పండగలు

  ----------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------

దసరా పండుగ మా ఊరిలో...

చిన్నగున్నపుడు  దసరా, బతుకమ్మ  పండుగలు వస్తునాయంటే  చాల  సంతోషంగా ఉండేడిది.స్కూలుకు సెలవులు వస్తునాయని, మేనత్తో లేక  అక్కో వారిపిల్లలతో  ఇల్లు సందడిగుడేడిది. నలుగు రోజుల ముందే వచ్చేటోల్లు , పిల్లలందరూ గౌరమ్మ లను పేర్చి ఇంటి ముందు అడుకుటోల్లు, ఊర్లో గల్లికోగౌరమ్మని పేటి ఆడుతుంటే చూసి ఎన్ని రోజులైందో. ఈ ఆదునిక కాలంలో ఒక్క రోజు పండుగకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు మన ఆడపడుచులు. కాలం మారుతుంది మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవడం ఇకముందు గగనమే కావస్తుంది కాబోలు. బతుకమ్మల చుట్టూ చప్పట్లతో, బతుకు పాటలతో చూడ చక్కగా అడుకుటోల్లు మన అమ్మలు, అమ్మమ్మలు మరి ఇప్పుడు బతుకమ్మలాడే ఆడపడుచులు ఆదునిక పోకడలతో డాన్సులు, కోలాటాలు , పిచ్చిపిచ్చి డాన్సులతో మన సంస్కృతిని పక్కదోవ పట్టిస్తున్నారు.  ఆంధ్ర పాలకులు  మన  సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగు చేశారు. ఏది మన సంస్కృతో , ఏది మన పండుగో తెలియకుండా మొత్తం వారి సంస్కృతి గురించే తెలుసుకొనేల చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది మన సంస్కృతి,సంప్రదాయాలను మన పిల్లలకు,వారి పిల్లలకు అందించాలి కావున పాశ్చత్య   పోకడలకు పోకుండా మన తెలంగాణా సంస్కృతి ని మనం పాటించి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలి.

                                  

         ఒక్క తెలంగాణా రాష్టంలోనే   పుష్పాలపండగ(బతుకమ్మ)ను  జరుపుకోవడం అంటే మన తెలంగాణా ప్రజలకు ప్రకృతి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. బతుకమ్మ పండుగ అంటే   ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని, ప్రకృతిని ప్రేమించే గడ్డ మిద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ సోదర భావంతో, ప్రకృతి పై సహృదయ భావాలను పెంచుకొంటూ సమాజంలో అప్తుడువై మేలుగొందుతూ  జీవించాలి. మన బతుకమ్మ పండుగను ఈ మధ్యకాలంలో విదేశాలలో ఉన్న మన తెలంగాణా ఆడపడుచులు గణంగా జరుపుకుంటున్నారు కూడా, ఇప్పుడు మన తెలంగాణా రాష్టం ఏర్పడినందున ఎన్నడు లేని విదంగా ప్రతి ఒక్కరు, దేశ విదెశల్లొఉన్న మన పౌరులు, ఇక్కడున్న మన  మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా చాలా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా బతుకమ్మల సందడి కనబడింది. తద్వారా  అంతర్జాతీయ పండుగలాగా చూడముచ్చటగా అనిపించింది.
ప్రతి గ్రామంలో బతుకమ్మలను ఎన్నడు లేని విదంగా చాల బాగా జరుపుకున్నారు ఇక ముందు ఇంక బాగా జరుపుకొని మనము కలలు కంటున్నా  బంగారు తెలంగాణకు అందరు సహకరించాలని కోరుకొంటూ.....


మీ,
కడవెండి సీతారాంపురం.
 --------------------------------------------------------------------------------------------------------

 ---------------------------------------------------------------------------------

 

మా ఊరి బోనాలు:


మా ఊరిలో బోనాల పండగని చాల బాగా జరుపుకొంటాం. ఉదయం పూట 
కుమ్మరి కులస్థుల వారు పోచమ్మ గుడికి కొత్త సున్నం వేసి గుడి చుట్టూ
 పక్కల శుభ్రం చేసి అమ్మ వారికీ కొబ్బరికాయ,పూలతో తొలి పూజ చేస్తారు.
 ఇక్కడ పూజారులుగా కుమ్మరి వారే ఉంటారు. పోచమ్మ తల్లి అనుగ్రహం 
పొందాలని, వారి కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని, తల్లి ఈ యేడు
 సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె అని అమ్మవారికి 
కోరుకుంటూ ఉదయం గ్రామప్రజలు ఒకొక్కరుగా పోచమ్మ గుడి వద్ద కోళ్ళు,
 మేక పోతులూ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే జంతువు నోటిలో, చెవుల్లో నీళ్లు
 పోస్తారు. అది వణుకుతుంది. దీన్ని జడిపించుట అంటారు. జంతువును 
జడిపిస్తే ఆ జంతువును దేవత ఇష్టపడుతుందన్నమాట.

