అనాధ వృద్దాశ్రమం

                   యం.లక్ష్మినారాయన గారు  ప్రేమ సదనం అనాధ వృద్ద సంగంను   13-11-1998న స్థాపించారు.  అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను ప్రారంబించారు.  వృద్దులకు కనీస అవసరాలైన తిండి ,కూడు, గుడ్డలను మరియు ఆరోగ్యం సంబంద విషయాలను దగ్గరుండి సేవచేస్తున్న మహానుభావుడు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.


                         సీతారాంపురం గ్రామంలోని శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం వద్ద  58  హొమ గుండాలతో శాహస్త్ర చండి యాగంను జరిపించారు.  ఆశ్రమ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామంలో అనేక సేవలు చేస్సున్నారు.











మా ఊరి బతుకమ్మ........

  •                 మన తెలంగాణా లో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ
    ఈ బతుకమ్మ పండుగను గౌరి లేదా సద్దుల పండుగ అనికూడా అంటారు.

    మన కడవెండి సీతారాంపురం లో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు
    అంబరమంటేలగా జరుపుకోవడం ఆనవాయీతిగా కొనసాగుతుంది.
    పండుకోచ్చిదంటేచాలు ఎంతో సంతోషంతో మా ఊరి కి చేరుకుంటాము. పండక్కి మా అక్క, వాళ్ళ పిల్లలతో మా ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
    (అడపడుచులందరూ అత్తవారింటి నుండి కన్నావారింటికి చేరుకుంటారన్నమాట )
    పండుగ ముందురోజు నేను మరియు మా స్నేహింతులు కలిసి పువ్వులకై మా భావికాడినుండి రోడ్డు అవతలున్న కంచలొ తంగేడి,గునుగు,గడ్డి చామంతి,నూకల పువ్వులు ఇలా అనేక రకముల పువ్వులు తో సహా సితాఫలములు(సిల్పక్కాయలు) కూడా తెచ్చేవాల్లము.
    గత కొన్ని సంవత్సరాలనుండి కంచెలను నరికివేయడం మరియు పత్తి పంటల వల్ల తంగేడి,గునుగు పువ్వులు కనిపిచకుండా పొనై వీటికి బదులు టేకు పువ్వులు మరియు రోడ్డులపై ఉన్న గవర్నమెంట్ చెట్ల పులు తెస్తున్నాము. ఈ పువ్వులను అడపడుచులకివ్వగా ,పళ్ళెం లేకపోతే తాంబలం లో జాగ్రత్తగా చుట్టూ వలయాకారంలో మొదటగా తంగేడి పులు పేర్చి,ఆ తర్వాత గునుగుపులు వివిధ రంగులలో ముంచి వాటిని పేర్చుతారు. మధ్యమధ్యలో వివిధ రకముల పువ్వులనూపయొగించి ఆ పై పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి కొవ్వత్తితో దీపాన్ని వెలిగిస్తారు. ఈ పెర్చిన బతుకమ్మను దేవుని గదిలో ఉన్న దేవుళ్ళ ముందు పెట్టి పుజిస్తారు.

