Home

 "కడవెండి సీతారాంపురం"కి స్వాగతం..


జీవితంలో ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనకు  కొన్ని సంతోషాన్ని పంచితే, మరికొన్ని బాధల్ని నింపుతాయి. ఆ క్షణంలో ఆనందాల్ని, అశ్రువుల్ని నింపిన సంఘటనలను కొన్నేళ్ల తర్వాత తల్చకుంటే అద్భుతంగా అనిపిస్తాయి. అవే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్ని పదిలపరచుకునే వేదికే"   " https://www.facebook.com/kadavendiseetharampur " or ".http://kadavendiseetharampuram.blogspot.in/ . పలక, బలపంపట్టుకుని బడికి వెళ్లిన రోజులు, వేపచెట్లపై కోతికొమ్మచ్చి ఆడుకున్న రోజులు, చింతకాయలు కొట్టుకుని ఉప్పుకారం అద్దుకుని తిన్న రోజులు, టీవీలు లేని  రోజుల్లో ఆరుబయట వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్న రోజులు, ఊరంతా కలిసి సీతారాముల కళ్యాణం చేసుకున్న రోజులు...మన ఆలోచనల్లో, అంతరంగాల్లో మాత్రమే ఉన్నాయి. మరికొన్నాళ్లు పోతే అక్కడి నుంచీ మాయమవుతాయి. కారణం అప్పటి రోజులకు మనదగ్గర ఆధారాలు లేవు. కనీసం పదిమందితో పంచుకంటే పదికాలాలు పాటు నిలిచి ఉంటాయి. ఇక నుంచి మన జీవితంలో జరిగే మంచికీ, చెడుకీ ఈ వెబ్‌సైట్‌ని" http://kadavendiseetharampuram.blogspot.in/ " వేదికగా చేసుకుందాం. మన జీవితాన్ని ఇక్కడ నిక్షిప్తం చేసుకుందాం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.