పుతుంది.
ఆలోచన శక్తిని పెంచుతుంది.
ఎదుగుతున్న పిల్లలలో జ్ఞానసంవృద్దిని పెంచుతూ,
జీవితం మీద గుండెల్లో విశ్వాసంని నింపుతుంది .

ఈ ఆటలో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు.
ఒక్కొక్కరికి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత గింజలు/ రాళ్ళూ /కట్టే పుల్లలు
ఏవో ఒకటి ఎవరి వస్తువులు ఎవరిదో గుర్తుపట్టడానికి వేరు వేరుగా తీసుకోవాలి. కింది బొమ్మలో ఎరుపు రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని(వస్తువులు) పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే ఒక దాడి జరిగినట్లు.
దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి పావుల నుంచి దాడికని పావును తీసుకుంటారు.

ఇలా తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకు కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు. ఒకసారి దాడి జరిపిన పావును , ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి పావులన్ని పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును.

ఈ ఆటతో పాటు
ముడురాళ్ళ దాడి ఆట కూడా ఆడుకోవచును.
పైన తిలిపిన ఆటలాగే ఈ ఆట ను ఆడుతారు కాకపోతే ఈ ఆట లో మూడు పావులు మాత్రమే ఉంటై.
ఈ ఆటను ఎక్కువగా బావి దగ్గర పశువులను మేపుతూ ఆడుకోనే టోల్లం.
చాలెంజ్ గా తీసుకోని చాల సీరియస్ గా ఆడేవాళ్ళం.
అపుడప్పుడు పైసలుకుడా బెట్టు పెట్టుకోనే టోల్లం.
టైంపాస్ కి ,మేధాశక్తికి ఈ ఆట ఎంతో ఉపయోగంసుమా..

ధన్యవాదాలు మిత్రుల్లారా !!

ఇట్లు
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


4.అష్టా చేమ్మా


అమ్మలక్కలందరికి బాగా తెలిసిన,
ఆడిన ఆట ఈ అష్టా చేమ్మాఆట ..
వాళ్ళే కాదు మనంకూడా ఆడామనుకో..
ఈ అష్టా చేమ్మా ఆటలో నలుగురు అడవచ్చును.
ఈ నలుగురు వారివారి ఆట వస్తువులుగా చిన్న చిన్న రాళ్ళూ ,
చీపురు పుల్లల్, చింతగింజలు, వడ్లగింజలు మొ!!వి.
పెట్టుకొని ఇంట్లోని బండలపై గాని, విదిబయటి అరుగులపై గాని గిసిన
అష్టా చేమ్మా పటముపై పెట్టి , సగబాగము
అరగ దీసిన నాలుగు చింత గింజలను వెదజల్లగ..
ఒకటి తెల్లగా పడితే కన్ను అని ..
రెండు తెల్లగా పడితే దుగా అని ..
మూడు పడితే ( గుర్తుకు రావడం లేదు) అని..
నలుగు తెల్లగా పడితే చెమ్మ అని..
నలుగు నలుపు పడితే అష్టా అని...
ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఆటను ఆడుకుంటారు.
మా ఇంట్లో 14 సం!!. క్రింద రంగులతో వేసిన అష్టా చేమ్మా
ఇప్పటికి ఉంది. ఇప్పుడైతే పిల్లలెవరు ఆడటంలేదు కాని..
అప్పట్లో దీనికి (అష్టా చేమ్మాకి) చాల గిరాకి ఉండేటిది...
ఏ పని తోయక హైరానా పడే వారిని చూసి
అష్టా చేమ్మా ఆడుతున్నవురా....? అని హేళనతో
తెలుగులో శాత్రం కూడా పుట్టింది మరి.
ఇది మన తెలుగు ప్రజల ఆట..
అష్టాచేమ్మాట...

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


3.వీరీవీరీ గుమ్మడిపండు :


గుర్తుందా సోదరా.. మీ ఇంటిముందు
సాయంత్రా సమయాన సేదతిరుతున్నా అ క్షణమున
మీకు మీ అమ్మో, అక్కో, తాతాయో, నానమ్మో..
ఎవరో ఒకరు వారి వల్లో కూర్చోబెటుకొని
మీ కళ్ళును మూస్తూ... మిగతా పిల్లలంతా ఎదురుగా నుంచోబెట్టి
'వీరీవీరీ గుమ్మడి పండూ.... వీరి పేరేమి...?'
అంటూ రాగయుక్తంగా ఆడిగిన ఆ క్షణం గుర్తుందా ....?
చేతుల్ని తాకిచూసి వాళ్ళెవరో గుర్తుపట్టాలన్నమాట....!
అలా గుర్తుపట్టలేకపోతే ఓడిపోయినట్లు.....!
కాదుకాదు..... ఆతను కదేకాదు అంటూ
మిగిలిన పిల్లలంతా గేలి చేస్తారు....!
చెప్పలేకపోయిన కుర్రాడు చిన్నబుచ్చు కుంటాడు....!
మిగతా పిల్లలంతా కిలకిలా నవ్వేస్తారు...!
తల్లి ముసి ముసిగా నవ్వుతూ... మురిసిపోతుంది...!
తెలుగునాట వెల్లివిరిసిన ఆనందపు సయ్యాట....!
పసి(డి) మనసులు పరవశులై పురివిప్పి ఆడే సంబరాల పాట....!
మరపురాని మధురాను భూతి...!
ఇదంతా ఎప్పటిదో చిన్ననాటి ముచ్చట...!