ఇక్కడున్న చాకలి వాళ్ళు ఈ జంతువు తలనరికి రక్తాన్ని గుడి ముందు
 ఆరపోస్తారు తరువాత జంతువుకుడి మోకాలు కోసి వేపచెట్టుకు కడుతారు.

ఇలా మధ్యాహ్నం సమయం వరకు గ్రామా ప్రజలు వచ్చి వారి కోరికలను కోరుకుంటూ బలి ఇస్తారు.
గ్రామా ప్రజలు వారి ఇంటి వద్ద దేవతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్ళను
 వండుకొని తింటారు. గ్రామా మహిళలు ఒక్కోకరుగా అమ్మవారి దగరికి వెళ్లి
 తాము ధరించే వస్త్రాలను అమ్మ దగ్గర పెట్టి పుజిస్తారు. అమ్మవారికి కొత్త 
బియ్యంతో కొత్త కుండలో బువ్వ వండుతారు.మన గ్రామంలో మొదటి సరిగా
 అమ్మకు బోనం పెట్టేది కమ్మరి, వడ్ల, పద్మశాలి కులస్తులవారు( జంజనం 
ధరించేవారు) పెటిన తర్వాతనే గ్రామా ప్రజలందరూ పెట్టటం అనవయతిగా వస్తుంది.
సాయత్రం గ్రామంలోని మహిళలు కొత్త వస్తాలు ధరించి,డప్పుల దరువుల 
మద్య బోనాలు తలపై పెట్టుకుని గ్రామంలో గల ప్రధాన విధులగుండా గ్రామా
 పంచాయతి వద్దనుండి పోచమ్మ గుడికి చేరుకుంటారు. ఈ సారి ఎప్పుడు 
లేనంతగా చాల బోనాలు మన గ్రామం నుండి బయలుదేరినయీ. సమగ్ర 
కుటుంబ సర్వే(సర్వే తర్వాత రోజు 20 ఆగష్టు నా బోనాలు జరపడం వల్ల ) 
కోసం వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం బోనాలు చేయడంతో పోచమ్మ 
పరవశించింది. అమ్మ వారికీ మొక్కులుగా కల్లు ముంతలు సమర్పిస్తారు. 
కానీ హైదరాబాద్లో మదిరిలగా 
పోతురాజుల వేషలు, తొట్టెల తీసుకవెళ్ళడాలు, అమ్మ బండి ముందు 
తీన్‌మార్‌ అడడలు ఉండవు. అంత ప్రశాంతంగా మహిళలు బోనాలతో అమ్మ
వద్దకు చేరుకుంటారు. కొందరు అమ్మవారి చెంతకు చేరగానే శక్తి ఆవహించి 
పూనకంతో ఊగిపోతారు. వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తమకు 
ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. భక్తులు తమ బాధలను 
చెప్పుతూ పరిష్కారం అడుగుతారు. శక్తి ఆవహించినప్పుడు వారు చెప్పే 
మాటలు నిజాలన్ని నమ్ముతారు. దీనిలో బాగంగా మన గ్రామంలో వర్షాలు 
పడక పోవడానికి, గ్రామం అబివ్రుద్దిలో వెకన బడటానికి కారణం అమ్మ 
వారిని అడుగగా , గ్రామానికి కీడు పట్టుకుందని ఈ కీడు పోవాలంటే 
బొడ్డురాయి మునిగిందని ఆ బొడ్డురాయి ని పైకి లేపి పండుగ చేయాలనీ 
చెప్పింది మరియు శివాలయంలోని గజస్తంబం నిలుపాలని సెలవిచ్చింది.
ఇది విన్న బక్తులు అలాగే తల్లి పండుగను చేస్తాం అని చెప్పి శాంతిపజేశాలు.
ఇంతలో బేషన్ పట్టుకొచ్చిన కుమ్మరోల్లు, తల్లికి బోనం సమర్పించాడని 
చెప్పగా తలో పిడుకడు బోనం ని సమర్పించారు. ఈ యేడు సల్లగ జూసి, 
కాలమై కరువుకాటకాలు దూరం కావాలె మా ఇంట సిరులు పండాలి తల్లి 
అని వేడుకొంటు తిరిగి మళ్ళి మహిళలందరూ బొనలను తలపై ఎత్తుకొని 
ఇంటికి చేరుకున్నారు . అమ్మ కు పెట్టిన ఆ బోనం లోని బువ్వను అమృతంలా
బావించి కుటుంబ సభ్యులంత కలసి భుజిస్తారు. ఈ పండుగంత మన 
పల్లెజీవన మనుగడకు అర్దం పడుతుంది.
మన తెలంగాణా రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది చాల 
సంతోషం. మన సంస్కృతి, సంప్రదాయాలను మన ముందు తరాల వారికీ 
తెలియజేయడం మన బాద్యత. కానీ నిదులను అందించడంలో మాత్రం 
వేనుకాడింది. వచ్చే సంవత్సరం ఐన అందిస్తుంది అని ఆశిస్తున్నాము.
*మన గ్రామా సర్పంచ్ గా ఎనికల్లో గెలుస్తే మల్లేష్ గారు పోచమ్మ కి గుడి కడుతానని చెప్పారు కానీ ఇంత వరకు ఎలాంటి పనులుగానీ, కనీసం 
మాటలుగాని మాట్లాడటం లేదు.
* మన తెలంగాణా ప్రభుత్వం ప్రతి గ్రామంలో బోనాలు జరుపుకోవడానికి 
నిదులతో పాటు, గుడి కట్టించడానికి నిదులను విడుదల చేయాలి అని కోరుకుంటూన్నాను.

