మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు
...........
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం.
ఎదుగుతున్న దేశంలో... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..

నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు.. ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు...నేను కోసిన ఆ సీతాఫల కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ..

సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన బార్లో మనుషులు చేసే వికారాలు.
యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా

మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.

మీ కోసం ఎదురుచూస్తుంది మన గ్రామం...
పండగలకైన ఒక్క సారి వచ్చి పొమ్మంటుంది..
గ్రామం గురించి ఒక్క నిముషం ఆలోచించమని వేడుకొంటుంది.

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి....
మా పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా పంట చేల గట్ల మీద నడవాలి..


ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..
గంగాపురం దాటితే మా ఊరు..
మా ఊరు దాటితే దొడ్డి కొమురయ్య ఊరు..


ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను..
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ..
ప్రేమతో పలకరించే ప్రేమ సదన్ ను...
అన్నితానై చూసే మా లక్ష్మి నారాయణ.. 


ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య గాంధీ బొమ్మ...
గాంధీ పక్కన శివాజీ బొమ్మ..
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు..


పంట చేల గట్ల మీద తిరగాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..


పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...


ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...
ఏరు దాటి వానకొండ గుట్టకి నే పోవాలి..
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...


మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...


చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...

ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...


పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.

 మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి.
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..


మీరు ఒక్కసారి చూస్తే చాలు మా ఊరు ...
ఈ లోకాన్నే మైమర్చేరు ..

అమ్మ చేతి వంట..

పండగలకి, అప్పుడప్పుడు ఊరిలోకి వెళ్ళినప్పుడు అమ్మ చేతి వంట తింటే ఉంటుంది అదో అమృతం అంటే నమ్మండి. అమ్మప్రేమాప్యాయతలతో వండిన ఆ వంట కమ్మదనం కట్టిపడేస్తుంది. ఎన్ని 5 స్టార్ హోటళ్ళలో తిన్నా అమ్మ చేతి వంట కింద ఏ రుచీ సరిరాదు. ఆదేందో అర్దంకాదు బ్యాచిలర్ గా రూం లో 1 కేజీ చికెన్ వండుకుంటే 2 పుటలకు కూడా సరిపోదు ఆదే అమ్మ వండితే, ఇంటిల్లపాది 3 పుటల తినంగ మరుసటి ఉదయానికి సరిపోతుంది. అంత అమ్మ చేతి మహిమా.. అమ్మ నా ఆకలిని మాత్రమే కాక రుచులెరిగి , నా మనసు తెలుసుకుని తన ప్రేమనీ, మమతనీ రంగరించి వండే అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. ఊర్లో ఉన్నని రోజులు అసలు ఎన్నిపుటలా తిన్నామో కూడా లెక్క లేదు.. ఆసలు ఆకలంటే కూడా తెలియదు. కానీ ఆదే పట్టణానికి వచ్చినరోజు ఉంటుంది ఆకలి అంటే ఇదే అన్నట్లు కడుపులో పేగులు గిరగిర తిరుగుతాయీ.. వంట వండాలంటే బద్దకంగా ఉంటుంది. మళ్ళి అంత రొటీన్ లైఫ్.. కానీ అమ్మచేతి వంట తింటే మాత్రం అంతులేని సంతృప్తి కలుగుతుంది. మళ్ళి అమ్మ చేతి వంట కోసం ఎదురుచూస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం.

ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్న సీతారాంపురం గ్రామస్తులు...


కడవెండి సీతారాంపురం,న్యూస్‌లైన్(డిసెంబర్ 28): గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. వివరలోకేల్లితే ఈ సారి వర్షాలు లేని కారణంగా దేవరుప్పుల మండల ప్రాతాలలో ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు నిండలేదు. దీనితో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 100 కు పైగా బస్తాలు పండించిన రైతులు నేడు వర్షాలు లేక పొలాలు బీడుపడి పల్లెలను వదిలి వలస బాటపడుతున్నారు. ఉపాధి కరువై అప్పులపాలయ్యారు. అందరి ఆకలి తీర్చే అన్నదాత పొట్ల చేత పట్టుకొని పట్టణాల లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా అవతారమెత్తారు. గ్రామంలో బోర్లన్ని అడుగంటి పోయీ, దిక్కు తోచని పరిస్థిలో రైతులు దయనీయమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలెట్టాక పోవడంతో వ్యవసాయ కూలీలు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితే కనుక మరో సంవత్సర కాలం కొనసాగితే మా గ్రామం, మాలాంటి అనేక గ్రామాలు ఖాళీ అవుతాయనడానికి సందేహం లేదు .తక్షణం తెలంగాణా ప్రభుత్వం వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతులకు జీవనభృతి కింద ప్రత్యేక ప్యాకేజీని పంపిణీ చేయాలని "కడవెండి సీతారాంపురం" తరుపున ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తుంది.
రైతుల వలసలపై కడవెండి సీతారాంపురం అడ్మిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మీ,
కడవెండి సీతారాంపురం.

