స్వచ్చ భరత్

  పరిశుభ్ర భరత్:

 గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని, కోసం మోడీ గారు  పరిశుభ్ర భరత్ కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమనికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ కనిపితుంది. దీనిలో బాగంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమన్ని చేపడుతున్నారు చాల సంతోషం కాని...

ఈ  కార్యక్రమం గ్రామా , పట్టణ పరిదిలో  నిర్వహించే అధికారులు, నాయకులూ, పేపెర్ లో ఫోటోలకు పోజులు ఇవ్వడానికే అన్నట్లు నిర్వహిస్తున్నారు. వేస్తుకున్న బట్టలకు ఇస్తిరి  అచ్చులు  కుడా నలగకుండా రోడ్లు ఉడుస్తున్నారంటే  ఎంత విడ్డూరమో అర్ధం చేసుకోవాలి. మన దేశంలో ఎ కార్యక్రమం మొదలు పెట్టిన ఎక్కడలేని అర్బాటంతో మొదలవుతుంది కానీ లక్ష్యం నెరవేరే వరకు ఈ ఉచ్చాహం మన లో ఉండదు. ఈ  పరిశుభ్ర భరత్ చాల గొప్పది... మనం నివసించే దగ్గర పరిసరాలు పరిశుభ్రంగా ఉంటె , మన కు ఎలాంటి రోగాలు రావు, కాలుష్యానికి కూడా తావుండదు తద్వారా అందరు ఆరోగ్యంగా ఉండి దేశాబివృద్దిలో పలుపంచుకోవచును అని ఆనాడే గాంధీ గారు గుర్తించారు. ఈ పని అప్పుడే చేసివుంటే బారత్ అబివృద్ది చెందిన దేశంగా మొదటి స్థానం లో ఉండేటిది, ఆలస్యం ఐన మోడీ గారు గుర్తించి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు మోదిగారికి ధన్యవాదాలు.. ఇక నిర్లక్యం చేయకుండా ప్రతి ఒక్కరు "పరిశుభ్ర భరత్ " కోసం పనిచేద్దాం.

మన ఇంటి వద్ద నుండే   చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండిలలోని వేద్దాం. మన వంతుగా మొదటి అడుగు వేద్దాం.


మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ మా ఊరిలో...

దసరా పండుగ మా ఊరిలో...

చిన్నగున్నపుడు  దసరా, బతుకమ్మ  పండుగలు వస్తునాయంటే  చాల  సంతోషంగా ఉండేడిది.స్కూలుకు సెలవులు వస్తునాయని, మేనత్తో లేక  అక్కో వారిపిల్లలతో  ఇల్లు సందడిగుడేడిది. నలుగు రోజుల ముందే వచ్చేటోల్లు , పిల్లలందరూ గౌరమ్మ లను పేర్చి ఇంటి ముందు అడుకుటోల్లు, ఊర్లో గల్లికోగౌరమ్మని పేటి ఆడుతుంటే చూసి ఎన్ని రోజులైందో. ఈ ఆదునిక కాలంలో ఒక్క రోజు పండుగకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు మన ఆడపడుచులు. కాలం మారుతుంది మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవడం ఇకముందు గగనమే కావస్తుంది కాబోలు. బతుకమ్మల చుట్టూ చప్పట్లతో, బతుకు పాటలతో చూడ చక్కగా అడుకుటోల్లు మన అమ్మలు, అమ్మమ్మలు మరి ఇప్పుడు బతుకమ్మలాడే ఆడపడుచులు ఆదునిక పోకడలతో డాన్సులు, కోలాటాలు , పిచ్చిపిచ్చి డాన్సులతో మన సంస్కృతిని పక్కదోవ పట్టిస్తున్నారు.  ఆంధ్ర పాలకులు  మన  సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగు చేశారు. ఏది మన సంస్కృతో , ఏది మన పండుగో తెలియకుండా మొత్తం వారి సంస్కృతి గురించే తెలుసుకొనేల చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది మన సంస్కృతి,సంప్రదాయాలను మన పిల్లలకు,వారి పిల్లలకు అందించాలి కావున పాశ్చత్య   పోకడలకు పోకుండా మన తెలంగాణా సంస్కృతి ని మనం పాటించి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలి.

