మా ఊరి క్రిస్మస్స్

                    
                    క్రిస్మస్స్ పండగ అంటే ఏసు క్రీస్తు పుట్టిన రోజు. ఈ పండగ ప్రపంచంలోని అదిక దేశాలల్లో నున్న క్రిస్టియన్స్ అందరు ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన దేశంలోను, అందులో మన గ్రామంలొను వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.


మా ఊరిలో క్రిస్టియన్ మతంలొకి కన్వర్ట్ అయిన మొదటి వ్యక్తి "పెండం బాలస్వామి" గా గ్రామస్థులు చెప్పుకుంటారు. ఆ తరువాత మరికొంతమంది ఈ మతంలొకి కన్వర్ట్ అయినారు. కొంత కాలం తరువాత వీరందరూ ప్రార్ధన చేయడానికి క్రిస్టియన్ సంస్థల సహాయంతో మన గ్రామంలో చర్చిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం సుమారుగా పది కుటుంబాలకు పైగా ఈ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాయి.
నిత్యం ప్రార్ధనలతో చర్చి ప్రాంతమంత మారుమోగుతుంది. క్రిస్మస్స్ పండుగ వచ్చిందంటే కన్వర్ట్ క్రిస్టియన్స్ ల ఇంట్లో సందడి సందడిగా వుంటుంది. వారి ఇంట్లో వుండే చెట్లను అలంకరించి, స్టార్ గుర్తులొ ఉండే విద్యుత్ కాంతులు ఇంటిముందు అలంకరిస్తారు. ఈరోజు చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, తమ ఇంటిలో విందు భోజనం ఏర్పాటు చేసి .గ్రామస్థులను అతిధులుగా పిలుస్తారు.ఈ రోజు మొత్తం యేసు క్రీస్తు పాటలతో గ్రామం మొత్తం మారుమోగుతుంది.
చిన్నగొర్రె పిల్లను నేను యేసయ్య ........ మెల్ల మెల్ల గా నడుపు యేసయ్య...
అనే ఈ పాట ఎక్కువగా వినిపించేది.


నాకు ఎదురైనా ఒక చిన్న సంఘటన:-
ఒకరోజు మా అమ్మకు ఉదయం ఐదు గంటల సమయంలో కాలుకు తేలు కుట్టింది. విపరీతమైన నొప్పితో అమ్మ ఏడుస్తుంది. ఆ సమయంలో నాకు ఏమిచెయ్యాలో తోచలేదు. డాక్టర్ గారి దగ్గరకు తేసుకపోదామని అనుకొంటుండగా మా అమ్మ చర్చి దగ్గరికి తేసుకపోరా? పాస్టర్ గారు ఏవో నూనెతో రాస్తే నొప్పి తగ్గుతదటారా... అని ఏడుస్తూ చెప్పింది. నేను నమ్మలేదు కానీ మరో మార్గంలేదు. ఎందుకంటే అది ఉదయం ఐదు గంటల సమయం ఎవరు లేస్తారు ఇంత పొద్దుగాలనే అనీ ఆలోచించుకుంటూ అమ్మని తీసుకొని చర్చిదగ్గరికి చెరాను.
పాస్టర్ గారు నిద్ర లేవలేదు, గట్టిగా పాస్టర్.. పాస్టర్.. అనుకుంటూ తలుపులు కొట్టాను. చాలా తోందరగానే తలుపులు తెరిచి, ఏమైంది అన్ని అడిగాడు. కాలికి తేలుకుట్టింది పాస్టర్ అని బదులిచ్చాను. చర్చిలోనికి రండి అని, ఫ్రెష్(ఇంతవరకూ ఉపయోగించని) కొబ్బరి నునె తీసుకొనిరా అని చెప్పాడు. ఇంట్లో కొత్త కొబ్బరి నునె డబ్బాలోంచి కొంచెం తీసుకొని చర్చిలొనికి వెళ్ళాను. ఇదే నేను మొదటి సారి చర్చిలొ అడుగుపెట్టడం చాల విశాలంగా ఉందే మన చర్చి అనుకున్నాను.
నేను తెచ్చిన కొబ్బరి నునెను పాస్టర్ గారు తన ముందు పెట్టుకొని "పరలోకంలో నున్న ప్రభువా..... అనుకుంటూ ఏవో ప్రార్ధన చదివి, ఆ కొబ్బరి నునెను తేలుకుట్టిన దగ్గర వ్రాయమని చెప్పాడు అలా 15 నిమిషాల పాటు వ్రాయగా కొద్దికొద్దిగా... నొప్పి తగ్గుతున్నదని అమ్మ చెప్పిన మాటలు విని అర్చేర్యపోయాను. ఇది ఏమిటి మందు వెయ్యలేదు, సూదీతో పనిలేదు, నాటు వైద్యమన్న చేయ్యలేదు అయీనా నొప్పి తగ్గింది. ఇది అంతా నమ్మసఖ్యంగా అనిపించకపోయీనా నా కన్నులారా చూశాను కనుక నమ్మనూ. పరలోక ప్రభువా...... మా యందు దయతలిచి మా పాపములను తొలగించుటకు వచ్చావా ప్రభూ.... అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను.


ప్రపంచంలో ఎక్కువగా మత ప్రచారం, మత మార్పిడి చేస్తున్నది ఈ క్రిస్టియన్ మతంలోనే అని చెప్పడంలో సందేహంలేదు. ఈ మార్పు అనేది నేటి ప్రపంచికరణలో విద్య అబివృద్ది చెందిన దేశాలల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నవి. ప్రాచిన ,ఆధునిక కాలానికి మానవ జీవితంలో అనేక మార్పులు చేర్పులు జరిగినవి. ఈ మార్పు అంత ఒక విద్య ద్వారానే సాధ్యమైంది. కుల, మత, ప్రాంత,వర్ణ,వర్గ బెదాలను కలారాసింది ఈ విద్య. ఎవరికి నచ్చిన మతం లోకి వారు తమ మనస్సాక్షిగా స్వికరిస్తున్నారు. తాము స్వీకరించిన మతాన్ని పూజిస్తూ పాపదోషాలను కడిగేసుకున్తున్నారు. కాని.. ఈ క్రిస్టియన్ మతంలో కొన్ని క్రైసవ మిషనరీ సంస్థల ద్వార బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు. దీన్ని కడవెండి సీతారాంపురం తీవ్రంగా కండిస్తుంది.


కొన్ని విషయాలు:-
ఏసు క్రీస్తు పుట్టిన గ్రామం == జెరూసలేం
ఏసు క్రీస్తు జన్మించిన దేశం == ఇశ్రాయెల్
ఏసు క్రీస్తు తండ్రి == యెహోవా
హల్లెలూయ == దేవుడు స్తుతింపబడును గాక
ఆమెన్== అలా జరుగును గాక
పరలోకం == స్వర్గలోకం
పరిశుద్ధ గ్రంధము== బైబిల్
కొత్త నిబంధన == బైబిల్
పాస్టర్== ప్రొటస్టెంట్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి.
బిషప్ == కేథలిక్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి
పోప్ == రోమన్ కేథలిక్ చర్చిలకు అధికారి.
భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి == "ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ద్వార "

ప్రార్ధన (వికిపిడియా నుండి)

పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!

క్రిస్మస్స్ శుభాకాంక్షలతో......