మరిచిన హామీలు..


కడవెండి సీతారాంపురం, డిసెంబర్ 24: గత సంవత్సరం జరిగిన గ్రామా పంచాయతి ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి, గెలుపొందిన సీతారాంపురం గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ తన హామీలను మరిచారు.
పోచమ్మ గుడిని కట్టిస్తానని ఎన్నికల సమయంలో హామీఇచ్చి సంవత్సర కాలం గడిచిన ఎలాంటి పనులు మొదలెట్టలేదు. ఈ పేస్ బుక్ ద్వార సర్పంచ్ దృష్టికి తెసుకేల్లడం దీని ఉదేశ్యం. సర్పంచ్ గారు కూడా పేస్ బుక్ ను ఒక వేదికగా మలుచుకోవాలని, సీతారాంపురం గ్రామా యువతరం అబిప్రాయాలు తెసుకోవాలని, తదనుగుణంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని కడవెండి సీతారాంపురం తరుపున విన్నవించుకుంటూ...

మీ
కడవెండి సీతారాంపురం.

కృతజ్ఞతలు..

చిల్డ్రన్స్  డే సందర్బంగా...
14/11/2014

నన్ను ఈ భూమిమీద పుట్టిన్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు...
నన్ను నవమాసాలు మోసి కనిపెంచి, నేను ఆడుకోవడానికి ఆట వస్తువులనిచ్చి, చదువుకోవడానికి పుస్తకాలు కొనియీచ్చి, వేసుకోవడానికి బట్టలకు కుట్టిచ్చి, ఆలోచిచడానికి   మెదడు ఇచ్చి, శక్తినిచ్చి, నడవడానికి , పరిగేతడానికి రెండు కాళ్ళనిచ్చి, చూడటానికి  రెండు కన్నులనిచ్చి, పూర్తగా ఆరోగ్యంగా పుట్టించి,  ఈ సమాజంలో నేను బ్రతికెల ప్రోత్సహించిన అమ్మానాన్నలకు పాదాభివందనాలు...   
నా బాల్యం మా గ్రామం సీతారాంపురం  పరిసరాలలో గడిచింది, మా గ్రామా ప్రకృతిలో శుభ్రమైన గాలి, స్వచ్చమైన నీరు, విశాలమైన నేల, పైన సూర్యుడు, కింద చెరువులు, లెక్కించడానికి ఆకాశంలో చుక్కలు, ఇలా ప్రకృతి నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞాతుడను... 
పెన్నును , కరంటును, టీవీ , ఆటలు,ఆట వస్తువులు, వాహనాలను, సెల్ ఫోన్ , ఇంటర్నెట్, ఇలా వివిధ ఆధునికా  సదుపాయాలను సృష్టించిన మేధావులందరికీ వందనాలు..

నా బాల్యం..

ఆకలితో ఆలమ టించలేదు..
ఆర్దిక ఇబ్బందుల్లో నలిగిపోలేదు..
చదువుకు దూరం చేయలేదు..
నేర చరిత్ర తో ముడిపడలేదు..
దొంగాతనలతో దోషిగా నిలువలేదు..
చెత్తకుప్పల చుట్టూ తిరుగలేదు..
వెట్టి చాకిరికి గురికాలేదు.. 
మత్తుపానీయాలకు బానిస కాలేదు..
లైంగిక వేదింపులకు బలైపోలేదు..
తిట్లు, దండలనతో దద్దరిల్లలేదు..
కోదండం, బెంచికుర్చీలతో ఆర్తనాదాలు పెట్టలేదు..
కోపంతో, మంకు పట్టుతో ఇల్లు విడువలేదు..
నేర స్నేహింతులతో చెలిమి చేయలేదు..
పెద్ద పెద్ద ఆడంబరాలకుపోయి కన్నోలని కష్టపెట్టలేదు..
ఇవ్వన్ని ప్రసాదించిన ఈ ప్రకృతికి నేను రుణపడి ఉన్నాను..

