దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి (4th july 2016)

తెలంగాణ సాయుధపోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ 
దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సందర్భంగా అనాటి పోరాట జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం..

కడవెండి సీతారాంపురం (జూలై 4,2016)

దొడ్డి కొమురయ్య మరణించి నేటికీ 70 యేండ్లు పూర్తయింది.దొరా.. నీ బాంచెన్ కాల్మొక్తా..! అయ్యా.. నీ బాంచెన్‌ అంటూ అట్టడుగునున్నవారీ బతుకులు దొర గడీల్లోవెట్టిలోనే తెల్లారే రోజులవి...!!


కడవెండి.. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి రక్తతర్పణానికి నాంది పలికిన విప్లవాల గడ్డ !
ప్రపంచ విప్లవోద్యమాల్లో "తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం" మహోజ్వల ఘట్టం!!
హైదరాబాద్‌ సంస్థానంలోని ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో నాలుగున్నర వేలకు పైగా తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.
విస్నూరు దేశ్‌ముఖ్‌ రాపాక వెంకట రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ కొడుకు అండతో కడవెండి గ్రామాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేది. ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ 'దొర' అని పిలిపించుకునేది. ఎవరైనా తనను 'అమ్మ బాంచన్..' అంటే " ఏంరా నేను నీ అయ్యకు పెళ్ళానా ?" అనేదంట!
ఈమె అరాచకానికి విసుగెత్తిన కడవెండి ప్రజలు వ్యతిరేకించసాగారు.
ఒకరోజు కడవెండికి విసునూర్‌ నైజాం అల్లరి మూకలు (రజాకార్) ముట్టడించారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గుతుపలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లను తరిమికొట్టాసాగారు. అందరూ ర్యాలీగా బయలుదేరి బోడ్రాయి వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన నైజాం అల్లరి మూకలు ఎకపక్షంగా కాల్పులు జరిపారు. ఈ ఊరేగింపులోఅగ్ర భాగంగా ఉన్న దొడ్డి కొమరయ్య పోట్టలోకి తూటా దూసుకుపోయింది. బయటకు వస్తున్న పేగులను వత్తి పెడుతూ కమ్యూనిస్టుపార్టీ వర్ధిల్లాలి... 
జై ఆంధ్ర మహాసభ అంటూ కుప్పకూలిపోయాడు.దొడ్డి కొమరయ్య నెత్తుటి ముద్దైండు.. కొమరయ్య బలిదానం కొలిమైమండింది.. రగులుతున్న విప్లవోద్యమానికి సింధూరమైండు.. నిజాం పాలన అంతానికి నాంది పలికిండు.
నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుడు,
తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన వీరుడు, 
నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన గణుడు,
నాటి తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన విప్లవ వీరుడు.
ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి,
పోరాటం ఒక అనివార్యంమైంది మన దొడ్డి కొమురన్నకు.
దొడ్డి కొమురయ్య విప్లవ పోరాటం పై పుస్తకాన్ని రాసిన రచయిత శ్రీనివాస్ గారికి.. ‘తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డికొమురయ్య’ అను పుస్తకాన్ని రాసిన కవి, వాగ్గేయకారుడు అంబటి వెంకన్న గారికి.. ఇంకో రెండు మూడు పుస్తకాలు కూడా వెలువడినై రాసిన రచయితలకు పేరుపేరునా కృతజ్ఞతలు.
దొడ్డి కొమురయ్య స్మారక భవన నిర్మాణానికి కృషి చేసిన సీపీఐ పార్టీ వారికి సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు!


డిమాండ్: 
కొత్తగా ఏర్పడే జిల్లాలలో ఒకదానికి దొడ్డి కొమురయ్య జిల్లా అని నామకరణం చెయ్యాలి.
తెలంగాణలోని కొత్త ప్రాజెక్టుల్లో ఒకదానికి కొమురయ్య పేరు పెట్టాలి.
దొడ్డి కొమురయ్య ఫోటో లేదా పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయ్యాలి.
ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయ్యాలి.
అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే 
అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే


మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్.