                                  

         ఒక్క తెలంగాణా రాష్టంలోనే   పుష్పాలపండగ(బతుకమ్మ)ను  జరుపుకోవడం అంటే మన తెలంగాణా ప్రజలకు ప్రకృతి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. బతుకమ్మ పండుగ అంటే   ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని, ప్రకృతిని ప్రేమించే గడ్డ మిద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ సోదర భావంతో, ప్రకృతి పై సహృదయ భావాలను పెంచుకొంటూ సమాజంలో అప్తుడువై మేలుగొందుతూ  జీవించాలి. మన బతుకమ్మ పండుగను ఈ మధ్యకాలంలో విదేశాలలో ఉన్న మన తెలంగాణా ఆడపడుచులు గణంగా జరుపుకుంటున్నారు కూడా, ఇప్పుడు మన తెలంగాణా రాష్టం ఏర్పడినందున ఎన్నడు లేని విదంగా ప్రతి ఒక్కరు, దేశ విదెశల్లొఉన్న మన పౌరులు, ఇక్కడున్న మన  మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా చాలా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా బతుకమ్మల సందడి కనబడింది. తద్వారా  అంతర్జాతీయ పండుగలాగా చూడముచ్చటగా అనిపించింది.
ప్రతి గ్రామంలో బతుకమ్మలను ఎన్నడు లేని విదంగా చాల బాగా జరుపుకున్నారు ఇక ముందు ఇంక బాగా జరుపుకొని మనము కలలు కంటున్నా  బంగారు తెలంగాణకు అందరు సహకరించాలని కోరుకొంటూ.....


మీ,
కడవెండి సీతారాంపురం. 

మాజీ సర్పంచ్‌ రాంనర్సయ్య కన్నుమూత:

కడవెండి సీతారాంపురం న్యూస్ లైన్ (07/09/14):- సీతారాంపురం మాజీ సర్పంచ్ బస్వ రాంనర్సయ్య కన్నుమూశారు.ఆయన కొంత కాలంగా పచ్చవాతం తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాలుజారి బాత్రూంలో పడడంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ చికిత్య పొందుతూ నిన్న మధ్యాహ్నం తన చివరి శ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి, గ్రామానికి ప్రధమ సర్పంచ్ గా 1996లో ఎన్నికై చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆప్తుడు, నిగర్వి,స్నేహశీలి, ముక్కుసూటితనం, మంచితనం గ్రామానికి సేవలందించేలా చేసింది.


గ్రామాభివృద్ధిలో రాం నర్సయ్య


గ్రామంలో మంచి నీటి కోసం అనేక బోర్లను, చేతి పంపులను వేయీంచారువాడ వాడకు నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మించి గ్రామా ప్రజలకు నీటి సమస్య నుండి విముక్తి చేశారు. ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేయీంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఉన్న గ్రామా పంచాయతి,బడిలో ఉన్న కొత్త బిల్డింగ్ ను కూడా వీరే కట్టించారు.పాత మొరిలను, చెరువుల వద్ద, అనేక చెక్డంలు నిర్మించారు.వీరి హయంలో ఓవర్ ట్యాంక్ నిర్మాణం, చాల మందికి ఇందిరమ్మ ఇండ్లు, లేట్రూమ్లు, అనేక ప్రభుత్వ పథకాలు మన గ్రామా ప్రజలకు అందేలా చూశారు..గ్రామా ప్రజల పంచాయతీలు అనేకం పరిష్కరించి, గ్రామానికి పెద్ద దిక్కుగా కొనసాగారు.వారి కష్టసుఖములలో పలు పంచుకునే వారు . ఈయన మరణం గ్రామానికి తీరనిలోటు అని గ్రామస్థులు తెలిపారు. ప్రతి వారితోను స్నేహశిలిగా మెలిగే వారని, గ్రామంలోని ప్రజలందరినీ వరసలతో ప్రేమబిమనలతో పిలిచేవా
రని,చిన్న, పెద్ద తేడాలు లేకుండా ప్రతి వారితో ప్రేమగా మాట్లాడే వారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. గ్రామానికి పెద్ద దిక్కు కోలుపోయమని గ్రామస్తులు దిర్బంతిని వ్యక్తంచేశారు.


