మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు
...........
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం.
ఎదుగుతున్న దేశంలో... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..

నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు.. ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు...నేను కోసిన ఆ సీతాఫల కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ..

సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన బార్లో మనుషులు చేసే వికారాలు.
యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా

మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.

మీ కోసం ఎదురుచూస్తుంది మన గ్రామం...
పండగలకైన ఒక్క సారి వచ్చి పొమ్మంటుంది..
గ్రామం గురించి ఒక్క నిముషం ఆలోచించమని వేడుకొంటుంది.

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి....
మా పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా పంట చేల గట్ల మీద నడవాలి..


ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..
గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..


ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను..
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ..
ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను...
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ.. 


ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు..


పంట చేల గట్ల మీద తిరగాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...


ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...
ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...


మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...


చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...

ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...


పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.

 మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి.
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..


మీరు ఒక్కసారి చూస్తే చాలు మా ఊరు ...
ఈ లోకాన్నే మైమర్చేరు ..

అమ్మ చేతి వంట..

పండగలకి, అప్పుడప్పుడు ఊరిలోకి వెళ్ళినప్పుడు అమ్మ చేతి వంట తింటే ఉంటుంది అదో అమృతం అంటే నమ్మండి. అమ్మప్రేమాప్యాయతలతో వండిన ఆ వంట కమ్మదనం కట్టిపడేస్తుంది. ఎన్ని 5 స్టార్ హోటళ్ళలో తిన్నా అమ్మ చేతి వంట కింద ఏ రుచీ సరిరాదు. ఆదేందో అర్దంకాదు బ్యాచిలర్ గా రూం లో 1 కేజీ చికెన్ వండుకుంటే 2 పుటలకు కూడా సరిపోదు ఆదే అమ్మ వండితే, ఇంటిల్లపాది 3 పుటల తినంగ మరుసటి ఉదయానికి సరిపోతుంది. అంత అమ్మ చేతి మహిమా.. అమ్మ నా ఆకలిని మాత్రమే కాక రుచులెరిగి , నా మనసు తెలుసుకుని తన ప్రేమనీ, మమతనీ రంగరించి వండే అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. ఊర్లో ఉన్నని రోజులు అసలు ఎన్నిపుటలా తిన్నామో కూడా లెక్క లేదు.. ఆసలు ఆకలంటే కూడా తెలియదు. కానీ ఆదే పట్టణానికి వచ్చినరోజు ఉంటుంది ఆకలి అంటే ఇదే అన్నట్లు కడుపులో పేగులు గిరగిర తిరుగుతాయీ.. వంట వండాలంటే బద్దకంగా ఉంటుంది. మళ్ళి అంత రొటీన్ లైఫ్.. కానీ అమ్మచేతి వంట తింటే మాత్రం అంతులేని సంతృప్తి కలుగుతుంది. మళ్ళి అమ్మ చేతి వంట కోసం ఎదురుచూస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం.

ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్న సీతారాంపురం గ్రామస్తులు...


కడవెండి సీతారాంపురం,న్యూస్‌లైన్(డిసెంబర్ 28): గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. వివరలోకేల్లితే ఈ సారి వర్షాలు లేని కారణంగా దేవరుప్పుల మండల ప్రాతాలలో ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు నిండలేదు. దీనితో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 100 కు పైగా బస్తాలు పండించిన రైతులు నేడు వర్షాలు లేక పొలాలు బీడుపడి పల్లెలను వదిలి వలస బాటపడుతున్నారు. ఉపాధి కరువై అప్పులపాలయ్యారు. అందరి ఆకలి తీర్చే అన్నదాత పొట్ల చేత పట్టుకొని పట్టణాల లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా అవతారమెత్తారు. గ్రామంలో బోర్లన్ని అడుగంటి పోయీ, దిక్కు తోచని పరిస్థిలో రైతులు దయనీయమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలెట్టాక పోవడంతో వ్యవసాయ కూలీలు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితే కనుక మరో సంవత్సర కాలం కొనసాగితే మా గ్రామం, మాలాంటి అనేక గ్రామాలు ఖాళీ అవుతాయనడానికి సందేహం లేదు .తక్షణం తెలంగాణా ప్రభుత్వం వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతులకు జీవనభృతి కింద ప్రత్యేక ప్యాకేజీని పంపిణీ చేయాలని "కడవెండి సీతారాంపురం" తరుపున ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తుంది.
రైతుల వలసలపై కడవెండి సీతారాంపురం అడ్మిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మీ,
కడవెండి సీతారాంపురం.

మరిచిన హామీలు..


కడవెండి సీతారాంపురం, డిసెంబర్ 24: గత సంవత్సరం జరిగిన గ్రామా పంచాయతి ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి, గెలుపొందిన సీతారాంపురం గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ తన హామీలను మరిచారు.
పోచమ్మ గుడిని కట్టిస్తానని ఎన్నికల సమయంలో హామీఇచ్చి సంవత్సర కాలం గడిచిన ఎలాంటి పనులు మొదలెట్టలేదు. ఈ పేస్ బుక్ ద్వార సర్పంచ్ దృష్టికి తెసుకేల్లడం దీని ఉదేశ్యం. సర్పంచ్ గారు కూడా పేస్ బుక్ ను ఒక వేదికగా మలుచుకోవాలని, సీతారాంపురం గ్రామా యువతరం అబిప్రాయాలు తెసుకోవాలని, తదనుగుణంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని కడవెండి సీతారాంపురం తరుపున విన్నవించుకుంటూ...

మీ
కడవెండి సీతారాంపురం.