నా బాల్యం మా  గ్రామంలో సాఫీగానే సాగినా ఎక్కోడో కొంత వెల్తి కనపడుతూనే ఉంది..
నన్ను ఎత్తుకు పెంచిన అమ్మమ్మ, తతయ్యలకు ధన్యవాదాలు..
నా అలన పాలనా చుసిన మా అక్క కాళ్ళకి నమస్కారం..
నా చిట్టి పొట్టి ఆడుగులను మోసిన మా గ్రామా విధులకు కృతజ్ఞాతుడను..
నాతో చెలిమి చేసినా నా మిత్రులకు ప్రణామాలు..
నాకు బుద్దులు నేర్పిన ఉపాధ్యయులందరికి పాదాభివందనాలు..
నా వ్యక్తిత్వం ( మనస్తత్వం) నికి పునాది పడిన నా గ్రామానికి   సాష్టాంగ నమస్కారం..  
నేను ఒకడిని ఉన్నానని గుర్తించిన ఈ సమాజానికి శతకోటి వందనాలు..

ఈ సమస్త సృష్టిని సృష్టిచిన ఆ శక్తి ( దేవుడికి) భక్తిపూర్వకం గా నమస్కారాలు తెలుపుకుంటూ..
మా వనకొండ లక్ష్మి నరసింహుడి సాక్షిగా..
మా పాలకుర్తి సోమన్న సన్నిదిలో..
నన్ను కన్న మా తల్లిదండ్రులకు..
నాకు పరిచయమైనా ఈ సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..

మీ
కడవెండి సీతారాంపురం @admin


దొడ్డి కొమురయ్య పై చిన్న పాట..


ఉద్యమాల సూర్యుడే ఓయమ్మా ఉదయించినడమ్మ..
విప్లవాల వీరుడే ఓయమ్మా దొడ్డి కొమురన్న..
చరిత్ర గల మా ఊరు కడవెండి..
కడవెండి వీరుడు కొమురన్న .. దొడ్డి కొమురన్న
తెలంగాణా పోరాట వీరుడు..
తొలి తెలంగాణా రైతాంగ పోరాట అమరుడు..
తుపాకి తూటకు ఎదురొడ్డి నిలిచినాడమ్మ..
ఆ తుపాకి గుండే తన గుండెను చిల్చుతూ ఎర్రబారెను..
ఎర్ర బారిన నెత్తుటితోని తడిసి పోయెరా కడవెండి..
మీ స్పూర్తి తో ముందుకు సాగేన నర్సింహులు
మీ పోరాట బాటలో నడిచేరా సంతోష్‌డ్డి, మహేష్ అన్నలు ..
ఇలా ఎందరో మరెందరో నేలకోరిగేరా మా వీరపుత్రులు..
విస్నూరు దొరలను ఎదిరించి నేలకోరిగిన ఆనాటి మా వీర పుత్రులు ఎందరో..
నేటికి కూడా బడుగుల కోసం పోరాడే ఉసెండి..
మీ త్యాగం మేం మరవజాలం..
మీరు పుట్టిన ఈ గడ్డ మీద మేం పుట్టినోల్లం..
మీ బాటలు వేరైనా , మా దారులు మరేదైనా ..
మీ ఆలోచన, గమనంలో సారూప్యం లేకున్నా..
ప్రజాస్వామ్యయుతముగా పోరాడి..
మీ లక్ష్యం లో కొంతైన సాదించా పోరాడుతాం..
కడవెండి విప్లవ విరుల్లరా..
మీకిదే నా లాల్ సలాం..!
మీకిదే నా లాల్ సలాం..!
జోహార్లు అమరవీరులకు.. జోహార్లు జోహార్లు..
కడవెండి వీర పుత్రులకు జోహార్ జోహార్..

మీ
కడవెండి సీతారాంపురం