    సాయంత్రసమయన గ్రామా మహిళలందరూ డప్పుగాళ్ళ సందడి నడుమ మొదటగా గ్రామా బొడ్రాయి వద్దకి చేరుకొని, ఇక్కడినుండి జనసముహముగా గ్రామా చెఱువు గట్టు వద్ద నున్న శివాజీ బొమ్మ వద్దకు చేరుకొని, వారివారి కులములదారముగా గుపులు గుంపులుగా చేరి తులసి లేదా యంపటి చెట్టు ను మద్యలో పెట్టి దీనిచుట్టు బతుకమ్మలను దించి పురోహితుని మంత్రాలతో బతుకమ్మలకు పూజలుచేసి, ఆతర్వాత బతుకమ్మ ల చుట్టూ గౌరీ మాతను కీర్తిస్తూ చప్పట్లతో పాటలను పాడుకుంటూ వారి భక్తిని చాటుకుంటారు. ఈ సందర్బంలో ఆడపడుచులు వారి యోగక్షేమాలు ,అత్తారింటి ముచ్చట్లు, చీరలు, ఆభరణాలు ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆదో వింత అనుభూతి. ఇలా సుమారుగా రెండు గంటల తర్వాత ఈ బతుకమ్మ లను తీసి పక్కనే వున్న గ్రామ చెఱువులో నిమర్జనం చేస్తారు.
    అటుపై పళ్ళెం లో వీరు తెచ్చిన పసుపుకుంకుమలను వారివారి పుస్తెలకు బొట్టుగా పెట్టుకొని వాయినాలు ఇచ్చుకుంటారు తర్వాత బెల్లం ,చెక్కర, వేరుశనగలు, నువ్వులు,మొక్కజొన్నలు,భియ్యం మొదలైన వాటితో చేసిన ప్రదార్ధాలను ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక దీనితో బతుకమ్మ పండుగ
    ముగిస్తుంది. ఇది మా ఊరి బతుకమ్మ......

                          
                                       



ఆంజనేయ స్వామి టెంపుల్

శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ సీతారాంపురం  

శివాలయం

శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం సీతారాంపురం





సీతారాంపురానికి హైదరాబాద్కి దూరం


సీతారంపురం :--

సీతారంపురం  గ్రామం  వరంగల్ జిల్లా లోని దేవరుప్పుల మండలంలోఉంది. వరంగల్ జిల్లాకి ఈ గ్రామం  53.5 km దూరంలో ఉంది.హైదరాబాద్ కి  94 km దూరంలో ఉంది.

ఈ గ్రామనికి దగ్గరిలో  పాలకుర్తి (11.6 k.m.) ,కొడకండ్ల (14.5 k.m.) ,లింగాలఘనపూర్(21 k.m.) ,రఘునతపల్లె(26.7 k.m.) పట్టణాలు ఉన్నవి.

దేవరుప్పుల మండల్లోనే అప్పిరెడ్డిపల్లె  , చౌడూర్ , ధర్మాపురం  , ధరావత్ తండ,  కామారెడ్డిగూడెం,రాంరాజ్‌పల్లి,సింగరాజ్‌పల్లి,నీర్మాల,కోల్కొండ,మాదాపురం, కడవెండి, సీతారాంపురం,నీర్మాల, గొల్లపల్లె ,మన్‌పహాడ్,మదూర్‌కలాన్,మదూర్‌ఖుర్ద్ గ్రామాలూ ఉన్నవి.



సీతారాంపురం దగ్గరిలొని  పట్టణాలు

జనగాం  27 km      
భువనగిరి  51 km      
సూర్యాపేట  62 km      
వరంగల్  63 km దూరంలో ఉన్నవి.

మా ఊరి దసరా......

సీతారాంపురం గ్రామపంచాయతి  ముందు దసరసంబారాలు ...



దసరా వచ్చిందంటే మాకందరికీ పండగే.మా ఊరిలో దసరా బాగా జరుపుకుంటాము.  పండుగలన్నింటిలో  పెద్దపండుగ కాబట్టి చదువులరీత్యా గాని, ఉద్యోగరీత్యా  గాని హైదరాబాద్‌లో ఉన్నా ప్రతి ఒక్కరు ఈ  పండుగనాడు మాత్రం ఊళ్లోనే ఉంటాం . చిన్నప్పుడు దసరా పండుగ అంటే... కొత్త బట్టలు.. టపాసులు... పిండివంటలు. ఇప్పుడు దసరా అంటే.. బంధువులు, మిత్రులందరినీ కలవడమే.

         దసరా పండుగ చరిత్రను చూసినట్లయితే రాముడు రావణుని పై గెలిచినందుకు,పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజైనందుకు ,జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ఈ  పండగను  జరుపుకున్నాము. 
    