మీ,
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బస్సు

మన ఊరి నుండి పొద్దుగాలనే హైదరాబాద్ కి పోవాలంటే కడవెండి గ్రామం నుండి వచ్చే బస్సు 5 గంటలకు మన ఊరికి చేరుకునేది. అప్పుడు హైదరాబాద్ కి ఛార్జ్ 52 రూపాయలే అని గుర్తు. ఈ బస్సు నవాబ్ పేట గ్రామానికి కూడా వెళ్ళేది అక్కడినుండి జనగాం వయ భువనగిరి టూ హైదరాబాద్ కి ఉదయం 8 గంటలకి చేరుకునేది. కానీ ఇప్పుడు మన గ్రామం నుండి హైదరాబాద్ కి పోవాలంటే కడవెండి బస్సు ఎక్కి జనగాం లో దిగి అక్కడి నుండి మళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కడవెండి బస్సు ఇప్పుడు చిన్న మడుర్ కి కూడా వెళ్ళుతుంది. డైరెక్ట్ హైదరాబాద్ బస్సు సర్వీస్ ని రద్దు చేసి జనగాం వరకే సేర్విసుని కొనసాగిస్తునారు మన జనగాం డిపో మేనేజర్ గారు. బస్సు ఛార్జ్ ఒకప్పుడు జనగాంకి 10రూ. ఉండే ఆతర్వాత 14,17 ఉండే, ఇప్పుడు ఏకంగా 21 రుపాయలైంది. అంటే గత 20 సంవత్సరాల తో పోలిస్తే రెండింతలైంది. హైదరాబాద్ కి వచ్చే సరికి 100 రూ అవుతుంది. అర్ టి సి మరియు ప్రభుత్వాలు కలసి ప్రజలపై ఎంత బారాన్ని మోపుతుందో అర్ధమౌతుంది.
అసలు మన గ్రామం నుండి హైదరాబాద్ బస్సు సర్వీస్ ను ఎందుకు రద్దు చేసినట్టు? కనీసం కడవెండి మరియు సీతారాంపురం నుండి 20 కి తక్కువ కాకుండా రోజు హైదరాబాద్ కి వెళ్ళుతారు. ఇంకొందరు జనగాం కి మరికొందరు సింగరాజుపల్లి, చిన్న మడుర్, నవాబు పేట మద్యలో వచ్చే ఊరిలోనుండి కనీసం ఓ పది మంది , జనగాం లో 10 మంది మొత్తంగా సుమారు 40 కి తక్కువ కాకుండా హైదరాబాద్ కి బస్సు చేరుతది. మరి అలాంటప్పుడు ఈ కడవెండి బస్సు సర్వీస్ ని జనగాం వరకే ఎందుకు సవరించారు..? పోనీ ఒక సమయంలో తక్కువ మంది ప్రయాణం చేయడం వల్ల జనగాం మేనేజర్ గారు ఈ బస్సు సేరివిసు ని కుదించారా?
మరి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ కి వెళ్ళుతున్నారు కదా దీన్ని మేనేజర్ గారు మరియు కడవెండి, సీతారాంపురం గ్రామా ప్రజలు, నాయకులూ గమనించి కడవెండి బస్సు ని హైదరాబాద్ వరకు పొడగించ వలసిందిగా జనగాం డిపో మేనేజర్ గారికి విజ్ఞేప్తి పత్రంను అందజేయ వలసినది గా కోరుతున్నాను.
మళ్ళి మన గ్రామనికి జనగాం నుండి ఈ బస్సు సర్వీస్ ఉదయం 9:20 కి ఉంటుంది. 10 గంటలవరకు మన గ్రామానికి చేరుకుంటుంది. తిరిగి ఈ బస్సు 10:30కి బయలుదేరుతుంది. రాత్రి సమయంలో ఈ బస్సు జనగాం నుండి 7:15 నిముషాలకు బయలుదేరి 8:30కి మన గ్రామంలో ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ ను మన కడవెండి మరియు సీతారాంపురం గ్రామస్తులందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతూ...........

సీతారాంపురంలో సామాజిక...రాజకీయ....ఆర్ధిక.... పరిస్థితి..



సీతారాంపురం గ్రామానికి ప్రధాన ఆధారం వ్యవసాయం.కొందరు వారికి సాయం చేసి కూలి అనిపించుకుంటారు. మరి కొందరు వ్యవసాయ ఆధార పనులు చేస్తారు. ఇంకొందరు పశువులు( బర్లు,ఆవులు) ద్వార పాల ఉత్పతిని పెంచి ఆదాయాన్ని పొందుతారు.మా ఊరిలో వివిధ మతాల వారు అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో రజక,కుమ్మరి, కమ్మరి, ఎరికల, మాదిగ,పిచ్చకుంట్ల, లంబాడి, వడ్డెర, ముదిరాజ్, కురుమ, పద్మశాలి ,గౌడ్స్ , కాపు, అరె, బ్రాహ్మడ్లు ,కోమట్లు మొదలైన కులస్థుల వారు ఉన్నారు. వీరిలో కురుమ ,అరె,గౌడ్స్, పద్మశాలి, ముదిరాజ్, కాపు, మొ!! కులస్తుల జనాభ ఎక్కవ. ఈ గ్రామంలో హిందువులు , ముస్లింస్, క్రిస్టియన్స్ మతాలకు చెందిన వారు ఉన్నారు, అందరు ఎక్కువగా వ్యవసాయంపై ఆధాపపడి జివిస్తునారు.

గ్రామంలో గోల్లకుర్మలు గొర్రెల పోషణను , గౌడ కులస్తులు కల్లును , రజకులు బట్టలుతుకుతు, ముదిరాజ్ కులస్తులు చేపలు, తోటల పెంపకం,పద్మశాలీలు వస్త్రాలను తాయారు చేసి వ్యాపారం చేయడం, కోమట్లు వ్యాపారం, కుమ్మరొల్లు కుండలపని, కమ్మరొల్లు వ్యవసాయానికి సంబందించిన కమ్మరి పని, బ్రాహ్మలు అర్చకులుగా, ఇలా వారి వారి కులవృత్తిలను చేసుకుంటూ కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తునారు. మిగిలిన కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మరి కొందరు మేస్త్రి పని,హమాలి కూలి పని, (కరెంట్) ఎలాక్రిషణ్ పని, డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకుని సొంత ఆటోల ద్వార కొందరు, దర్జీ పనిలో మరి కొందరు, ఉపాద్యాయ వృత్తి లో ఇలా తమ జీవితాన్ని సీతారాంపురం లో కొనసాగిస్తునారు. మా ఊరి యువత ఎక్కవ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మొగ్గు చూపుతున్నారు.నేటి తరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు, పడుతున్నారు.


ఎక్కువగా యువత చదువులకోసం,ఉద్యోగాలకోసం గ్రామాన్ని విడిచి వలసలుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి వలసవేల్లరు. హైదరాబాద్ లో ఉప్పల్, రామంతపూర్, చింతల్ , జగదిర్గుట్ట, చర్లపెల్లి, ఇ సి ఐ ఎల్ మొ!! ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇంకొంత మంది , జనగామ,వరంగల్, సూరత్, మొ!! ప్రదేశాలల్లో, మరి కొందరు దుబాయ్ ,అమెరికా దేశాలల్లో ఎక్కువగా వలసలు పోయారు.

మా ఊరిలో దాదాపు నాలుగు వెయ్యీల జనాభా ఉంది. పద్దేమ్మిద్దివందల ఓటర్లు ఉన్నారు. మా ఊరిలో ప్రతి పనిలో రాజకీయం నడుస్తుంది. మా ఊరిలో ప్రదానంగా కాంగ్రెస్, టి డి పి, టి అర్ఎస్ పార్టీలకు చెందినా నాయకులూ, కార్యకర్తలున్నారు. మా ఊరిలో ఎక్కువగా గౌడ్స్ దే రాజ్యాధికారం. యువత కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

గూగుల్ మ్యాప్ లో మన గ్రామం




అనాధ వృద్ద అశ్రమం

సీతారాంపురం లో Mr. Masetti Laxminarayana గారు స్థాపించిన => ప్రేమ సదనం అనాధ వృద్ద సంగం గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వెబ్ సైట్ లో పొందు పర్చబదినవి. ఈ లింక్ ని క్లిక్ చేయండి.  
                    
ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమం

మీ సలహాలు పంపవలసిన మెయిల్ ఐ డి

ప్రియమైన  మిత్రులారా మన సీతారాంపురం పల్లె జీవనం కు సంబంధించి  మధుర జ్ఞాపకాలు , మిమ్మల్ని కదిలించిన, మీరు స్పూర్తి పొందిన సంగటనలు, వ్యాసాలను, మీ రచనలు, మీకు నచ్చిన మన గ్రామ నాయకులు మొదలైన వారిగురించి మాకు  పంపండి. ఈ పేజీ లో ఉంచుతాము. ఫోటో లు ఐన పరవాలేదు  ఏదైనా సరే మా ఇ మెయిల్ ఐ డి కి సెండ్ చేయండి.
మా  Mail ID: kadavendisitharampuram@gmail.com

ఇట్లు
మీ,
కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో శుద్దజల కేంద్రం



సీతారాంపురంలో నీళ్ళ సమస్య ..?


                     సీతారాంపురం లో ఒకప్పుడు గృహూపకరనాలకు అవసరమైన నీటి కోసం గ్రామానికి దగ్గరిలోనున్న వ్యవసాయ బావి వద్ద మరియు గ్రామంలో  అక్కడక్కడా ఉండే చేతి పంపుల వద్ద బారులు తీసి గంటల కొద్ది పడిగాపులు కాసే వారు. ఇక మంచి నీటి కోసం వాగు ఒడ్డుకు పోయి క్యాన్ లల్లో, బిందలల్లో తేసుకోచ్చేవారు. మరికొందరు గ్రామంలోని  మంచి నీటి బావి కాడికి వెళ్లి తెచ్చేవారు( ఈ మంచి నీళ్ళ బావి గుంటి ఘట్టయ్య  ఇంటి ముందు ఉండేటిది). ఈ బావిలోకి దిగాలంటే ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని వేల్లసిందే ఎందుకంటే  ఆ బావిని నేను చూసినపుడు  శిధిలావస్థలో, మెట్లు చాల దూరంగా ఖనిలు ఉడిపోతాయ అన్నట్లు ఉండేవి. మన సీతారాంపురం గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడే నాటికీ గ్రామంలో నీటి సమస్య విపరీతంగా ఉండే.

                                    
                                          గ్రామా పంచాయతి ఏర్పడిన తర్వాత మన మొదటి  గ్రామా సర్పంచ్ బస్వ రాం నర్సయ్య గారి  అధ్వర్యంలో అనేక బోర్లను, చేతి బోరు పంపులను వేఇంచడం,  నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మిచడం    జరిగింది మరియు పెద్ద ట్యాంక్ (ఓవర్ ట్యాంక్ ) ను కట్టి తద్వారా  ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేఎంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు. ఓవర్ ట్యాంక్ ని నిర్మించడం ద్వార కరంటు లేని సమయం లో కూడా నిటి సమస్య ను పారద్రోలడానికి కృషి చేశారు. గ్రామం లో ని సుమారుగా అన్ని  బోర్లు  ఉప్పు నీటి బోర్లె కావున త్రాగడానికి ఏమాత్రం అనువుగా లేకుండే, ఒక్క శివాలయం దగ్గరరుండే బోరు మాత్రమే మంచి నీటికి అనువుగా ఉండేది దానితో గ్రామ ప్రజలంతా మంచి నీళ్ళ కోసం బారులుతీసేవారు. మొత్తంమిద మన గ్రామం, గ్రామపంచాయతిగా ఏర్పడిన తరువాత నీటి విషయంలో కొంతవరకు మెరుగుపడింది. కానీ గ్రామంలో వేసిన పైపులైను మొత్తం 2 ఇంచ్లు, అక్కడక్కడ 2.50 ఇంచ్ల    పైపులను మాత్రమే   వేసి ముందు చూపు  లేకుండా వేశారనే చెప్పాలి. కానీ అప్పటి   భాద  అప్పడిదె అనట్లుగా నీటి సమస్యను మొత్తానికి విజయవంతంగా  పారద్రోలడానికి కృషి చేసినందుకు రాం నర్సయ్య గారికి కడవెండి సీతారాంపురం తరుపున అబినందనలు తెలియజేస్తున్నాను.
                                          ఇకపోతే సీతారాంపురం గ్రామ రెండవ సర్పంచ్ మరియు మొదటి మహిళా సర్పంచ్ ఐన నల్లగొండ శంకరమ్మ గారు నీటి సమస్య కోసం ఎక్కువగా కష్టా పడకుండా రాం నర్సయగారు చూపిన, చేసిన విధానాలకు అనుసరించి నీటి సమస్య రాకుండా మ్యానేజ్ చేశారంతే, కొత్తగా చేసిందేమీ  లేదు అనే చెప్పాలి కాకపోతే ఇంటింటికీ నీరు వస్తుందా లేదా అని పర్యవేక్షించేవారు. వీరి తర్వాత సీతారాంపురం గ్రామానికి మూడవ సర్పంచ్ గా బస్వ మలేష్ గారి హయంలో రాం నర్సయ్య గారు వెఇంచెన బోరులన్ని ఎండిపోయి నీటి కష్టాలు మొదలైనవి. దేనితో మలేష్ గారు గ్రామా నీటి సమస్యని తీర్చడానికి అనేక బోర్లను వెఇంచినప్పటికీ ఒక్క బోరు కూడా సరిగా   పడకపోవడంతో కొన్ని చోట్ల బోరుపంపులను బిగించి నీటి సౌకర్యని పెచారు. కానీ ప్రస్తుతం  పాత బోరులు 4 మాత్రమే నడుస్తున్నవి.  ఓవర్ ట్యాంక్ లోకి ఈ బోర్ల నీరు పోవాలంటే చాల ప్రెజర్తో నీటిని పోస్తే తప్ప అంత పైకి  ఎక్కవు 4 బోరులు కలసి 2 బోరులు పోసినట్లు  పోస్తున్నవి అంటే ఇప్పుడు సీతారాంపురం గ్రామానికి 2 బోరులే ఉన్నట్టు లెక్క , దీనిద్వారా గ్రామం లో నిటి సమస్య విపరీతంగా పెరిగింది. అక్కడక్కడ కొన్ని సేవసంఘలతో కలసి కొన్ని చేతి పంపులను వేఎంచారు కానీ ఆ నిరు చాల ఉప్పు నిరు కావున వాటి వినియోగం చాలాతక్కువ. కొన్ని బోరు పంపులు ప్రస్తుతం  కన్పిచడం లేదూ. గ్రామంలో మంచి నీటి సమస్య ని తీర్చడం కోసం నిధులు సేకరించి  శుద్ధనీటి పరికరాన్ని (వాటర్ ఫిల్టర్ మిషిన్) తెచ్చి మంచి నిటి సమస్యను సీతారాంపురం గ్రామంలో పూర్తిగా నిర్ములిన్చినందుకు కడవెండి సీతారాంపురం ద్వారా మల్లేష్ గారికి  అబినందనలు తెలియజేస్తున్నాను. కానీ గృహోపకరనలకు అవసరమైన నీటిలో మాత్రం విపలమైనారు.

                          గ్రామానికి 4వ సర్పంచ్,  రెండవసారి సీతారాంపురం గ్రామనికి  సర్పంచ్  గా వచ్చిన బస్వ మల్లేష్ గారు   ప్రస్తుత గ్రామ నీటి సమస్య గురించి పట్టించుకోని గ్రామంలో నీటి సమస్యను నిర్మూలించాలి.
                        వారికీ కడవెండి సీతారాంపురం తరుపునుండి కొన్ని సూచనలు అనికోండి, సలహాలనుకోండి ఇంకేమైనా అనుకోండి........

