మొహం నిండా పసుపు...
నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు...
కళ్లకు కాటుక..
ఒళ్ళు మొత్తం పసుపు దుస్తువులు..
మెడలో బంతి పూల దండ...
అందమైన రుద్రాక్ష ధారణ..
కాళ్ళకు, మోచేతి పై గజ్జెకట్టు...
చేతిలో కొరడా ...
మొహంలో పోతరాజు హావభావాల విన్యాసాలతో
సందడి చేస్తున్న ఈ చిన్నోడు ఎవరా అని చూస్తున్నారా..?
పోతరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి మన గ్రామా బిడ్డడే...!
మన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే పోతరాజు వేషం వేసిన
"పుప్పల సోమరాజు" (తండ్రి :పుప్పల రాంచందర్) కు " కడవెండి సీతారాంపురం" అబినందనలు... ధన్యవాదాలు తెలుపుతుంది.

మన తెలంగాణా సంస్కృతిని దేశ నలుమూలలా...
వ్యాపించేలా ఈ కార్యక్రమం చేపట్టిన పంజాబ్ రాష్ట "లవ్ లీ యూనివర్శిటీ" యాజమాన్యానికి మన తెలుగు విద్యార్ధి లోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ...
తెలుగు విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మనసారా కోరుకుంటూ....
మీ,
కడవెండి సీతారాంపురం.


No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.