మనవి పత్రం


సీతారాంపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నమా పాలకుర్తి  శాసన సభ్యుడు


 ఎర్రబెల్లి దయాకర్ రావు  గారికి ధన్యవాదాలు..!


సీతారాంపురం గ్రామా ప్రజల తరుపున మా  మనవి..!

 దత్తత కార్యక్రమంలో భాగంగా మా గ్రామా సమస్యలను తిర్చవలసిందిగా   కోరుకుంటున్నాము. గ్రామా అబివృద్ది కార్యక్రమంలో మేము మీ వెంట నడుస్తాము. మన దేవరుప్పుల మండలం లోనే ఆదర్శ గ్రామం గా తిర్చవలసిందిగా కోరుకుంటున్నాము.. 


సీతారాంపురం మెయిన్ రోడ్ మీది బస్సుషెల్ద్   మరియు ముత్రశాల నిర్మాణం( బస్సుషెల్డ్ కు  దొడ్డి కొమురయ్య ప్రాగణం అని నామకరణం)

దుర్గమ్మ గుడి వద్ద చిన్న  ఉద్యాన వన నిర్మాణం

గ్రామంలో చిన్న ఫంక్షన్ హాల్ నిర్మాణం

గ్రంధాలయ పునరుద్దరణ  మరియు పుస్తకాల సేకరణ

విద్యుత్ దీపాల పునరుద్దరణ మరియు  ప్రధాన కూడలిలో  సోలార్ లైట్స్  ఏర్పాటు చేయడం
 
గ్రామంలో వాటర్ పైపు లైనులను ప్రక్షాళన చేయాలి(గ్రామంలో మొత్తం  3 or 4 ఇంచ్ పైపులు వేయాలి )

పూర్తి స్థాయిలో  మురుగుకాల్వల నిర్మాణం, పక్షం రోజులకోసారి క్లీన్ చేయడం 

సంపూర్ణంగా సి. సి రోడ్ల నిర్మాణం జరిగేల చూడాలి

గ్రామా పంచాయితి పై మూడు మైక్ సెట్స్ లను ఏర్పాటు చెయ్యాలి

పోచమ్మ గుడి నిర్మాణంలో మీవంతు సహాయం చేయగలరు

 అభివృద్ధి  కమిటిలను ఎర్పాటు చేయాలి( నిధులను సమకూర్చడానికి కృషి చేయాలి)

కోనాయ కుంట (ఊరి చెరువు) లోకి వాగు నీరు వచ్చే విధంగా   కాల్వ పునరుద్దరణ  
 
 ఆటస్థల సేకరణ మరియు ఆట వస్తువుల కొనుగోలు.

చెత్త వేయడానికి  డంపింగ్ యార్డును  నిర్మించాలి.





 సర్పంచ్ కి  మనవి..! 

అందరికి మరుగుదొడ్లు నిర్మాణం జరిగేల చూడాలి

గ్రామపంచాయితి వద్ద  సర్పంచ్ ప్రతి రోజు ఉదయం 10:00 వరకు ప్రజలకి అందుబాటులో ఉండాలి. 

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు   ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులలో అవగాహనా కల్పించాలి  

ప్రజలు కట్టిన పన్నులు  , వాటి ఖర్చు వివరాలను పారదర్శకంగా ఉంచేందుకు  సమగ్ర వివరాలను గ్రామపంచాయితీ కార్యాలయాల్లో ప్రజలకి అందుబాటులో  ఉంచాలి.

 గ్రామపంచాయితి లో కంప్లైంట్ బాక్స్  ఏర్పాటు  చేయాలి.

ప్రతి దసరా పండుగకి గ్రామపంచాయితి తరపున క్రీడల పోటీలు నిర్వహింహలి.