మా బొడ్డురాయి కథ..


నాకైతే పూర్తిగా తెలియదు. ఇది చదివిన కడవెండి, సీతారాంపురం ప్రజలకేవరికైన సమాధానాలు తెలిస్తే , పూర్తి వివరాలతో తెలియజేయండి. ముందు తరాల వారికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పై ఉంది. మీకు తెలిసిన కొంతైనా మాతో పంచుకోండి.
మన సీతారాంపురం గ్రామం, గ్రామా పంచాయతిగా ఏర్పడి నేటికి 19 సంవత్సరాలు పూర్తైంది. అప్పటికే ఇక్కడ అనేక వసతులతో సుమారుగా రెండు వెయ్యీలకు పైగా జనాభా నివసించుచున్నారు. అయితే నాకు తెలిసి ప్రతి గ్రామానికి ఒక బొడ్డురాయి ఉండటం నేను గమనించాను. ఇది ఒక ఆచారంగా కొనసాగుతున్న ప్రక్రియ, ఈ ప్రక్రియలో భాగంగా మా గ్రామంలో కూడా "బొడ్డురాయి" ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే నాకు తెలియని ఒక విషయం వెంటాడుతుంది. మా గ్రామ పంచాయతి ఏర్పడకముందే "బొడ్డురాయి"ని నిలబెట్టడం జరిగిందని గ్రామా పెద్దల ద్వార తెలిసింది. అప్పడికే కడవెండి లో "బొడ్డురాయి" నెలకొల్పబడి ఉన్నది. సీతారాంపురం గ్రామపంచాయతి ఏర్పడక ముందే సీతారాంపురం లో బొడ్డురాయి ని ఎందుకు నిలబెట్టినట్లు?
కడవెండి, సీతారాంపురం కలసి ఉన్నప్పుడు ఓకే గ్రామానికి 2 బొడ్డురాయి లను ఎందుకు ప్రతిష్టించారు?

పూర్వ కాలంలో మనదేశంలో అనేక వింత( కలరా , మసూచి మొదలనవి) సంక్రమిక వ్యాధులు,పశువ్యాధులు అనేకం ప్రభలడంతో గ్రామవాసులు అందరు పూజించు నిలువున నాటిన పెద్దరాయే ఈ బొడ్డురాయి గా ప్రసిద్ది. బొడ్డురాయి కి పూజలు చేయడం తో వ్యాధులన్ని నయమైనట్లు పూర్వికుల నమ్మకం. ఈ బొడ్డురాయి ని గ్రామా మద్యన నెలకొల్పుతారు. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల బ్రాహ్మణులు, మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమున యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు. గ్రామంలో ఏ శుభకార్యం చేయాలన్న "బొడ్డురాయి" ని మొదట దర్శించాలి.
బొడ్డురాయి ఓ గ్రామదేవత లాంటిది. మా గ్రామంలోని బొడ్డురాయి రోజుకింత భూమిలో కుసించుకు పోతున్నది. అప్పడికి , ఇప్పడికి
పల్లె మారిపోయింది. రోజు కాదుకదా వారానికి ఒక్క బలిహారం (కోడి,మేక బలులు) కూడా జరగడం లేదు.పల్లె ప్రజలు బొడ్డురాయిని పట్టించుకోవడం లేదు, కొందరికైతే బొడ్డురాయి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి.

కొన్ని ప్రశ్నలు:
1) సీతారాంపురం గ్రామా పంచాయతి ఏర్పడక ముందే బొడ్డురాయి ని ఎందుకు ప్రతిష్టించారు?
2)మన గ్రామ బొడ్డురాయిని ప్రతిష్టించిన(పాతిన) వారు ఎవరు?
3) గ్రామా బొడ్డురాయిని ప్రతిష్టించిన సంవత్సరం ఏది?
4) బొడ్డురాయి ఏ గ్రామా దేవత స్వరూపం?
5)బొడ్డురాయి పునర్ ప్రతిష్ఠ కార్యక్రమం ఎందుకు నిర్వాహించడం లేదు?

బొడ్డురాయి ఓ గ్రామదేవత లాంటిది.
బొడ్డురాయిని గౌరవించుదాం.
పండుగలపుడైన బొడ్డురాయికి పూజలు చేద్దాం.
గ్రామాన్ని సస్స్యస్యమలంగా నిలబెట్టామని వేడుకుందాం.

మీ,
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.