బస్వ రాం నర్సయ్య కుటుంబానికి, గ్రామ ప్రజలకు కడవెండి సీతారాంపురం తరుపున ప్రగాఢ సానుబూతిని తెలియ జేస్తూ,వారి ఆత్మకు శాంతి చేకురాలను కోరుకుంటూ ........
మీ
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బోనాలు:

మా ఊరి  బోనాలు:


మా ఊరిలో బోనాల పండగని చాల బాగా జరుపుకొంటాం. ఉదయం పూట కుమ్మరి కులస్థుల వారు పోచమ్మ గుడికి కొత్త సున్నం వేసి గుడి చుట్టూ పక్కల శుభ్రం చేసి అమ్మ వారికీ కొబ్బరికాయ,పూలతో తొలి పూజ చేస్తారు.  ఇక్కడ  పూజారులుగా  కుమ్మరి వారే ఉంటారు.  పోచమ్మ తల్లి  అనుగ్రహం పొందాలని, వారి కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని, తల్లి ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె అని   అమ్మవారికి కోరుకుంటూ ఉదయం గ్రామప్రజలు ఒకొక్కరుగా పోచమ్మ గుడి వద్ద కోళ్ళు, మేక పోతులూ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే జంతువు నోటిలో, చెవుల్లో  నీళ్లు పోస్తారు. అది వణుకుతుంది. దీన్ని జడిపించుట అంటారు. జంతువును జడిపిస్తే ఆ జంతువును దేవత ఇష్టపడుతుందన్నమాట.ఇక్కడున్న చాకలి వాళ్ళు ఈ  జంతువు తలనరికి రక్తాన్ని గుడి ముందు ఆరపోస్తారు తరువాత జంతువుకుడి మోకాలు కోసి వేపచెట్టుకు కడుతారు.ఇలా మధ్యాహ్నం సమయం వరకు గ్రామా ప్రజలు వచ్చి వారి కోరికలను కోరుకుంటూ బలి ఇస్తారు.
గ్రామా ప్రజలు వారి ఇంటి వద్ద దేవతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్ళను వండుకొని తింటారు. గ్రామా మహిళలు ఒక్కోకరుగా అమ్మవారి దగరికి వెళ్లి తాము ధరించే  వస్త్రాలను అమ్మ దగ్గర పెట్టి పుజిస్తారు. అమ్మవారికి కొత్త బియ్యంతో కొత్త కుండలో బువ్వ  వండుతారు.మన గ్రామంలో మొదటి సరిగా అమ్మకు బోనం పెట్టేది కమ్మరి, వడ్ల, పద్మశాలి కులస్తులవారు( జంజనం ధరించేవారు) పెటిన తర్వాతనే గ్రామా ప్రజలందరూ పెట్టటం  అనవయతిగా వస్తుంది.