'వీరీవీరీ గుమ్మడి పండూ.... కామెంట్ రాసేద్దేవరు ...?'

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


2.తాటికాయ బండ్లు :


ఈ తాటికాయ బండిని తాయారు చేయడానికి దేవరుప్పుల దగ్గరి వాగుకాడికి పోయే టోల్లం పెద్ద పెద్ద తాటికాయ(ముంజలు)లను తెచ్చి ఈ క్రింది విదంగా తాయారు చేసిటోల్లం.
రెండు తాటి కాయలను తీసుకొని తాటికాయమద్యలో పదునైన కర్ర ముక్కను తొడిగించి , చివరన రెండు పంగలు కలిగిన పొడవాటి కర్రను తీసుకొని , తాటి కాయ మద్యలో తొడిగించిన, చిన్నకర్ర ముక్క మద్యలో పటంలో చూపినట్లు పెట్టాలి. ఇప్పుడు తాటికాయ బండి తయారైంది.

ఈ బండ్లతోటి ఊర్లోని విధుల వెంబటి తిరిగేటోల్లం,
నా బండి గట్టి దంటే, నా బండి గట్టిదని రెండు బండ్లను గుద్దేటోల్లం,
పచ్చిగా బలంగా ఉన్న తాటికాయ బండ్లు,ఈ ఎండలకు బక్కచిక్కి పోయేవి..
మల్లి కొత్త బండిని తాయారు చేసుకోనేటోల్లం..
ఆ రోజులే వేరప్ప...........

మీ
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


1.సైకిల్ టైరు ఆట:


సైకిల్ టైరు..
రిములతో పరుగు..
తెలియకుండానే ప్రక్రతితో చెలిమీ...
ఇంటి దగ్గరనుంచి బడి దగ్గరికి...
బడి దగ్గరి నుంచి బావికాడికి...
ఇలా సైకిల్ టైరు ముందు, నేను వెనుకాల...
ఊరు మొత్తం ఒకటే పరుగులు....
అమ్మ ఆరుపులు...
నాన్న పరుగులు..
నన్ను ఆపేవాళ్ళు ఎవరు...?
ప్రక్రతి వడిలో నా బాల్యం...
చూస్తుండగానే గడిచేను మదురానుభవం...

ఇట్లు,
నా జ్జాపకాలు - కడవెండి సీతారాంపురం.

వేసవి - జ్జాపకాలు


ఎండాకాలం వచ్చింది... సెలవులెన్నో తెచ్చింది...

వేసవి సెలవులు పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయి. ఆటలు, పాటలు, విహారాలు వారి మనోవికాసానికి బాటలు వేస్తాయి. ఏడాది అంతా పుస్తకాల మోతలు, హోంవర్కులు, మార్కులు సాధనతో విసిగిపోయిన పిల్లలకు ఆటవిడుపుగా మరుతునై. కొత్త ప్రదేశాలు, నూతన స్నేహాలు, ఆసక్తి నింపే అంశాలు వారిలో కొత్త కాంతులు నింపుతాయి. శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు.
మనకు ఆటలు అనగానే చిన్నప్పటి రోజులే గుర్తుకు వస్తుంటయీ..!
ఈ ఆటలు మానసిక వ్యాయామానికి,నాయకత్వలక్షణాలకు,ఒక పని ఎలా చేయాలి దానికి కావలసిన ఓపిక ఇలా ఎన్నో నేర్పుతుంది అనే చెప్పాలి.
మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను మన పిల్లలు ఆడుకునేలా పరిస్తితులు కల్పిస్తున్నమా..? ఈ వెసని సెలవులను పూర్తిగా పిల్లల ఇష్టనికి వదిలేద్దాం.
మనం కూడా మన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుందాం. మనం మన చిన్ననాటి ఆటలు, అల్లర్లను ఈ వేసవి రోజుల్లో నేమరేసుకుందాం!!

మన అందరికోసం "కడవెండి సీతారాంపురం" ఈ వేసవి కాలం ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ కార్యక్రమం పేరు '' నా జ్జాపకాలు ". ఈ కార్యక్రమంలో మనం/నేను ఆడిన ఆటలను గుర్తుచేయడం దీని ఉదేశ్యం. మీ చిన్ననాటి జ్జాపకాలు మాతో పంచుకోండి..!! మన సంస్కృతి,సాంప్రదాయతో ముడిపడిన మన బాల్యాన్ని రాబోవు ఆదునిక యంత్ర ప్రపంచానికి అదించండి.
మీరు మాకు సూచనలు, సలహాలు పంపించాలని అనిపిస్తే kadavendisitharampuram@gmail.com మెయిల్ కి సెండ్ చేయగలరు.

ఇట్లు,
కడవెండి సీతారాంపురం.