పెరుగుతున్న భక్తుల రద్దీ....



వానకొండ లక్ష్మీనర్సింహ స్వామి గోవిందా... గోవిందా...
ఇప్పుడైతే రోడ్లు బాగున్నాయి కానీ..
 ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం రోడ్లు చాలా అద్వానంగా ఉండేటివి ఎడ్లబండి మీద పోతే నరకానికి దారి వేసినట్లుగా
మార్గ మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు, వర్రేలు , ఇరుకుగా ఉండే కచ్చె రోడ్లు ఉండేవి.

ఒకసారి ఎడ్లబండి మీద గుట్టకు వెళుతుంటే,
దారి పక్కనుండే  బండల  మీదకు ఒక్కసారిగా ఎడ్లు,
బండిని  గుంజుకొని పొయ్యేనాయ్..
బండి మొత్తం పల్టి కొట్టింది ఇక
మా ప్రాణాలు  గాల్లో కలిసిపోయాయి అనుకున్నాము.  కానీ  ఆ వనకొండయ్య దయవల్ల ఎవరికీ  ఏమి కాలేదు.
 ఎద్దు కాలుకు మాత్రం దెబ్బతగిలింది. ఇప్పటికి ఆ సంఘటన నా కనులముందే  ఉంది.( బ్రమ్మ జముడు  చెట్లు   ఉండే దగ్గరిలోనే   ఈ ప్రమాదం జరిగినది)

ఇప్పుడు అంత కష్టం లేదు దారి పొడవున డాంబర్ రోడ్డు ఉంది. క్షేమంగా వెళ్లి వానకొండయ్యకు మొక్కు చెల్లించి రావచ్చు కదా...

మీ,
అడ్మిన్.