 
                          సాయత్రం గ్రామంలోని మహిళలు కొత్త వస్తాలు ధరించి,డప్పుల దరువుల మద్య  బోనాలు తలపై పెట్టుకుని గ్రామంలో గల ప్రధాన విధులగుండా గ్రామా పంచాయతి వద్దనుండి పోచమ్మ గుడికి చేరుకుంటారు. ఈ సారి ఎప్పుడు లేనంతగా చాల బోనాలు మన గ్రామం నుండి బయలుదేరినయీ. సమగ్ర కుటుంబ సర్వే(సర్వే తర్వాత రోజు 20 ఆగష్టు నా బోనాలు జరపడం వల్ల ) కోసం వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం బోనాలు చేయడంతో పోచమ్మ పరవశించింది. అమ్మ వారికీ మొక్కులుగా కల్లు ముంతలు సమర్పిస్తారు. కానీ  హైదరాబాద్లో మదిరిలగా  పోతురాజుల  వేషలు, తొట్టెల తీసుకవెళ్ళడాలు, అమ్మ బండి ముందు తీన్‌మార్‌ అడడలు ఉండవు. అంత ప్రశాంతంగా మహిళలు బోనాలతో అమ్మ వద్దకు చేరుకుంటారు. కొందరు  అమ్మవారి చెంతకు చేరగానే శక్తి ఆవహించి పూనకంతో ఊగిపోతారు.  వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తమకు ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. భక్తులు తమ బాధలను చెప్పుతూ పరిష్కారం అడుగుతారు. శక్తి ఆవహించినప్పుడు వారు చెప్పే మాటలు నిజాలన్ని నమ్ముతారు. దీనిలో బాగంగా  మన గ్రామంలో వర్షాలు పడక పోవడానికి, గ్రామం అబివ్రుద్దిలో వెకన బడటానికి కారణం  అమ్మ వారిని అడుగగా , గ్రామానికి కీడు పట్టుకుందని ఈ కీడు పోవాలంటే బొడ్డురాయి మునిగిందని ఆ  బొడ్డురాయి ని పైకి లేపి పండుగ చేయాలనీ చెప్పింది మరియు శివాలయంలోని గజస్తంబం నిలుపాలని సెలవిచ్చింది.ఇది విన్న బక్తులు అలాగే తల్లి పండుగను చేస్తాం అని చెప్పి శాంతిపజేశాలు.ఇంతలో బేషన్ పట్టుకొచ్చిన కుమ్మరోల్లు, తల్లికి బోనం సమర్పించాడని చెప్పగా తలో పిడుకడు బోనం ని సమర్పించారు. ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె మా  ఇంట సిరులు పండాలి తల్లి అని వేడుకొంటు    తిరిగి మళ్ళి మహిళలందరూ బొనలను తలపై ఎత్తుకొని ఇంటికి చేరుకున్నారు  . అమ్మ కు పెట్టిన ఆ బోనం లోని బువ్వను అమృతంలాబావించి కుటుంబ సభ్యులంత కలసి  భుజిస్తారు. ఈ పండుగంత మన  పల్లెజీవన మనుగడకు అర్దం పడుతుంది. 
 మన తెలంగాణా రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది చాల సంతోషం. మన సంస్కృతి, సంప్రదాయాలను మన ముందు తరాల వారికీ తెలియజేయడం  మన బాద్యత. కానీ నిదులను అందించడంలో  మాత్రం వేనుకాడింది. వచ్చే సంవత్సరం ఐన అందిస్తుంది అని ఆశిస్తున్నాము.
*మన గ్రామా సర్పంచ్ గా ఎనికల్లో గెలుస్తే మల్లేష్ గారు పోచమ్మ కి గుడి కడుతానని  చెప్పారు కానీ  ఇంత వరకు ఎలాంటి పనులుగానీ, కనీసం మాటలుగాని మాట్లాడటం లేదు.* మన తెలంగాణా ప్రభుత్వం ప్రతి గ్రామంలో బోనాలు జరుపుకోవడానికి నిదులతో పాటు, గుడి కట్టించడానికి నిదులను విడుదల చేయాలి అని కోరుకుంటూన్నాను.



సదా పోచమ్మ దీవెనలు మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ....


మీ,

కడవెండి సీతారాంపురం.










దొడ్డి కొమురయ్య(doddi komuraiah)

దొడ్డి కొమురయ్య 68వ వర్దంతి (జూలై 4,2014) సందర్బంగా ....


భూమికోసం, భుక్తికోసం, శాంతియుతంగా సభలు సమావేశాల ద్వారా చేస్తున్న పోరాటాన్ని సాయుధ మార్గం లో నడిచినది మన దొడ్డి కొమురయ్య అమరత్వమే.

తెలంగాణ గడ్డపై రజాకారుల తుపాకి తూటాలకు మొట్ట మొదటి సారిగా దొడ్డి కొమురయ్య బలెైనాడు.

సభలు, సమావేశాల ద్వారా, శాంతి వచనాల ద్వారా భూస్వాములు దారికి రారని ప్రజలు తెలుసుకున్నరు. ప్రభుత్వం, అధికారులు , దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లకు తొత్తులేనని అర్థం చేసుకున్నరు.ఈ చైతన్యంతోనే.. ఆంధ్రమహాసభలోని అతివాదులు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి సాయుధ పోరాటాన్ని నడిపిండ్రు. ఈ సాయుధ పోరాటానికి నాంది పలికింది మన కడవెండి ముద్దు బిడ్డ కొమురన్న అమరత్వమే.

