బొడ్డెమ్మ-- పండుగ


తెలంగాణా సంస్కృతి,సంప్రదాయాలకు అద్దంపట్టే
బతుకమ్మ పండుగ  సంబరాలు నేటి నుంచి  ఆరంభం...!


బొడ్డెమ్మ-- పండుగ ( మొదటి రోజు )


తెలంగాణకే పరిమితమైన  పండుగలు ‘బతుకమ్మ’, ‘బొడ్డెమ్మలు ’.
 ఈ రెండింటిలో బతుకమ్మ పెద్దల పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ.
తంగెడు, గునుగు, బంతి,గుమ్మడి,చామంతి, వృద్రాక్ష,కనకాంబరాలు, గడ్డి  తదితర పూలతో పేరుస్తూ చేసిన బతుకమ్మ పూలకే సరి కొత్త అందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ పండుగ.

పాటలు..
చిత్తు చిత్తుల బొమ్మ

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ--2(ప్రతి లైన్ను రెండు సార్లు పాడాలి)

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే


రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే
వెంకటేషుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ


బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

బంగారు బిందె తీసుక బామ నీళ్లకు పోతే

భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ


బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

పగిడి బిందె తీసుకు పడితి నీళ్లకు పోతే

పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన


ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే

ముద్దు కృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన


చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన





బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో
నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో
చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో
కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో..

-బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరు మల్లె చెట్టును నాటిందట. దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్యయైన గౌరమ్మను తమ ఆడ బిడ్డగా భావిస్తూ, ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. తమకు వివాహం కావాలని గౌరిని ప్రార్థించినట్లు..!

తెలంగాణా ఆడపడుచులందరికీ  బతుకమ్మ శుభాకాంక్షలతో..

మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్ 

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.