ధ్వజ స్తంబం ప్రతిష్టా మహొత్సవ ఆహువనం...

(january)
ఈ నెల 26 సోమవారం నుండి 30 శుక్రవారం వరకు గ్రామ శివాలయంలో జరుగు ధ్వజ స్థంభ ప్రతిష్టా కార్యక్రమానికి గ్రామా ప్రజలందరూ రావలసిందిగా గ్రామా పెద్దల తరుపున మరియు దేవస్తాన కమిటి తరుపున తెలియజేస్తూ....
శివ, విష్ణు , ఆంజనేయ ఆలయాలో ద్వాజస్తంబం కనిపిస్తుంది. అయితే ఒకే ప్రదేశంలో అందరి దేవుళ్ళని ప్రతిష్టించి ధ్వజ స్థంబం పెట్టడం లేదు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం, దేవత మూర్తి ఒక దిశగా ఉంటుంది. అ దేవత బ్రుకుటి మద్య నుంచి ఒక సరళ రేఖ నుంచి 45డిగ్రీల కోణం నుంచి ఆ సరళ రేఖను ఎక్కడ అది ఖండిస్తుందో అక్కడ ధ్వజ స్తంబని ఏర్పాటు చేయాలి.
సరళ రేఖ నుండి ఎంత దూరం లో ఉందొ అంతే ఎత్తు లో ద్వాజస్తమబం ఉండాలి. ఆలయ ప్రాంగణం లో దేవుడి ఎదురుగా ద్వాజస్తంబని ఏర్పాటు చేస్తారు.
ప్రకృతిలో ఉండే ప్రాణ శక్తి ని, గుడిలో ప్రతిష్టించిన యంత్రం, స్తోత్ర పారాయణ వలన ప్రాణ శక్తిద్వాజస్తంబం తీసుకుంటుంది రక్షణ చేస్తుంది. దీనివలన పిడుగులు పడకుండా కాపాడుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే ద్వాజస్తంబం ఎంత. ఉరిలో ఎక్కడయినా గుడిలో ద్వాజస్తంబం ఉంటె అక్కడ దానికంటే ఎత్తులో ఎవరు ఇల్లు కట్టేవాలు కాదు. ఎందుకంటే ద్వజస్తంబం కంటే ఎత్తులో ఇల్లు ఉండడం వలన అవి ప్రకృతి వైపరీత్యాల వలన రక్షిమ్పబడవు.
శైవ దేవాలయానికి ముందు కొంత దూరం వరకు ఇల్లు కట్టుకోకుడదు, శక్తి దేవాలయానికి వెనక కట్టుకోకుడదు , గుడి నీడ పడకూడదు.
గుడి పైన ఉండే కలశం మీదుండే సూచి సికరం ఉంటుంది, దానికి ఉండే స్వభావం ఏంటి అంటే అది ప్రకృతి లో ఉండే ప్రాణ శక్తి ని తీసుకుని, దాని నీడ ఎక్కడ పడుతుందో అక్కడ జీవం ఉండదు.
ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం నిర్మాణం లేకపోయిన, ధ్వజస్తంభం లేకపోయినా అక్కడ శక్తి ఉండదు అని అలంటి చోట్లకి వెళ్ళకూడదు అని శాస్త్రం చెపుతుంది. 4 గోడలు కట్టి దేవుడి విగ్రహాలు పెట్టి పూజ చేసిననంత మాత్రాన అది గుడి అనిపించుకోదు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం ఎంత ఎత్తు ఉండాలో , విగ్రహం ఎంత ఎత్తు ఉండాలి, ఏ కోణం లో ఉండాలి , ఏ అభిముకం గ ఉండాలి , ఎలాంటి పూజ చేయాలి అనేవి తెలుసుకుని పాటించాలి. కొత్త దేవాలయం కట్టడం కంటే నిర్జీవం అయిపోతున దేవాలయం పునర్నిర్మాణం , పూర్వ వైభవం కోసం చేసే పనుల వలన రెండింతలు ఎక్కువ పుణ్యం వస్తుంది అని శాస్త్ర వాక్కు.
ఇట్లు,
మీ రాక కోసం ఎదురు చూస్తూ...
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.