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుడు,

తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదని వీరుడు,

నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన గణుడు,

నాటి తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన విప్లవ వీరుడు.

ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి,

పోరాటం ఒక అనివార్యంమైంది మన దొడ్డి కొమురన్నకి.

కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం (1946 జూలై 4) తర్వా త కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో ప్రజా ప్రతిఘటన సాయుధ పోరాట రూపం తీసుకుంది. రైతు కూలీలు, మహిళలు వీరోచితంగా, సాయుధం గా పోరాడారు. పల్లెల నుంచి భూస్వాములు మూటా ముల్లె సర్దుకుని పట్ణణాలకి పారిపోయారు. ఇందరు త్యాగధనుల పోరాట ఫలితంగా కొన్నివేల గ్రామాలు విముక్తమయ్యాయి. కొన్ని లక్షల ఎకరాలు ప్రజలకి పంచారు.

ఇదంతా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు మన దొడ్డి కొమురన్న అమరత్వంతో వచ్చిన విప్లవం మూలంగానే జరిగిందన్నది తెలంగాణా చారిత్రక వాస్తవం.

దొడ్డికొమురయ్య స్పూర్తితో తెలంగాణా ప్రజలు ప్రతేక తెలంగాణ రాష్ట ఉద్యమంలో పాల్గొని తెలంగాణాను సాదించుకొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కాని...

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా రాజకరులను ఎదిరించిన మన కొమురన్నకు తగిన గుర్తిపు దక్కిందా..?

మన తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసి,

నేటి తెలంగాణా సమాజానికి చరిత్రను వేత్తుకొనే పరిస్థితికి తీసుకొచ్చిన

ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణా అన్ని విదాలుగా నష్టపోయింది.

తెలంగాణాలోని మేధావులందరూ తెలంగాణా చరిత్రను, మన అస్తిత్వాన్ని

మన ముందు తరాలకు తెలియజేయాలి.

దీనిలో బాగంగా తెలంగాణా ప్రభుత్వం ఈ విదంగా చేయాలి

** తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర , దొడ్డి కొమురయ్య అమరత్వంతో వచ్చిన పరిణామాల గురించి స్కూల్ బుక్స్ లో పొందుపరచాలి.

** జనగాం ప్రాంతాన్ని జిల్లాగా గుర్తించి దొడ్డి కొమురయ్య జిల్లాగా నామకరణం చేయాలి.

**దొడ్డి కొమురయ్య అమరుడైన జూలై 4 నా " తెలంగాణా అమరవీరుల" రోజుగా గుర్తించి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలి.

**దొడ్డి కొమురయ్య ఫోటోతో కూడిన రెవెన్యు స్టంప్స్ ను విడుదల చేయాలి.

**నాటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణా రాష్ట ఆవిర్భావం వరకు జరిగిన పోరాట చరిత్ర తెలిసే విదంగా స్ముతికేంద్రాన్ని నిర్మించాలి.

** ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణా పోరాట అమరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి.


అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే

అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే


మీ,
కడవెండి సీతారాంపురం.

అమ్మమ్మ, నాన్నమ్మ లకు వందనాలు!!