1)ప్రస్తుతం గ్రామంలో 4 బోర్లులే నడుస్తున్నవి, ఇంకో 5 బోరులను పడేవరకు వేఎంచాలి.
2)గ్రామంలోని అన్ని విదులల్లో ఉన్న పైపులైనులను ప్రక్షలనుగావించి, కొత్తగా   3 ఇంచుల పైపులైను లను వేఎంచాలి.
3)   బోరు బావి పంపులను పునరుద్దరించాలి.
4) ఓవర్ ట్యాంక్ వద్ద అవసరమైతే ఒక పెద్ద కులాయీ మాదిరి కట్టి, ఇక్కడినుండి మోటార్ల ద్వార ఓవర్ ట్యాంక్ లో నీటిని పొఎంచలి.
5) వీలైతే  గ్రామంలోని అన్ని విదులల్లొ ఉచిత నల్లాలను వేఇంచాలి.
6) నాల్లలను తెప్పువారు ( వాటర్ మెన్) అన్ని బజారులకు సమానముగా నీటిని విడుదల చెయ్యాలి, చేసేటట్లు చూడాలి.
7) అవసరమైతే ఒక జనరేటర్ తెచ్చి 24 గంటలు మోటారు ను నడిపించి నీటి సమస్యను తీర్చాలి.
8) ముఖ్యంగా నిటి వినియోగం పై గ్రామా ప్రజలకు అవగాహనను తేసుకరావాలి. నీరు సరిపోయీన తర్వాత నాల్లలను ముఎంచేల సూచించాలి.
9) అవసరమైతే గ్రామా ప్రజలనుండి కొన్ని నిదులను సేకరించి ఈ సమస్యలన్నీ తీర్చాలి.

       మీకు(కడవెండి సీతారాంపురం) తెలిసిన సమస్యలను కూడా జతచేయ్యండి. ఈ సమస్యలను గ్రామా సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లడానికే  నా ఈ చిన్ని ప్రయత్నం........
(ఈ నీటి సమస్యని నేను ప్రేత్యేకంగా అనుభవించాను కనుకనే ఈ చిన్ని సలహా)

మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ వీడియో...

సీతారాంపురంలో మద్యం

మా ఊరిలో ఒక డాక్టర్ గారు మద్యం గురించి ఇలా సెలవిచ్చారు
మంచానికి పరిమితమైన ముసలోడు, పక్షవాతం వచ్చిన ముసలోడు, ఒళ్ళు నొప్పులునా కష్టజీవి, మద్యం వ్యసనంగా మారీ మంచంపట్టిన ముసలోడు, చావుకు దగ్గరైన ముసలోల్లదంరికి ఈ మద్యం ఒక మంచి తనిక్ ల పనిచేస్తుంది. వీరంతా మాంద్యాని సేవిన్చుతే వారం రోజుల్లో తిరిగి మాములు స్థితికి వస్తారు అని చెప్పాడు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను యుట్యూబ్ లో ఒక డాక్టర్ గారు చెప్పింది విని అర్చేయ్యపోయాను. వీరు చెప్పింది ఏందంటే........

మనిషికి కాన్సోనంట్ స్పిరిట్ తగిన మోతాదులో అవసరం. రోజు మనిషికి
40--60 యం ఎల్ బ్రాంది, విస్కీ తీసుకుంటే హార్ట్ కు మంచిది వీటిలో ఉండే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆంటి ఆక్సిడెంట్ గ పనిచేస్తాయి.
130--150 యం ఎల్ వైన్ , 350 యం ఎల్ బీర్ తీసుకుంటే మంచిది.
ఒకవేళ ఈ మోతాదుకు మించి తాగితే వాటిలో ఉండే టాక్సిస్ ప్రొడక్ట్స్ రిలీస్ అయ్యీ హార్ట్ డ్యామేజి అవుతుంది. మరొక డాక్టర్ గారు పైన చెప్పిన దానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలులేవని కాకపోతే చాల తక్కువ మొత్తంలో
అమావాస్యకో, పున్ననికో పండగలకో, పంక్షన్లకో, నెలకో, సంవత్సరానికో ఒకసారి మద్యం ని సేవిన్చితే పరవాలేదు కానీ రోజుకి,పుటకి, గంటకి, అర్ద గంటకి ఒకసారి తాగితే మాత్రం చాల ప్రమాదం అని సెలవిచ్చారు.

మా ఊరిలో ఒక్కప్పుడు దొంగచాటున సారా, కోటార్ సిసలు, బీర్లు మొదలగునవి ఒకటి , రెండు చోట్ల తప్ప మరేకడ దొరికేవి కావు. ప్రస్తుతం బ్రాంది షాప్లు 5 కు పైగానే ఉన్నవి. సాయంత్రం అయిందంటే చాలు ఎలాగు అందుబాటులో ఉంది కదా అని గ్రామా ప్రజలు మరియు యువత సహితం తక్కువ కాదు అన్నట్లు తెగ తాగుతున్నారు. తాగి రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలు, రోగాలు, పిల్లల పట్ల నిర్లక్ష్యం, ఉద్యోగ విధుల పట్ల అలసత్వం లాంటి వికృత ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది మా ఒక్క ఊరిలొని జరుగుతుంది అంటే పొరపాటు, ప్రతి ఊరిలో, ప్రతి పట్టనాలల్లో , ప్రతి దేశాలల్లో జరుగుతున్న వాస్తవం అని , మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా పేర్కొంది. మద్యం వ్యసనంగా మారితే ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారి అని కూడా తెప్పింది. ఇకపోతే మా ఊరి విషయాని కొస్తే మొన్న పండుగకు తాగి వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగి రెండు నిండు ప్రాణాలు బలైన విషయం అందరికి తెలుసు. ఆ సమయం లో మేము కొందరం కలసి మన ఊరిలో మద్యాన్ని, మద్యం షాప్లను ముషివేస్తే బాగుంటుందని చెప్పి గ్రామా ప్రజల్లో కొంతమందికి చెప్పాము , ప్రజల నుండి మాకు చేదు అనుభవం ఎదురైది . మన ఊరి లో షాప్ లు మూసివేసి నంత మాత్రాన తాగుడు బంజేస్తారా... , తాగేవాడు మన ఊరిలో కాకపోతే పక్క ఊరిలో తెచ్చుకొని తాగుతాడు...., ఈ రోజుల్లో ఎవడు తాగనోడు....., వాడు తాగి బండిని ఎందుకు నడపాలి.... , ఇలా తాగి సచ్చేటోడు సావని అన్ని కూడా సెలవిచ్చారు తప్పితే మేము బెల్ట్ షాప్ లను ముఎంచడానికి ఒప్పుకోము అన్నట్లుగా సమాదానం ఇచ్చారు. ఇదే సమస్యను సర్పంచ్ గారి దృష్టికి తేసుకేల్లుతే తప్పకుండ బెల్ట్ షాప్ లను ముఎంచడానికి కృషి చేస్తాను, మరో రెండు మూడు రోజుల్లో ముఎంచుత అనేటట్లు మాట్లాడి, హామీ ఇచ్చి 2 నెలలు దగ్గరి కోస్తున్న ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. సర్లే మన ప్రభుత్వానికి బుద్ది లేదు జనాల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. అసలు ఈ సమస్త్య ప్రపంచ సమస్యగా నేడు అందరిని పట్టిపిడిస్తుంది. ఇదంతా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వాలు గుర్తిస్తుండటంతో ఈ సమస్య నెలకొంది.


మద్యపానం వల్ల కొన్ని నష్టాలు.......



