మా ఊరి బోనాలు:

మా ఊరి  బోనాలు:


మా ఊరిలో బోనాల పండగని చాల బాగా జరుపుకొంటాం. ఉదయం పూట కుమ్మరి కులస్థుల వారు పోచమ్మ గుడికి కొత్త సున్నం వేసి గుడి చుట్టూ పక్కల శుభ్రం చేసి అమ్మ వారికీ కొబ్బరికాయ,పూలతో తొలి పూజ చేస్తారు.  ఇక్కడ  పూజారులుగా  కుమ్మరి వారే ఉంటారు.  పోచమ్మ తల్లి  అనుగ్రహం పొందాలని, వారి కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని, తల్లి ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె అని   అమ్మవారికి కోరుకుంటూ ఉదయం గ్రామప్రజలు ఒకొక్కరుగా పోచమ్మ గుడి వద్ద కోళ్ళు, మేక పోతులూ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే జంతువు నోటిలో, చెవుల్లో  నీళ్లు పోస్తారు. అది వణుకుతుంది. దీన్ని జడిపించుట అంటారు. జంతువును జడిపిస్తే ఆ జంతువును దేవత ఇష్టపడుతుందన్నమాట.ఇక్కడున్న చాకలి వాళ్ళు ఈ  జంతువు తలనరికి రక్తాన్ని గుడి ముందు ఆరపోస్తారు తరువాత జంతువుకుడి మోకాలు కోసి వేపచెట్టుకు కడుతారు.ఇలా మధ్యాహ్నం సమయం వరకు గ్రామా ప్రజలు వచ్చి వారి కోరికలను కోరుకుంటూ బలి ఇస్తారు.
గ్రామా ప్రజలు వారి ఇంటి వద్ద దేవతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్ళను వండుకొని తింటారు. గ్రామా మహిళలు ఒక్కోకరుగా అమ్మవారి దగరికి వెళ్లి తాము ధరించే  వస్త్రాలను అమ్మ దగ్గర పెట్టి పుజిస్తారు. అమ్మవారికి కొత్త బియ్యంతో కొత్త కుండలో బువ్వ  వండుతారు.మన గ్రామంలో మొదటి సరిగా అమ్మకు బోనం పెట్టేది కమ్మరి, వడ్ల, పద్మశాలి కులస్తులవారు( జంజనం ధరించేవారు) పెటిన తర్వాతనే గ్రామా ప్రజలందరూ పెట్టటం  అనవయతిగా వస్తుంది.

 
                          సాయత్రం గ్రామంలోని మహిళలు కొత్త వస్తాలు ధరించి,డప్పుల దరువుల మద్య  బోనాలు తలపై పెట్టుకుని గ్రామంలో గల ప్రధాన విధులగుండా గ్రామా పంచాయతి వద్దనుండి పోచమ్మ గుడికి చేరుకుంటారు. ఈ సారి ఎప్పుడు లేనంతగా చాల బోనాలు మన గ్రామం నుండి బయలుదేరినయీ. సమగ్ర కుటుంబ సర్వే(సర్వే తర్వాత రోజు 20 ఆగష్టు నా బోనాలు జరపడం వల్ల ) కోసం వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం బోనాలు చేయడంతో పోచమ్మ పరవశించింది. అమ్మ వారికీ మొక్కులుగా కల్లు ముంతలు సమర్పిస్తారు. కానీ  హైదరాబాద్లో మదిరిలగా  పోతురాజుల  వేషలు, తొట్టెల తీసుకవెళ్ళడాలు, అమ్మ బండి ముందు తీన్‌మార్‌ అడడలు ఉండవు. అంత ప్రశాంతంగా మహిళలు బోనాలతో అమ్మ వద్దకు చేరుకుంటారు. కొందరు  అమ్మవారి చెంతకు చేరగానే శక్తి ఆవహించి పూనకంతో ఊగిపోతారు.  వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తమకు ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. భక్తులు తమ బాధలను చెప్పుతూ పరిష్కారం అడుగుతారు. శక్తి ఆవహించినప్పుడు వారు చెప్పే మాటలు నిజాలన్ని నమ్ముతారు. దీనిలో బాగంగా  మన గ్రామంలో వర్షాలు పడక పోవడానికి, గ్రామం అబివ్రుద్దిలో వెకన బడటానికి కారణం  అమ్మ వారిని అడుగగా , గ్రామానికి కీడు పట్టుకుందని ఈ కీడు పోవాలంటే బొడ్డురాయి మునిగిందని ఆ  బొడ్డురాయి ని పైకి లేపి పండుగ చేయాలనీ చెప్పింది మరియు శివాలయంలోని గజస్తంబం నిలుపాలని సెలవిచ్చింది.ఇది విన్న బక్తులు అలాగే తల్లి పండుగను చేస్తాం అని చెప్పి శాంతిపజేశాలు.ఇంతలో బేషన్ పట్టుకొచ్చిన కుమ్మరోల్లు, తల్లికి బోనం సమర్పించాడని చెప్పగా తలో పిడుకడు బోనం ని సమర్పించారు. ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె మా  ఇంట సిరులు పండాలి తల్లి అని వేడుకొంటు    తిరిగి మళ్ళి మహిళలందరూ బొనలను తలపై ఎత్తుకొని ఇంటికి చేరుకున్నారు  . అమ్మ కు పెట్టిన ఆ బోనం లోని బువ్వను అమృతంలాబావించి కుటుంబ సభ్యులంత కలసి  భుజిస్తారు. ఈ పండుగంత మన  పల్లెజీవన మనుగడకు అర్దం పడుతుంది. 
 మన తెలంగాణా రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది చాల సంతోషం. మన సంస్కృతి, సంప్రదాయాలను మన ముందు తరాల వారికీ తెలియజేయడం  మన బాద్యత. కానీ నిదులను అందించడంలో  మాత్రం వేనుకాడింది. వచ్చే సంవత్సరం ఐన అందిస్తుంది అని ఆశిస్తున్నాము.
*మన గ్రామా సర్పంచ్ గా ఎనికల్లో గెలుస్తే మల్లేష్ గారు పోచమ్మ కి గుడి కడుతానని  చెప్పారు కానీ  ఇంత వరకు ఎలాంటి పనులుగానీ, కనీసం మాటలుగాని మాట్లాడటం లేదు.* మన తెలంగాణా ప్రభుత్వం ప్రతి గ్రామంలో బోనాలు జరుపుకోవడానికి నిదులతో పాటు, గుడి కట్టించడానికి నిదులను విడుదల చేయాలి అని కోరుకుంటూన్నాను.



సదా పోచమ్మ దీవెనలు మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ....


మీ,

కడవెండి సీతారాంపురం.










No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.