మా నాన్నమ్మ నన్ను ఎత్తుకొని ఆడించలేదు, లాలించలేదు, బుజ్జగించలేదు, నా తప్పటడుగులను సరిచేయ్యలేదు, గోరుముద్దలు తినిపించలేదు, గోరేచ్చని నీటితో తానం చేఎంచలేదు. ఎత్తుకొని నా చిన్ని బుగ్గల మీద చిన్నగా ముద్దు పెట్టలేదు, పండుగనాడు పిండివంటలు వండి తినిపియ్యలేదు కొత్త బట్టలు కొనియ్యలేదు, బడికి వెళ్తుతున్నపుడు కొంగుముడి విప్పి అద్ద రూపాయో... రూపాయో నాకివ్వలేదు, నేను ఎదుగుతుంటే చూసి సంతోషంతో నా బంగారుకొండ అనుకుంటూ తన వేళ్ళతో నా తలను నుమరలేదు, నేను అల్లరిచేస్తే కోపగించలేదు, తప్పులూ చేస్తే మందలించలేదు, తాత నన్ను కొడుతుంటే నిలువరించలేదు, నాన్న నన్ను కోప్పడితే వెనకేసుకరలేదు, అమ్మ నాపై చిర్రుబుర్రులడినప్పుడు చిన్నగా చిరునవ్వు నవ్వలేదు, అక్క తో కలసి స్కూల్ కి వెళుతుంటే టాటాలు.... బాయ్బాయ్ లు చెప్పలేదు.
ఎందుకు నాయనమ్మ నీ మనవడంటే నీకంత కోపం! నేను పుట్టేవరకు ఎందుకమ్మా నువ్వు ఆగలేదు, నీ మనవడిని ఎత్తుకు తిరగాలని నీకెప్పుడు అన్పించలేదా.. నీ మనవడి సేవలో కంటే నీకా స్వర్గంలోనే ఆనందం దొరుకుతుందనుకున్నావా..నీ మనవడిని చూడకుండానే స్వర్గంలో స్థిరపడిపోయావా..నీ మనవడు నిన్ను చుదోద్దనుకున్నావా.. నీతో అడుకోవద్దనుకున్నావా.. నీ ఫోటోని చూసుకుంటూ హృదయం ద్రవించేలగా కండ్లు తడిసి ముద్దయేలాగా ఎన్నిసార్లు .. నాన్నమ్మ .. నాన్నమ్మ.... అనుకుంటూ నిద్రలో ఉలిక్కిపడిలేశానో.. నాన్నమ్మఈ జన్మలో నేను నీ ప్రేమకు నోచుకోలేదు. మరు జన్మంటువుంటే నేను నీ మనవడిగానే పుట్టి నీ ప్రేమాభిమానాలను పొందాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.


మా అమ్మమ్మ నాకు ఊహావచ్చేంతవరకు నాతో కలసి అడుకుంది, నాకు గోరుముద్దలను తినిపించింది. ప్రేమతో ఆర్రలో దాచిన లాడ్డులను, పాలమిగడను నోటిలో పెట్టి తినరా నా.. బంగారు కొండకదు తినవయ్య.. ఇంకొంచం తిను అనుకుంటూ తినిపించేది. పండగొచ్చిందంటే మా అమ్మమ్మ ఊరికేల్లుతున్ననని చాల సంతోషంగా మా ఫ్రెండ్స్ కి చెప్పేవాడిని. నా 7వ ఏట మా అమ్మమ్మ నన్ను విడిచి వెళ్ళింది. దీనితో నేను అమ్మమ్మ ప్రేమకు కూడా నోచుకోలేదు.

మా తాతా (నానమ్మ తాతా) ప్రేమలో పెరిగి పెద్దయ్యను.

నేను ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు
 మా తాత నన్ను  విడిచి వెళ్ళాడు.తాత అనే పిలుపుకు నన్ను దూరం చేశాడు.
 తాత ప్రేమను పుడ్చాలేనిది. తాత నివు చెప్పిన బాటలోని నడుస్తా..
 మరో జన్మంటువుంటే నీకు మనవడిగానే పుట్టాలని ఆ దేవుడిని వేడుకొంటున్న.
  కాని ఎవరైనా నానమ్మ వారస ఉన్న వారిని ప్రేమతో నిండు మనసుతో నానమ్మ అన్ని పిలుస్తాను. 
నానమ్మల వర్సలో కంటే అమ్మమ్మ వరసలో
 నాకు ఎక్కువ మంది ఉన్నారు వారి అందరిలో మా అమ్మమ్మను చూసుకుంటాను.
అమ్మమ్మ, నాయనమ్మల ప్రేమలను తెలియకుండా నా అంతల నేను మాములుగానే బ్రతుకుతున్ననే, మరి ఎందుకు అమ్మమ్మ, నాయనమ్మ రాత్రి నా కలలోకొచ్చి నా కిష్టమైన లడ్డులను చేసి తినిపిచారు. నన్ను మీఎదలో నిధ్రపుచ్చారు, అందరికి నా మనవాడని చెప్పుకొని తిరిగారు, మీ మనవడికి పెళ్లి సంబంధం కూడా చూశారు, అంతలోనే ఎందుకు మాయమైనారు.
నిజంగా మా అమ్మమ్మ, నాయనమ్మలు నా కలలో కొచ్చారు. "మన దగ్గరుంటే వారి విలువ మనకు తెలియదు, అదే మనకు దూరమైతే వారి విలువ తెలుస్తుంది " అనే సామెత నిజంగా వాస్తవం.
మీకు అమ్మమ్మ, నానమ్మలు ఉంటె వారిని ప్రేమతో పలకరించండి! వారితో కొంచం సమయాన్ని కేటాఎంచండి! వృద్దులు చిన్న పిల్లలతో సమానం కావున పండగకో, ఫంక్షన్ లకో ఇంటి కి వెళ్ళితే వారికి ఇష్టమైన వాటిని తిసుకపొండి, ప్రేమతో తినిపియ్యండి. వారి ప్రేమను పొందండి.


ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు!!

మల్లోక్కసారి మా అమ్మమ్మ, నాయనమ్మ,తాతను  తలుచుకుంటూ.....


మనవడి ఆవేదన.

24th November, 2013.

రైతు.. రాజా?


రైతన్నలు మన ఆకలిని తీర్చడం లేదా....?
మన ఆకలిని తీర్చే రైతన్నలు మనకు ముఖ్యం కాదా....?
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు
 మనం తినే ప్రతి పదార్దం రైతుల కష్టం కదా..?
బియ్యానికి,పప్పులకు,బెల్లా నికి,చక్కెరకు.వంటనూనెలు ,కూరగాయలు,ఉల్లిపాయలు,తెల్లగడ్డ లు మొ!!వి 
 వీటికి అన్నింటికి మనం చెల్లించే ధరలు ఎంత...?
మనం చెల్లించే ధరల్లో రైతులకు దక్కుతున్నది ఎంత..?
రైతాంగం చితికి పోతున్నది.
బక్క చిక్కి పోతున్నది.
నష్టాలు వచ్చి అప్పుల పాలై పంటలు పండించడం మానేస్తున్నది.
అందరూ అదే పని చేస్తే మనందరి పరిస్తితి ఏమిటి..?
మనము మన కుటుంబాలు,మన ముందు తరం పరిస్తితి ఏమిటి?
రైతు రాజు అయినపుడు రైతులకు అప్పులేందుకు ..?
రైతులకు ప్రతి పంటకు రుణ సౌకర్యం అవసరం ఎందుకు..?
రైతులు అప్పులలో పుట్టి అప్పులలో పెరిగి ,అప్పులతో ఎందుకు చని పోవాలి?
ఎందుకు ఆత్మ హత్యలకు పాల్పడాలి.?


వోటు కోసం రైతు రుణాలను మాఫీ చేస్తానన్న కెసిఆర్,
నేడు రైతు రుణాలపై షరతులు పెట్టడం ఎంతవరకు సమంజసం...?
మేము ప్రజా ఉద్యమాలనుండి వచ్చాము మాకు రైతుల కష్టాలు తెలుసు
అన్న కెసిఆర్ గారు నేడు రైతుల రుణమాఫీ గురించి తీసుకుంటున్న నమ్మక ద్రోహాన్ని నేను జిర్నిచుకోలేకపోతున్న.

మీరు రైతుల రుణమాఫీ గనుక చేయకపోతే మేము ఉరి వేసుకునే ( రైతులు ఆత్మహ్యలు )
పరిస్థితి వస్తుంది కెసిఆర్ గారు.
ఈ ఆత్మహ్యలకు బాద్యత నిదే.
నమ్మించి   మోసం చేస్తున్నావు గాదరా..?
నివు రైతులకు చేసే ఈ మోసం తెలంగాణా చరిత్ర కె మచ్చగా మిగిలిపోతుంది.
ఐన నేను ఊరుకోను పోరాడుతా...
పాలకులను నిలదిస్తా..
నాకు సజ్జమైంది నేను చేస్తా...
ఫ్రెండ్స్ మీరుకూడా ఈ నమ్మక ద్రోహాని తిప్పికొట్టాలి.
రైతులకు అండగా నిలువాలని కోరుతూ...

మీ
కడవెండి సీతారాంపురం.

5th June,2014.