  ఇకపోతే  నేను  పండుగనాడు పొద్దున్నే లేచి స్థాన్నం  చేసి, మామిడాకులు, బంతిపూలతో దండలు గుచ్చి దర్వాజలకు కట్టి   ఆ తర్వాత కుటుంబ సభ్యులమందరం కలసి దేవుని గదిలో కొబ్బరికయని కొట్టి పూజ చేస్తాం.
ఈ రోజు మాంసాహారము వండి కుటుంబసమేతముగా కూర్చొని భోజనం చేస్తాము. ఆ తర్వాత నేను మా ఉరి బడి  దగ్గర  ఫ్రెండ్స్‌నందరిని కలిసి, ఒకరినొకరు పలకరించుకుంటం.  ఎవరెవరు  ఏం చేస్తున్నరు.. ఈ ఏడాదిలో జరిగిన ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటం. 
క్రికెట్ కూడా ఆడుతాం. తర్వాత అందరం సిట్టింగ్ వేస్తాం అదేనండి  బిరు,మందు, కల్లు ఏది తగేవాళ్ళు  అది తాగుతారు. ఇక  సాయంత్రం మొదలయ్యేదే అసలైన దసరా.అందరం కొత్త బట్టలేసుకుని.. గ్రామా  పంచాయతి ముందు  దసరా గద్దె  దగ్గర  గ్రామస్తులందరూ  కోలాహలం గా  చేరి మా  కేరింతలనడుమ  గ్రామా పెద్దల   సమక్షంలో దసరా గద్దె మీద పూజ చేసి, బంటాయన (పేరు గుర్తుకు లేదు ) ముందుగాల్ల ఆనిక్కాయ కొట్టి అటెంక ఒక్కటే దెబ్బకు  గొర్రె పిల్ల మెడ ను నరుకుతాడు. ఎగబడి మరీ యువత కత్తికి  అంటిన రక్తంన్ని  బొట్టుగాపెట్టుకుటారు. నరికిన రక్తపు  కత్తితో దుక్కిడి శివాజీ పొలంలోనున్న  జమ్మిచెట్టు దగ్గరికి   ర్యాలీగా బయలుదేరుతాం.. అక్కడా పూజలు చేసి... జమ్మి తెంపుకుని, అక్కడే కలిసిన మిత్రులందరికీ జమ్మి పెట్టి అలాయ్‌బలాయ్ తీసుకుంటం. పెద్దవాళ్లకు జమ్మి చేతిలో పెట్టి పాదాబివందనము చేసి  
 ఆశీర్వాదాలు అందుకుంటం. పాలపిట్టను చూసి, ఇంటికొచ్చి అమ్మానాన్న,అక్క ల చేతిలో జమ్మిపెట్టి ఆశీర్వాదం తీసుకుంటం. తరువాత చుట్టుపక్కల అందరినీ కలిసి జమ్మి ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితి. మళ్ళీ ఒకసారి  నైట్ జేబులన్ని ఖాళీ అయినా పర్లేదు గాని సంబరం అంబరమంటాలెగా  పార్టీ చేసి  దసరా ముగిస్తాము.

ఇది మా ఊరి దసరా............... 










శివలింగం

ఇది మన శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం లోని  శివలింగం

గ్రామపంచాయతి ఆఫీసు బిల్డింగ్


ఇది మన గ్రామపంచాయతి ఆఫీసు బిల్డింగ్

గ్రామ బొడ్రాయి

 సీతారాంపురం ప్రజలకు నమస్కారములు! 
మనఊరి పుట్టుక బొడ్రాయితో మొదలైది అని గ్రామప్రజలకందరికి తెలుసు , కానీ ప్రస్సుత యూవతకు   బొడ్రాయి ఎక్కడవుందో  , ఎట్లువుందో  తెలియదు.   మనఊరి బొడ్రాయి గ్రామా పంచాయతి దగ్గరిలో వరికల రతన్ ఇంట్టిముందు,చింతచెట్టు కింద ఇలాగా వుంది .