ప్రేమించినోడు హీరో.. కని పెంచినోల్లు విలన్లు..

ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!!
ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడిది బాస్ అంత కామమే..!
ఈ కామానికి ఆకర్షితులై ఒకటౌతున్నారే తప్ప ప్రేమ ఎక్కడిది బాస్..
తమ కామసుఖం కోసం..
తమను ప్రేమించే తల్లిదండ్రులను కలదాన్నే వాళ్ళు ఎందఱో..యువకుడి చేతిలో మోసపోయే యువతి..యువతి నట ప్రేమలో మోసపోయే యువకులను ఎంత మందిని చూడలేదు..లేచిపోయీ.. కని పెంచినోల్ల మానమర్యాదలను బుగ్గిపాలు చేసి,నలుగు దినాలకే మోసపోయీ ఇంటికి చేరిన వాళ్ళను చూస్తూనే ఉన్నాను..కుల, మతాంతర నట ప్రేమలు ఈ రోజు ఎంత వరకు సక్సెస్ అవుతున్నాయో..రోజు పేపర్ లో చూస్తూనే ఉన్నాం..అప్పట్లో ప్రేమకంటూ కొన్ని విలువలు ఉండేటివి.తను ప్రేమించిన యువతి లేదా యువకుడు తనకు దక్కకున్న..తన సుఖ సౌఖ్యాలను కాంక్షించేవారు..మరి నేడు..యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు, మానబంగాలు , హత్యలు, ఆత్మహత్యలు..వద్దు బాస్ మనకి ప్రేమలు..ఈ వాలెంటైన్ డే లు..కన్నోల్లు ఏమి చెప్పిన అది మన మంచి కోసమే...మీరు నిజంగానే ప్రేమలో ఉన్నాము అని బ్రమిస్తే..మీ మీ తల్లి దండ్రులకు చెప్పి ఓప్పించి, పెళ్లి చేసుకోండి బాస్..అంతే గాని కని పెంచినోల్లును విలన్లుగా చూడకండి.
విషరసాయనాల పుణ్యమా అని, 
అంతరించిపోతున్న ఆరుద్ర పురుగులు..!
ఇకపై ఫోటోలలోనే చూసుకోవాలి కాబోలు..!!
 
మొహం నిండా పసుపు...
నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు...
కళ్లకు కాటుక..
ఒళ్ళు మొత్తం పసుపు దుస్తువులు..
మెడలో బంతి పూల దండ...
అందమైన రుద్రాక్ష ధారణ..
కాళ్ళకు, మోచేతి పై గజ్జెకట్టు...
చేతిలో కొరడా ...
మొహంలో పోతరాజు హావభావాల విన్యాసాలతో
సందడి చేస్తున్న ఈ చిన్నోడు ఎవరా అని చూస్తున్నారా..?
పోతరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి మన గ్రామా బిడ్డడే...!
మన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే పోతరాజు వేషం వేసిన
"పుప్పల సోమరాజు" (తండ్రి :పుప్పల రాంచందర్) కు " కడవెండి సీతారాంపురం" అబినందనలు... ధన్యవాదాలు తెలుపుతుంది.

మన తెలంగాణా సంస్కృతిని దేశ నలుమూలలా...
వ్యాపించేలా ఈ కార్యక్రమం చేపట్టిన పంజాబ్ రాష్ట "లవ్ లీ యూనివర్శిటీ" యాజమాన్యానికి మన తెలుగు విద్యార్ధి లోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ...
తెలుగు విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మనసారా కోరుకుంటూ....
మీ,
కడవెండి సీతారాంపురం.