సదా పోచమ్మ దీవెనలు మీ కుటుంబం పై ఉండాలని
 కోరుకుంటూ....
మీ,
కడవెండి సీతారాంపురం.



----------------------------------------------------------------------------------

మా ఊరి బతుకమ్మ.......

                మన తెలంగాణా లో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ
ఈ బతుకమ్మ పండుగను గౌరి లేదా సద్దుల పండుగ అనికూడా అంటారు.

మన కడవెండి సీతారాంపురం లో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు
అంబరమంటేలగా జరుపుకోవడం ఆనవాయీతిగా కొనసాగుతుంది.
పండుకోచ్చిదంటేచాలు ఎంతో సంతోషంతో మా ఊరి కి చేరుకుంటాము. పండక్కి మా అక్క, వాళ్ళ పిల్లలతో మా ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
(అడపడుచులందరూ అత్తవారింటి నుండి కన్నావారింటికి చేరుకుంటారన్నమాట )
పండుగ ముందురోజు నేను మరియు మా స్నేహింతులు కలిసి పువ్వులకై మా భావికాడినుండి రోడ్డు అవతలున్న కంచలొ తంగేడి,గునుగు,గడ్డి చామంతి,నూకల పువ్వులు ఇలా అనేక రకముల పువ్వులు తో సహా సితాఫలములు(సిల్పక్కాయలు) కూడా తెచ్చేవాల్లము.
గత కొన్ని సంవత్సరాలనుండి కంచెలను నరికివేయడం మరియు పత్తి పంటల వల్ల తంగేడి,గునుగు పువ్వులు కనిపిచకుండా పొనై వీటికి బదులు టేకు పువ్వులు మరియు రోడ్డులపై ఉన్న గవర్నమెంట్ చెట్ల పులు తెస్తున్నాము. ఈ పువ్వులను అడపడుచులకివ్వగా ,పళ్ళెం లేకపోతే తాంబలం లో జాగ్రత్తగా చుట్టూ వలయాకారంలో మొదటగా తంగేడి పులు పేర్చి,ఆ తర్వాత గునుగుపులు వివిధ రంగులలో ముంచి వాటిని పేర్చుతారు. మధ్యమధ్యలో వివిధ రకముల పువ్వులనూపయొగించి ఆ పై పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి కొవ్వత్తితో దీపాన్ని వెలిగిస్తారు. ఈ పెర్చిన బతుకమ్మను దేవుని గదిలో ఉన్న దేవుళ్ళ ముందు పెట్టి పుజిస్తారు.