1) ఒక్క చుక్కేఅనిఅనుకోవద్దు.కొన్నిచుక్కలుకలిసిమహాసముద్రమై జీవితాన్ని ముంచేస్తుంది.
2)మద్యపానం కుటుంబ నాశనం అని గుర్తుంచుకోవాలి.
3)మద్యం అల్లరిపాలు చేస్తుందని మరచిపోవద్దు.
4)మద్యపానం నిన్ను అప్పుల అప్పారావుగా చేస్తుంది.
5)మద్యపానం వల్ల ఒక్కోసారి ఉద్యోగాలూడతాయి.
6)మద్యపానం వల్ల ఇల్లు గుల్లవుతుందని తెలుసుకోవాలి.
7) శారీరక ,మానసిక ఆరోగ్యమ్ పై ప్రభావం చూపుతుంది.
 పురుష జన్యు లక్షణాలైన శుక్ర కణాలు నశిస్తాయి.
9)అలసిన, సొలసిన జీవితానికి త్రాగుడు కాదు, మంచి ఆహారం ముఖ్యం.
10) కేవలం మత్తును కలిగించే పదార్థాలు శాంతిని, నెమ్మదిని, విశ్రాంతినిస్తాయని తలచటం పొరబాటు. మానసిక, శారీరక విశ్రాంతిని సహజంగానే పొందడానికి అలవాటు పడాలి.
11)త్రాగుడు మా వంశపారంపర్య అలవాటు అని త్రాగే అలవాటును మీరు సమర్థించుకుంటే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం
చేసుకున్నవాళ్ళు అవుతారన్న విషయం గ్రహించండి..
12) నరాల ఒత్తిడి, కోపం రేగినప్పుడు త్రాగుట వుత్తమం అని అనుకోవద్దు. అలా అది చిన్న పొరపాటు నుండి పెద్ద పొరపాటుకు అవుతుంది .

                                     ఖచ్చితంగా త్రాగుడు మానివేయాలి అనే దృడమైన కోరికను కలిగి వుండాలి. మద్యపానాన్ని మానలేకపోతున్నామని బాధపడేకంటే మానేందుకు మనంకనీస ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి.
వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుంటే మద్యపానాన్ని నీ అంతట నీవే మానివేయడానికి అవకాశం వుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం గురించి ఒక పుస్తకమే రాయవచ్చు.
ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు!!

మీ,
కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో పీర్లపండుగ


ఎక్మారే ...... రడబుషణ ..........అసేయ్  దులా............ దులా...........
మొహరం శుభాకాంక్షలు......


 పీర్లపండుగ మా గ్రామంలో కుల ,మతాలకు అతీతంగా అందరు కలసి అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పండుగను పది రోజులపాటు ఒకొక్క సవారీని(పిర్లు) ఊరేగిస్తూ,కొరడాలతో హాల్ చల్ చేసుకుంటూ గ్రామంలోని ప్రతి వాడకు తిప్పుతారు.

చిన్నపుడైతే పీర్లపండు గోచ్చిందంటే గ్రామా పంచాయతి ముందుండే పిరీల కొట్టం కడనే ఉంట్టుటిమి. పిరీల ముందు నిప్పుల గుండం(అల్వా) ఏర్పాటు చేసేవారు ఈ నిప్పుల గుండం చుట్టూ మేమంతా చేరి రౌండ్ గా తిరుగుతూ దొరికిచ్చుకునుడు ఆట అడేటోల్లం, మా పాదాలకు, మోకలకు అంత మసి అన్టేడిది. పిరిలా దగ్గరకు వెళ్ళగానే ఊదు వాసనా గుభాలించేది, శిగం వచ్చిన వారిని చూసి భయమేసేది, కొంతమంది వేషాలు వేసుకొని అల్వా చుట్టూ తిరుగుతూ పాటలు పడేవారు. ఒకొక్క సవారిలకు ఒకొక్క పెరును పెడుతారు. రోజు ఒక సవారీని సాంబ్రాణి పొగతో లేపి ఊరు మొత్తం తిప్పుతారు. నా చిన్నప్పుడు సవారీలను ఎత్తుకోవడానికి పోటిపడేటోల్లం ముఖ్యంగా రడబుషణ సవారీని ఎత్తుకోవడానికి బడికి కూడా డుమ్మాలు కోటేటోల్లం. ఇంటి ముందుకొచ్చిన ఈ పిర్లుకు గ్రామప్రజలకు బిందదు నీళ్ళను సవారీ ఎత్తుకున్న వారి పాదాలను తడుపుతారు ఆతరువాత ఒక కొబ్బరిచెక్క, 10నుండి 100 రూపాయలవరకు సవార్లకు కట్టి, ఊదు పొగ వేసి మొక్కుతారు, ముస్లిం దగ్గరుండే నెమలి ఈకల కట్ట, నెత్తి మిదపెట్టి ఆశిర్వదిస్తాడు.

పీర్లపండుగ చివరి రోజు తల్లి సవారీని లేపుతారు, ఈ తల్లి సవారీ క్రింది నుంచి పోతే పాపాలు పోతాయని పెద్దల నమ్మకం. ఈ రోజు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క మొద్దుతుంటనైన తెచ్చి అల్వాలో వేస్తారు, తద్వారా మనకు మంచి జరుగుతుందని నమ్మకం. ఈ రోజు సాయంత్రం గ్రామా ప్రజలంతా అల్వా చుట్టుచేరి సవరిలను ఎత్తుకొని భజనలు,కోలాటం,జానపద పాటలు, ఆటలతో వేడుకలను జరుపుకుంటారు. సవరిలదగ్గర మటికిలు( బెల్లం నీళ్ళు ) అందరికి ఇస్తారు. ఈ పండుగ కులమతాల ఐక్యతకు ప్రతీకగ నిలుస్తోంది.

మీ,
కడవెండి సీతారాంపురం.

ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమం

ప్రేమ సదనం అనాధ వృద్ద అశ్రమంను అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను యం.లక్ష్మినారాయన గారు స్థాపించారు. మన మండలం లోని చుట్టుపక్కల గ్రామాలలో ఉండే అనాధ వృద్దులను ఈ వృద్ద అశ్రమంలొ చేర్పించావలసిందిగా కోరుతున్నాను మరియు వారికైయే కర్చుల నిమిత్తము సేవ ద్రుపధం ఉన్నవారు తినుబండారాలు కానీ , బట్టలు కానీ , భూమిని కానీ , బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ మరియే ఇతర రూపంలోనైన మీ సహాయం చేయవలసింది గా కడవెండి సీతారాంపురం నుండి కోరుతున్నాను.

దాతలు సంప్రదించండి.






Mr. లక్ష్మినారాయన, ఫోన్ నెంబర్ 996358474.
మనీ రూపంలో
1. Through DD or Cheque in favour of "Prema Sadanam AVS" Andhra Bank , Payable at Deveruppula, Warangal dist, AP.
2. Online transfer or direct deposit into Current A/C: 012011011000167 , Account Name: "Prema Sadanam AVS", Bank Name: Andhra Bank Branch Name: Devaruppula, Warangal dist AP.
3. Make a permanent fixed diposit towards "Prema Sadanam AVS" in Andhra Bank and allow the monthly interest money to be used for Ashram services

ధన్యవాదాలు !!

మీ,
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బతుకమ్మ పాట .........

పోరుగడ్డ మాది ఊయ్యలొ..... విప్లవాల నెల ఊయ్యలొ.....

రైతాంగ పోరాటం ఊయ్యలొ..... మొదలైంది మా ఉల్లో ఊయ్యలొ.....
విస్నూరు దొరలను ఊయ్యలొ..... వీరంగమడించె ఊయ్యలొ.....
బడిసేలు,కొడవడ్లు తో ఊయ్యలొ....బయంకర గెరిల్లా యుద్దలు ఊయ్యలొ....
రాజకర్లనేదిరిచి ఊయ్యలొ..... రణరంగమే చేసిండ్రు ఊయ్యలొ.....
ఈ రణరంగంలోన ఊయ్యలొ..... అమరుడైడమ్మ కొమురన్న ఊయ్యలొ....
మాఊరి కొమురన్న ఊయ్యలొ.. తొలి రైతాంగపోరాట అమరుడమ్మఊయ్యలొ...
మా ఊరి బతుకమ్మ ఊయ్యలొ.... బతుకు పోరాటాల గడ్డ ఊయ్యలొ....
సంతోష్,మహేష్అన్నలుఊయ్యలొ.... ఈ జగత్తుకే ఆదర్శం ఊయ్యలొ....
జాతీయ విప్లవాలలో ఊయ్యలొ.... మా ఊరే ఆదర్శం ఊయ్యలొ....
తెలంగాణా యావత్తు ఊయ్యలొ.... ఎలుగెత్తి జై కొట్టే ఊయ్యలొ....

