దొడ్డి కొమురయ్య(doddi komuraiah)

దొడ్డి కొమురయ్య 68వ వర్దంతి (జూలై 4,2014) సందర్బంగా ....


భూమికోసం, భుక్తికోసం, శాంతియుతంగా సభలు సమావేశాల ద్వారా చేస్తున్న పోరాటాన్ని సాయుధ మార్గం లో నడిచినది మన దొడ్డి కొమురయ్య అమరత్వమే.

తెలంగాణ గడ్డపై రజాకారుల తుపాకి తూటాలకు మొట్ట మొదటి సారిగా దొడ్డి కొమురయ్య బలెైనాడు.

సభలు, సమావేశాల ద్వారా, శాంతి వచనాల ద్వారా భూస్వాములు దారికి రారని ప్రజలు తెలుసుకున్నరు. ప్రభుత్వం, అధికారులు , దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లకు తొత్తులేనని అర్థం చేసుకున్నరు.ఈ చైతన్యంతోనే.. ఆంధ్రమహాసభలోని అతివాదులు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి సాయుధ పోరాటాన్ని నడిపిండ్రు. ఈ సాయుధ పోరాటానికి నాంది పలికింది మన కడవెండి ముద్దు బిడ్డ కొమురన్న అమరత్వమే.

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుడు,

తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదని వీరుడు,

నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన గణుడు,

నాటి తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన విప్లవ వీరుడు.

ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి,

పోరాటం ఒక అనివార్యంమైంది మన దొడ్డి కొమురన్నకి.

కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం (1946 జూలై 4) తర్వా త కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో ప్రజా ప్రతిఘటన సాయుధ పోరాట రూపం తీసుకుంది. రైతు కూలీలు, మహిళలు వీరోచితంగా, సాయుధం గా పోరాడారు. పల్లెల నుంచి భూస్వాములు మూటా ముల్లె సర్దుకుని పట్ణణాలకి పారిపోయారు. ఇందరు త్యాగధనుల పోరాట ఫలితంగా కొన్నివేల గ్రామాలు విముక్తమయ్యాయి. కొన్ని లక్షల ఎకరాలు ప్రజలకి పంచారు.

ఇదంతా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు మన దొడ్డి కొమురన్న అమరత్వంతో వచ్చిన విప్లవం మూలంగానే జరిగిందన్నది తెలంగాణా చారిత్రక వాస్తవం.

దొడ్డికొమురయ్య స్పూర్తితో తెలంగాణా ప్రజలు ప్రతేక తెలంగాణ రాష్ట ఉద్యమంలో పాల్గొని తెలంగాణాను సాదించుకొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కాని...

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా రాజకరులను ఎదిరించిన మన కొమురన్నకు తగిన గుర్తిపు దక్కిందా..?

మన తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసి,

నేటి తెలంగాణా సమాజానికి చరిత్రను వేత్తుకొనే పరిస్థితికి తీసుకొచ్చిన

ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణా అన్ని విదాలుగా నష్టపోయింది.

తెలంగాణాలోని మేధావులందరూ తెలంగాణా చరిత్రను, మన అస్తిత్వాన్ని

మన ముందు తరాలకు తెలియజేయాలి.

దీనిలో బాగంగా తెలంగాణా ప్రభుత్వం ఈ విదంగా చేయాలి

** తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర , దొడ్డి కొమురయ్య అమరత్వంతో వచ్చిన పరిణామాల గురించి స్కూల్ బుక్స్ లో పొందుపరచాలి.

** జనగాం ప్రాంతాన్ని జిల్లాగా గుర్తించి దొడ్డి కొమురయ్య జిల్లాగా నామకరణం చేయాలి.

**దొడ్డి కొమురయ్య అమరుడైన జూలై 4 నా " తెలంగాణా అమరవీరుల" రోజుగా గుర్తించి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలి.

**దొడ్డి కొమురయ్య ఫోటోతో కూడిన రెవెన్యు స్టంప్స్ ను విడుదల చేయాలి.

**నాటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణా రాష్ట ఆవిర్భావం వరకు జరిగిన పోరాట చరిత్ర తెలిసే విదంగా స్ముతికేంద్రాన్ని నిర్మించాలి.

** ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణా పోరాట అమరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి.


అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే

అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే


మీ,
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.