సాయంత్రసమయన గ్రామా మహిళలందరూ డప్పుగాళ్ళ సందడి నడుమ మొదటగా గ్రామా బొడ్రాయి వద్దకి చేరుకొని, ఇక్కడినుండి జనసముహముగా గ్రామా చెఱువు గట్టు వద్ద నున్న శివాజీ బొమ్మ వద్దకు చేరుకొని, వారివారి కులములదారముగా గుపులు గుంపులుగా చేరి తులసి లేదా యంపటి చెట్టు ను మద్యలో పెట్టి దీనిచుట్టు బతుకమ్మలను దించి పురోహితుని మంత్రాలతో బతుకమ్మలకు పూజలుచేసి, ఆతర్వాత బతుకమ్మ ల చుట్టూ గౌరీ మాతను కీర్తిస్తూ చప్పట్లతో పాటలను పాడుకుంటూ వారి భక్తిని చాటుకుంటారు. ఈ సందర్బంలో ఆడపడుచులు వారి యోగక్షేమాలు ,అత్తారింటి ముచ్చట్లు, చీరలు, ఆభరణాలు ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆదో వింత అనుభూతి. ఇలా సుమారుగా రెండు గంటల తర్వాత ఈ బతుకమ్మ లను తీసి పక్కనే వున్న గ్రామ చెఱువులో నిమర్జనం చేస్తారు.
అటుపై పళ్ళెం లో వీరు తెచ్చిన పసుపుకుంకుమలను వారివారి పుస్తెలకు బొట్టుగా పెట్టుకొని వాయినాలు ఇచ్చుకుంటారు తర్వాత బెల్లం ,చెక్కర, వేరుశనగలు, నువ్వులు,మొక్కజొన్నలు,భియ్యం మొదలైన వాటితో చేసిన ప్రదార్ధాలను ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక దీనితో బతుకమ్మ పండుగ
ముగిస్తుంది. ఇది మా ఊరి బతుకమ్మ......
  



_____________________________________________________________________

మా ఊరి క్రిస్మస్స్ :

                    
                    క్రిస్మస్స్ పండగ అంటే ఏసు క్రీస్తు పుట్టిన రోజు. ఈ పండగ ప్రపంచంలోని అదిక దేశాలల్లో నున్న క్రిస్టియన్స్ అందరు ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన దేశంలోను, అందులో మన గ్రామంలొను వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.


మా ఊరిలో క్రిస్టియన్ మతంలొకి కన్వర్ట్ అయిన మొదటి వ్యక్తి "పెండం బాలస్వామి" గా గ్రామస్థులు చెప్పుకుంటారు. ఆ తరువాత మరికొంతమంది ఈ మతంలొకి కన్వర్ట్ అయినారు. కొంత కాలం తరువాత వీరందరూ ప్రార్ధన చేయడానికి క్రిస్టియన్ సంస్థల సహాయంతో మన గ్రామంలో చర్చిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం సుమారుగా పది కుటుంబాలకు పైగా ఈ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాయి.
నిత్యం ప్రార్ధనలతో చర్చి ప్రాంతమంత మారుమోగుతుంది. క్రిస్మస్స్ పండుగ వచ్చిందంటే కన్వర్ట్ క్రిస్టియన్స్ ల ఇంట్లో సందడి సందడిగా వుంటుంది. వారి ఇంట్లో వుండే చెట్లను అలంకరించి, స్టార్ గుర్తులొ ఉండే విద్యుత్ కాంతులు ఇంటిముందు అలంకరిస్తారు. ఈరోజు చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, తమ ఇంటిలో విందు భోజనం ఏర్పాటు చేసి .గ్రామస్థులను అతిధులుగా పిలుస్తారు.ఈ రోజు మొత్తం యేసు క్రీస్తు పాటలతో గ్రామం మొత్తం మారుమోగుతుంది.
చిన్నగొర్రె పిల్లను నేను యేసయ్య ........ మెల్ల మెల్ల గా నడుపు యేసయ్య...
అనే ఈ పాట ఎక్కువగా వినిపించేది.