ఆడపడుచులంత చేరి ఊయ్యలొ.... బతుకమ్మలాడంగ ఊయ్యలొ....
శివాజీ బొమ్మ ముందు ఊయ్యలొ.... శివమెత్తి అడంగా ఊయ్యలొ....
శివుని గుడిలోన ఊయ్యలొ.... శివన్న అసిస్థులతో ఊయ్యలొ....
సిరులే పండంగ ఊయ్యలొ.... హొమలె కల్చితిమి ఊయ్యలొ....
ఊరి శని పోవాలని ఊయ్యలొ.... శిని గ్రహలనే ప్రతిటించితిమి ఊయ్యలొ....
కన్నా తల్లివోలె ఊయ్యలొ... మా కన్నా లక్ష్మి నారాయణ ఊయ్యలొ....
అనాధలందరికి ఊయ్యలొ.... అనాధ ఆశ్రయం పెట్టె ఊయ్యలొ....
దుర్గమ్మ గుడిలోన ఊయ్యలొ.... వెలసినదమ్మ మా తల్లి ఊయ్యలొ....
దుర్గమ్మ అసిర్వాదలతో ఊయ్యలొ... మా అస్విత్వం చాటంగా ఊయ్యలొ....
మైసమ్మ తల్లికి ఊయ్యలొ... మొన్ననే బోనాలు చేత్తిమి ఊయ్యలొ...
మాఊరి అబివృద్దిలోన ఊయ్యలొ.. రాంనర్సయ్యను మరవజలవమ్మ ఊయ్యలొ.....
అందరి సహాయంతో ఊయ్యలొ... మంచినీళ్ళ కోసం ఊయ్యలొ...
మల్లెషన్న తెచ్చినాడమ్మ ఊయ్యలొ... మంచినీళ్ళ మిషిన్నమ్మ ఊయ్యలొ...
మా ఊరి బడిలోన ఊయ్యలొ... బలపమే పట్టితిమి ఊయ్యలొ...
బలపము పట్టిన చేతులులతో ఊయ్యలొ... పోరుజెండ పట్టి ఊయ్యలొ...
జై తెలంగాణా అనుకుంటూ ఊయ్యలొ...తెగించి పోరాటం చేసినాము ఊయ్యలొ..
తెగించి పోరాటం చేసి ఊయ్యలొ... తెలంగాణా సాదించినాము ఊయ్యలొ...
మా నీరు,మా భూమి ఊయ్యలొ...మా ఉద్యోగాలు,మా నిధులన్నీఊయ్యలొ...
మవేనని చాటంగా ఊయ్యలొ.. ఆంధ్రోడు అడ్డొచ్చే ఊయ్యలొ...
ఇసుంట రాంమంటే ఊయ్యలొ... ఇల్లంతా నాదన్నాడు ఊయ్యలొ...
తెలంగాణాను అపుదామని ఊయ్యలొ... తైతక్కలడుతుండు ఊయ్యలొ...
తెలంగాణాను ఆపలేక ఊయ్యలొ... హైదరాబాద్ మిద పడ్డాడమ్మఊయ్యలొ...
వాడు ఎన్ని జిముక్కులు చేసిన ఊయ్యలొ..హైదరాబాద్ మానదమ్మ ఊయ్యలొ..
న్యాయ ,ధర్మము ఊయ్యలొ... అధిష్టానంమే మన చెంత ఉండంగా ఊయ్యలొ...
మనకు భయమేల ఊయ్యలొ... ఒకవేల హైదరాబాద్తో కూడిన ఊయ్యలొ...
తెలంగాణా ఇయ్యాకుంటే ఊయ్యలొ... తెలంగాణాలో అధిష్టానాన్ని ఊయ్యలొ...
అగముచేద్దము ఊయ్యలొ... ఈ పోరులోన ఊయ్యలొ...
మనమే ముందుండాలి ఊయ్యలొ... అమరుల త్యాగాలను ఊయ్యలొ...
వృధకానియ్యమమ్మ ఊయ్యలొ... బతుకమ్మ బతుకమ్మ ఊయ్యలొ....
మా ఊరి బతుకమ్మ ఊయ్యలొ....


మీ,
కడవెండి సీతారాంపురం.

బిడ్డలను అడగమంది

మనల్ని పెంచి పెద్ద చేసిన మన ఊరు.... తన బిడ్డ లను ఇలా అడగమంది...

ఓనమాలు నేర్పిన మన విధిబడి.. బోసిపోతు నీకు సెలవు అడగమంది...
శివాజీ బొమ్మ బట్టలుడి సిగ్గుతో.. నీకు సెలవు అడగమంది...
కుశలం అడగమంది....... కుశలం అడగమంది...
బ్రతుకు లోకి నిన్ను పంపిన విధి రోడ్డు... గతుకులతో నీ కుశలం అడగమంది...
రోడ్డు మిద గాంధీ బొమ్మ నవ్వుతూ.. కర్ర విరిగి,వంగిపోతూ నీ త్యాగం అడగమంది...

ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు, ముందు ఎవరు మోశారో గుర్తుందా.....
పొలందున్ని, దొడ్డ్లుచ్చి, పాలుపితికి, ఆనాటి చిలిపి పనులు మరువనంది...
నిన్ను ఎత్తుకు పెంచిన ముసలవ్వ, నీ క్షేమం అడుగమంది.....
ఆనాద అశ్రమంలొ అవ్వలను అధరించమనిఅడిగినది......
దుర్గమ్మ గుడిలోన హుండిల బాగోతం అడగమంది.....
విధిరోడ్ల స్తంబాలకు, విధి లైట్లనడగమనది .....
అవకాశ, అన్యాయ పంచాయతి తీర్పులను.... వందేండ్ల వేపచెట్టు అడగమంది......
ఈ కుళ్ళు రాజకీయాలతో తనను బంధినుండి విముక్తిచేయనదిగినది...
పండగపూటా ఇల్లు కడగా......నీళ్ళనడిగినది.......
దొర్లు పోవు కాలంలో దొరలా నివ్వు ఎదగాలని, ఎవ్వరు తపస్సు చేసారో..
పొర్లు పొర్లు దండాలతో మొక్కుకుంటూ నీ తల్లి, నిరసించి నీ క్షేమం అడుగమంది.....
బరువుకాకు బ్రతుకులోన ఎప్పుడు.... ఎవ్వరికి... ఓ మనసా.......



కడవెండి సీతారాంపురం.

సీతారాంపురంలో భోనాల పండుగ

భోనాల పండుగ సీతారాంపురం న్యూస్ లైన్ 25 ఆగష్టు :-దేవరుప్పుల మండలం లోని సీతారాంపురం గ్రామంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగను జరుపుకున్నారు. మహిలలు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.ఈ పండుగను గ్రామా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉత్సవాల్లో గ్రామా పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.



స్వాతంత్ర్య దినోత్సవం--- సీతారాంపురం

స్వాతంత్ర్య దినోత్సవం (ఆగష్టు 15,1947) దేశం బానిస సంకెళ్ళు నుండి విముక్తి పొందిన రోజు.
దేశమంతటా సంబరాలు జరుపుకునే రోజు , స్వాతంత్ర్యము కోసం పోరాడిన వీరులను తలుచుకుంటూ దేశ పతాకాన్ని ,జాతీయ గేయాన్ని పాడుతూ జాతి ఐక్యమత్యాన్ని గౌరవించే రోజు. ఈ గొప్ప పండుగను దేశమంతట ఎలా అయితే జరుపు కొంటున్నమో కడవెండి సీతారాంపురంలో కూడా అలాగే జరుపుకుంటారు.
గ్రామ ప్రజలు అధిక భక్తి శ్రద్ధలతో గ్రామంలోని వివిధ ప్రాంతాలలో ఈ జెండా వందనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరిగా గ్రామ ప్రాధమిక విద్యశాలలోసమావేశామౌతారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హజరౌతారు. ప్రాధమిక విద్య ప్రధానోపాద్యయ సమక్షంలో జెండా వందనం పూర్తి అయిన తర్వాత గ్రామ ప్రముఖులను స్టేజి ఫై ఆహ్వానించి ,ఈ పండుగను ఎందుకు జరుపుకొంటున్నమో తెలియజేస్తూ, గ్రామాభివృద్ది కై చేర్చిచుకుంటారు.అటుపై కొన్ని క్రీడాకార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రీడాకార్యక్రమలలో యువత ఆశక్తి తో పాల్గొంటారు.వీటిలో ముఖ్యమైన రాష్టక్రీడ కబడ్డీ కచ్చితంగా ఏర్పాటుచేస్తారు. సాయంత్రం గ్రామ పంచాయతి ముందు సంస్సృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి గేలుపొందిన వారందరికి భాహుమతులు ప్రాదానం చేస్తారు. కానీ...........
ఇదంతా నాటి మాట....................................

మరి నేటి మాట
.....................................

స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇదేదో మొక్కుబడిగా సాగే ఒక కార్యక్రమంగా మారింది.అప్పుడెప్పుడో దేశం కోసం కొందరు పోరాటాలు చేసారు అందుకే ఈ రోజు మాకు చాక్లెట్లు ,బిస్కెట్లు ఇస్తున్నారు అనే అబిప్రాయం విద్యార్ధులలో కలగడం,యువత సైతం అదే అబిప్రాయంలో ఏదో జరుపుకోవాలిగా అన్నట్లుగా ఈ పండుగను కొనసాగిస్తూoడటం,దేశమంతటా ఇలాగే కొనసాగుతుండడంతో కడవెండి సీతారాంపురంలో సైతం మొక్కుబడిగా సాగిస్తున్నారు.
ఈ పండుగలో చెప్పుకోదగ్గ ఆశక్తి కనిపించకపోవటంతో, సీతారాంపురం గ్రామ ప్రజలు కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం విచారకరం. గ్రామాభివృద్ది కొరకు మాట్లాడే స్టేజిలు లేవు అసలు మాట్లాడేవారే లేరు.ఇక గేమ్స్ సంగతి అంతే ఆడాలన్న ఆటస్థలాలూ లేవు ,అసలు ఆడేవారీ లేరు. ఒకవేళ మేము ఆడుతామన్నఆటలుపెట్టేవరే లేరు.

గ్రామ ప్రజలందరిలో ఒక యూనిట్ గా తిసుకోనిరావలసిన అవసరం మనందరికుంది.రండి చెయ్ చెయె కలుపుదాం చైతన్యన్ని తిసుకోద్దం.

జన సముద్రంగా రండి జనగణమన పడడానికి.....
క్రీడాశక్తితో రండి కిరీటాన్ని జయించడానికి......

మీ,కడవెండి సీతారాంపురం


వానకొండ లక్ష్మినరసింహస్వామి

సీతారాంపురం గ్రామానికి దగ్గరిలో వానకొండ లక్ష్మినరసింహస్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట 

మీద నరసింహస్వామి 

ఆసీనులై వున్నారు. భక్తులు కోరిన కోరికలను తిరుస్తున్నాడు. ఈ గుట్ట ప్రతి సంవత్సరం ఉగాదికి 15 రోజులు 

ముందు తిరుణాలు జరుగుతాయి. ఈ తిరుణాలకు ముక్యంగా దేవరుప్పుల మండలంలోని గ్రామాల ప్రజలు 

తండోపతండాలుగా నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ గుట్ట మీద వెలసిన లక్ష్మినరసింహస్వామి వారిని 

వానకొండ లక్ష్మినరసింహస్వామిగా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ తిరుణాలకి భక్తులు ప్రతి ఇంటికొక ఎడ్లబండిని 

కట్టి గుట్ట క్రింద మేకలను,కోళ్ళను కోసి స్వామి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఇక్కడే భక్తులు 

వనభోజనముగా వండుకొని,కుటుంబ సమేతముగా బోజనము చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఈ గుట్ట క్రింద 

అనేక దుకాణాలు తిరుణలుగా, భక్తులకు కనువిందును కలిగిస్తాయి.సాయంత్రసమయములో భక్తులు షాపింగ్ 

చేస్తారు.


అనాధ వృద్దాశ్రమం

                   యం.లక్ష్మినారాయన గారు  ప్రేమ సదనం అనాధ వృద్ద సంగంను   13-11-1998న స్థాపించారు.  అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను ప్రారంబించారు.  వృద్దులకు కనీస అవసరాలైన తిండి ,కూడు, గుడ్డలను మరియు ఆరోగ్యం సంబంద విషయాలను దగ్గరుండి సేవచేస్తున్న మహానుభావుడు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.


                         సీతారాంపురం గ్రామంలోని శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం వద్ద  58  హొమ గుండాలతో శాహస్త్ర చండి యాగంను జరిపించారు.  ఆశ్రమ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామంలో అనేక సేవలు చేస్సున్నారు.











మా ఊరి బతుకమ్మ........

  •                 మన తెలంగాణా లో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ
    ఈ బతుకమ్మ పండుగను గౌరి లేదా సద్దుల పండుగ అనికూడా అంటారు.

    మన కడవెండి సీతారాంపురం లో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు
    అంబరమంటేలగా జరుపుకోవడం ఆనవాయీతిగా కొనసాగుతుంది.
    పండుకోచ్చిదంటేచాలు ఎంతో సంతోషంతో మా ఊరి కి చేరుకుంటాము. పండక్కి మా అక్క, వాళ్ళ పిల్లలతో మా ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
    (అడపడుచులందరూ అత్తవారింటి నుండి కన్నావారింటికి చేరుకుంటారన్నమాట )
    పండుగ ముందురోజు నేను మరియు మా స్నేహింతులు కలిసి పువ్వులకై మా భావికాడినుండి రోడ్డు అవతలున్న కంచలొ తంగేడి,గునుగు,గడ్డి చామంతి,నూకల పువ్వులు ఇలా అనేక రకముల పువ్వులు తో సహా సితాఫలములు(సిల్పక్కాయలు) కూడా తెచ్చేవాల్లము.
    గత కొన్ని సంవత్సరాలనుండి కంచెలను నరికివేయడం మరియు పత్తి పంటల వల్ల తంగేడి,గునుగు పువ్వులు కనిపిచకుండా పొనై వీటికి బదులు టేకు పువ్వులు మరియు రోడ్డులపై ఉన్న గవర్నమెంట్ చెట్ల పులు తెస్తున్నాము. ఈ పువ్వులను అడపడుచులకివ్వగా ,పళ్ళెం లేకపోతే తాంబలం లో జాగ్రత్తగా చుట్టూ వలయాకారంలో మొదటగా తంగేడి పులు పేర్చి,ఆ తర్వాత గునుగుపులు వివిధ రంగులలో ముంచి వాటిని పేర్చుతారు. మధ్యమధ్యలో వివిధ రకముల పువ్వులనూపయొగించి ఆ పై పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి కొవ్వత్తితో దీపాన్ని వెలిగిస్తారు. ఈ పెర్చిన బతుకమ్మను దేవుని గదిలో ఉన్న దేవుళ్ళ ముందు పెట్టి పుజిస్తారు.