నాకు ఎదురైనా ఒక చిన్న సంఘటన:-
ఒకరోజు మా అమ్మకు ఉదయం ఐదు గంటల సమయంలో కాలుకు తేలు కుట్టింది. విపరీతమైన నొప్పితో అమ్మ ఏడుస్తుంది. ఆ సమయంలో నాకు ఏమిచెయ్యాలో తోచలేదు. డాక్టర్ గారి దగ్గరకు తేసుకపోదామని అనుకొంటుండగా మా అమ్మ చర్చి దగ్గరికి తేసుకపోరా? పాస్టర్ గారు ఏవో నూనెతో రాస్తే నొప్పి తగ్గుతదటారా... అని ఏడుస్తూ చెప్పింది. నేను నమ్మలేదు కానీ మరో మార్గంలేదు. ఎందుకంటే అది ఉదయం ఐదు గంటల సమయం ఎవరు లేస్తారు ఇంత పొద్దుగాలనే అనీ ఆలోచించుకుంటూ అమ్మని తీసుకొని చర్చిదగ్గరికి చెరాను.
పాస్టర్ గారు నిద్ర లేవలేదు, గట్టిగా పాస్టర్.. పాస్టర్.. అనుకుంటూ తలుపులు కొట్టాను. చాలా తోందరగానే తలుపులు తెరిచి, ఏమైంది అన్ని అడిగాడు. కాలికి తేలుకుట్టింది పాస్టర్ అని బదులిచ్చాను. చర్చిలోనికి రండి అని, ఫ్రెష్(ఇంతవరకూ ఉపయోగించని) కొబ్బరి నునె తీసుకొనిరా అని చెప్పాడు. ఇంట్లో కొత్త కొబ్బరి నునె డబ్బాలోంచి కొంచెం తీసుకొని చర్చిలొనికి వెళ్ళాను. ఇదే నేను మొదటి సారి చర్చిలొ అడుగుపెట్టడం చాల విశాలంగా ఉందే మన చర్చి అనుకున్నాను.
నేను తెచ్చిన కొబ్బరి నునెను పాస్టర్ గారు తన ముందు పెట్టుకొని "పరలోకంలో నున్న ప్రభువా..... అనుకుంటూ ఏవో ప్రార్ధన చదివి, ఆ కొబ్బరి నునెను తేలుకుట్టిన దగ్గర వ్రాయమని చెప్పాడు అలా 15 నిమిషాల పాటు వ్రాయగా కొద్దికొద్దిగా... నొప్పి తగ్గుతున్నదని అమ్మ చెప్పిన మాటలు విని అర్చేర్యపోయాను. ఇది ఏమిటి మందు వెయ్యలేదు, సూదీతో పనిలేదు, నాటు వైద్యమన్న చేయ్యలేదు అయీనా నొప్పి తగ్గింది. ఇది అంతా నమ్మసఖ్యంగా అనిపించకపోయీనా నా కన్నులారా చూశాను కనుక నమ్మనూ. పరలోక ప్రభువా...... మా యందు దయతలిచి మా పాపములను తొలగించుటకు వచ్చావా ప్రభూ.... అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను.


ప్రపంచంలో ఎక్కువగా మత ప్రచారం, మత మార్పిడి చేస్తున్నది ఈ క్రిస్టియన్ మతంలోనే అని చెప్పడంలో సందేహంలేదు. ఈ మార్పు అనేది నేటి ప్రపంచికరణలో విద్య అబివృద్ది చెందిన దేశాలల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నవి. ప్రాచిన ,ఆధునిక కాలానికి మానవ జీవితంలో అనేక మార్పులు చేర్పులు జరిగినవి. ఈ మార్పు అంత ఒక విద్య ద్వారానే సాధ్యమైంది. కుల, మత, ప్రాంత,వర్ణ,వర్గ బెదాలను కలారాసింది ఈ విద్య. ఎవరికి నచ్చిన మతం లోకి వారు తమ మనస్సాక్షిగా స్వికరిస్తున్నారు. తాము స్వీకరించిన మతాన్ని పూజిస్తూ పాపదోషాలను కడిగేసుకున్తున్నారు. కాని.. ఈ క్రిస్టియన్ మతంలో కొన్ని క్రైసవ మిషనరీ సంస్థల ద్వార బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు. దీన్ని కడవెండి సీతారాంపురం తీవ్రంగా కండిస్తుంది.


కొన్ని విషయాలు:-
ఏసు క్రీస్తు పుట్టిన గ్రామం == జెరూసలేం
ఏసు క్రీస్తు జన్మించిన దేశం == ఇశ్రాయెల్
ఏసు క్రీస్తు తండ్రి == యెహోవా
హల్లెలూయ == దేవుడు స్తుతింపబడును గాక
ఆమెన్== అలా జరుగును గాక
పరలోకం == స్వర్గలోకం
పరిశుద్ధ గ్రంధము== బైబిల్
కొత్త నిబంధన == బైబిల్
పాస్టర్== ప్రొటస్టెంట్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి.
బిషప్ == కేథలిక్ చర్చిలో ప్రార్ధన చేసే కాపరి
పోప్ == రోమన్ కేథలిక్ చర్చిలకు అధికారి.
భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి == "ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ద్వార "

ప్రార్ధన (వికిపిడియా నుండి)

పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!

క్రిస్మస్స్ శుభాకాంక్షలతో......

మీ,
కడవెండి సీతారాంపురం.



__________________________________________________________________________

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.