    సాయంత్రసమయన గ్రామా మహిళలందరూ డప్పుగాళ్ళ సందడి నడుమ మొదటగా గ్రామా బొడ్రాయి వద్దకి చేరుకొని, ఇక్కడినుండి జనసముహముగా గ్రామా చెఱువు గట్టు వద్ద నున్న శివాజీ బొమ్మ వద్దకు చేరుకొని, వారివారి కులములదారముగా గుపులు గుంపులుగా చేరి తులసి లేదా యంపటి చెట్టు ను మద్యలో పెట్టి దీనిచుట్టు బతుకమ్మలను దించి పురోహితుని మంత్రాలతో బతుకమ్మలకు పూజలుచేసి, ఆతర్వాత బతుకమ్మ ల చుట్టూ గౌరీ మాతను కీర్తిస్తూ చప్పట్లతో పాటలను పాడుకుంటూ వారి భక్తిని చాటుకుంటారు. ఈ సందర్బంలో ఆడపడుచులు వారి యోగక్షేమాలు ,అత్తారింటి ముచ్చట్లు, చీరలు, ఆభరణాలు ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆదో వింత అనుభూతి. ఇలా సుమారుగా రెండు గంటల తర్వాత ఈ బతుకమ్మ లను తీసి పక్కనే వున్న గ్రామ చెఱువులో నిమర్జనం చేస్తారు.
    అటుపై పళ్ళెం లో వీరు తెచ్చిన పసుపుకుంకుమలను వారివారి పుస్తెలకు బొట్టుగా పెట్టుకొని వాయినాలు ఇచ్చుకుంటారు తర్వాత బెల్లం ,చెక్కర, వేరుశనగలు, నువ్వులు,మొక్కజొన్నలు,భియ్యం మొదలైన వాటితో చేసిన ప్రదార్ధాలను ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక దీనితో బతుకమ్మ పండుగ
    ముగిస్తుంది. ఇది మా ఊరి బతుకమ్మ......

                          
                                       



ఆంజనేయ స్వామి టెంపుల్

శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ సీతారాంపురం  

శివాలయం

శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం సీతారాంపురం





సీతారాంపురానికి హైదరాబాద్కి దూరం


సీతారంపురం :--

సీతారంపురం  గ్రామం  వరంగల్ జిల్లా లోని దేవరుప్పుల మండలంలోఉంది. వరంగల్ జిల్లాకి ఈ గ్రామం  53.5 km దూరంలో ఉంది.హైదరాబాద్ కి  94 km దూరంలో ఉంది.

ఈ గ్రామనికి దగ్గరిలో  పాలకుర్తి (11.6 k.m.) ,కొడకండ్ల (14.5 k.m.) ,లింగాలఘనపూర్(21 k.m.) ,రఘునతపల్లె(26.7 k.m.) పట్టణాలు ఉన్నవి.

దేవరుప్పుల మండల్లోనే అప్పిరెడ్డిపల్లె  , చౌడూర్ , ధర్మాపురం  , ధరావత్ తండ,  కామారెడ్డిగూడెం,రాంరాజ్‌పల్లి,సింగరాజ్‌పల్లి,నీర్మాల,కోల్కొండ,మాదాపురం, కడవెండి, సీతారాంపురం,నీర్మాల, గొల్లపల్లె ,మన్‌పహాడ్,మదూర్‌కలాన్,మదూర్‌ఖుర్ద్ గ్రామాలూ ఉన్నవి.



సీతారాంపురం దగ్గరిలొని  పట్టణాలు

జనగాం  27 km      
భువనగిరి  51 km      
సూర్యాపేట  62 km      
వరంగల్  63 km దూరంలో ఉన్నవి.

మా ఊరి దసరా......

సీతారాంపురం గ్రామపంచాయతి  ముందు దసరసంబారాలు ...



దసరా వచ్చిందంటే మాకందరికీ పండగే.మా ఊరిలో దసరా బాగా జరుపుకుంటాము.  పండుగలన్నింటిలో  పెద్దపండుగ కాబట్టి చదువులరీత్యా గాని, ఉద్యోగరీత్యా  గాని హైదరాబాద్‌లో ఉన్నా ప్రతి ఒక్కరు ఈ  పండుగనాడు మాత్రం ఊళ్లోనే ఉంటాం . చిన్నప్పుడు దసరా పండుగ అంటే... కొత్త బట్టలు.. టపాసులు... పిండివంటలు. ఇప్పుడు దసరా అంటే.. బంధువులు, మిత్రులందరినీ కలవడమే.

         దసరా పండుగ చరిత్రను చూసినట్లయితే రాముడు రావణుని పై గెలిచినందుకు,పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజైనందుకు ,జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ఈ  పండగను  జరుపుకున్నాము. 
    

  ఇకపోతే  నేను  పండుగనాడు పొద్దున్నే లేచి స్థాన్నం  చేసి, మామిడాకులు, బంతిపూలతో దండలు గుచ్చి దర్వాజలకు కట్టి   ఆ తర్వాత కుటుంబ సభ్యులమందరం కలసి దేవుని గదిలో కొబ్బరికయని కొట్టి పూజ చేస్తాం.
ఈ రోజు మాంసాహారము వండి కుటుంబసమేతముగా కూర్చొని భోజనం చేస్తాము. ఆ తర్వాత నేను మా ఉరి బడి  దగ్గర  ఫ్రెండ్స్‌నందరిని కలిసి, ఒకరినొకరు పలకరించుకుంటం.  ఎవరెవరు  ఏం చేస్తున్నరు.. ఈ ఏడాదిలో జరిగిన ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటం. 
క్రికెట్ కూడా ఆడుతాం. తర్వాత అందరం సిట్టింగ్ వేస్తాం అదేనండి  బిరు,మందు, కల్లు ఏది తగేవాళ్ళు  అది తాగుతారు. ఇక  సాయంత్రం మొదలయ్యేదే అసలైన దసరా.అందరం కొత్త బట్టలేసుకుని.. గ్రామా  పంచాయతి ముందు  దసరా గద్దె  దగ్గర  గ్రామస్తులందరూ  కోలాహలం గా  చేరి మా  కేరింతలనడుమ  గ్రామా పెద్దల   సమక్షంలో దసరా గద్దె మీద పూజ చేసి, బంటాయన (పేరు గుర్తుకు లేదు ) ముందుగాల్ల ఆనిక్కాయ కొట్టి అటెంక ఒక్కటే దెబ్బకు  గొర్రె పిల్ల మెడ ను నరుకుతాడు. ఎగబడి మరీ యువత కత్తికి  అంటిన రక్తంన్ని  బొట్టుగాపెట్టుకుటారు. నరికిన రక్తపు  కత్తితో దుక్కిడి శివాజీ పొలంలోనున్న  జమ్మిచెట్టు దగ్గరికి   ర్యాలీగా బయలుదేరుతాం.. అక్కడా పూజలు చేసి... జమ్మి తెంపుకుని, అక్కడే కలిసిన మిత్రులందరికీ జమ్మి పెట్టి అలాయ్‌బలాయ్ తీసుకుంటం. పెద్దవాళ్లకు జమ్మి చేతిలో పెట్టి పాదాబివందనము చేసి  
 ఆశీర్వాదాలు అందుకుంటం. పాలపిట్టను చూసి, ఇంటికొచ్చి అమ్మానాన్న,అక్క ల చేతిలో జమ్మిపెట్టి ఆశీర్వాదం తీసుకుంటం. తరువాత చుట్టుపక్కల అందరినీ కలిసి జమ్మి ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితి. మళ్ళీ ఒకసారి  నైట్ జేబులన్ని ఖాళీ అయినా పర్లేదు గాని సంబరం అంబరమంటాలెగా  పార్టీ చేసి  దసరా ముగిస్తాము.

ఇది మా ఊరి దసరా...............