కృతజ్ఞతలు..

చిల్డ్రన్స్  డే సందర్బంగా...
14/11/2014

నన్ను ఈ భూమిమీద పుట్టిన్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు...
నన్ను నవమాసాలు మోసి కనిపెంచి, నేను ఆడుకోవడానికి ఆట వస్తువులనిచ్చి, చదువుకోవడానికి పుస్తకాలు కొనియీచ్చి, వేసుకోవడానికి బట్టలకు కుట్టిచ్చి, ఆలోచిచడానికి   మెదడు ఇచ్చి, శక్తినిచ్చి, నడవడానికి , పరిగేతడానికి రెండు కాళ్ళనిచ్చి, చూడటానికి  రెండు కన్నులనిచ్చి, పూర్తగా ఆరోగ్యంగా పుట్టించి,  ఈ సమాజంలో నేను బ్రతికెల ప్రోత్సహించిన అమ్మానాన్నలకు పాదాభివందనాలు...   
నా బాల్యం మా గ్రామం సీతారాంపురం  పరిసరాలలో గడిచింది, మా గ్రామా ప్రకృతిలో శుభ్రమైన గాలి, స్వచ్చమైన నీరు, విశాలమైన నేల, పైన సూర్యుడు, కింద చెరువులు, లెక్కించడానికి ఆకాశంలో చుక్కలు, ఇలా ప్రకృతి నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞాతుడను... 
పెన్నును , కరంటును, టీవీ , ఆటలు,ఆట వస్తువులు, వాహనాలను, సెల్ ఫోన్ , ఇంటర్నెట్, ఇలా వివిధ ఆధునికా  సదుపాయాలను సృష్టించిన మేధావులందరికీ వందనాలు..

నా బాల్యం..

ఆకలితో ఆలమ టించలేదు..
ఆర్దిక ఇబ్బందుల్లో నలిగిపోలేదు..
చదువుకు దూరం చేయలేదు..
నేర చరిత్ర తో ముడిపడలేదు..
దొంగాతనలతో దోషిగా నిలువలేదు..
చెత్తకుప్పల చుట్టూ తిరుగలేదు..
వెట్టి చాకిరికి గురికాలేదు.. 
మత్తుపానీయాలకు బానిస కాలేదు..
లైంగిక వేదింపులకు బలైపోలేదు..
తిట్లు, దండలనతో దద్దరిల్లలేదు..
కోదండం, బెంచికుర్చీలతో ఆర్తనాదాలు పెట్టలేదు..
కోపంతో, మంకు పట్టుతో ఇల్లు విడువలేదు..
నేర స్నేహింతులతో చెలిమి చేయలేదు..
పెద్ద పెద్ద ఆడంబరాలకుపోయి కన్నోలని కష్టపెట్టలేదు..
ఇవ్వన్ని ప్రసాదించిన ఈ ప్రకృతికి నేను రుణపడి ఉన్నాను..

నా బాల్యం మా  గ్రామంలో సాఫీగానే సాగినా ఎక్కోడో కొంత వెల్తి కనపడుతూనే ఉంది..
నన్ను ఎత్తుకు పెంచిన అమ్మమ్మ, తతయ్యలకు ధన్యవాదాలు..
నా అలన పాలనా చుసిన మా అక్క కాళ్ళకి నమస్కారం..
నా చిట్టి పొట్టి ఆడుగులను మోసిన మా గ్రామా విధులకు కృతజ్ఞాతుడను..
నాతో చెలిమి చేసినా నా మిత్రులకు ప్రణామాలు..
నాకు బుద్దులు నేర్పిన ఉపాధ్యయులందరికి పాదాభివందనాలు..
నా వ్యక్తిత్వం ( మనస్తత్వం) నికి పునాది పడిన నా గ్రామానికి   సాష్టాంగ నమస్కారం..  
నేను ఒకడిని ఉన్నానని గుర్తించిన ఈ సమాజానికి శతకోటి వందనాలు..

ఈ సమస్త సృష్టిని సృష్టిచిన ఆ శక్తి ( దేవుడికి) భక్తిపూర్వకం గా నమస్కారాలు తెలుపుకుంటూ..
మా వనకొండ లక్ష్మి నరసింహుడి సాక్షిగా..
మా పాలకుర్తి సోమన్న సన్నిదిలో..
నన్ను కన్న మా తల్లిదండ్రులకు..
నాకు పరిచయమైనా ఈ సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ..

మీ
కడవెండి సీతారాంపురం @admin


దొడ్డి కొమురయ్య పై చిన్న పాట..


ఉద్యమాల సూర్యుడే ఓయమ్మా ఉదయించినడమ్మ..
విప్లవాల వీరుడే ఓయమ్మా దొడ్డి కొమురన్న..
చరిత్ర గల మా ఊరు కడవెండి..
కడవెండి వీరుడు కొమురన్న .. దొడ్డి కొమురన్న
తెలంగాణా పోరాట వీరుడు..
తొలి తెలంగాణా రైతాంగ పోరాట అమరుడు..
తుపాకి తూటకు ఎదురొడ్డి నిలిచినాడమ్మ..
ఆ తుపాకి గుండే తన గుండెను చిల్చుతూ ఎర్రబారెను..
ఎర్ర బారిన నెత్తుటితోని తడిసి పోయెరా కడవెండి..
మీ స్పూర్తి తో ముందుకు సాగేన నర్సింహులు
మీ పోరాట బాటలో నడిచేరా సంతోష్‌డ్డి, మహేష్ అన్నలు ..
ఇలా ఎందరో మరెందరో నేలకోరిగేరా మా వీరపుత్రులు..
విస్నూరు దొరలను ఎదిరించి నేలకోరిగిన ఆనాటి మా వీర పుత్రులు ఎందరో..
నేటికి కూడా బడుగుల కోసం పోరాడే ఉసెండి..
మీ త్యాగం మేం మరవజాలం..
మీరు పుట్టిన ఈ గడ్డ మీద మేం పుట్టినోల్లం..
మీ బాటలు వేరైనా , మా దారులు మరేదైనా ..
మీ ఆలోచన, గమనంలో సారూప్యం లేకున్నా..
ప్రజాస్వామ్యయుతముగా పోరాడి..
మీ లక్ష్యం లో కొంతైన సాదించా పోరాడుతాం..
కడవెండి విప్లవ విరుల్లరా..
మీకిదే నా లాల్ సలాం..!
మీకిదే నా లాల్ సలాం..!
జోహార్లు అమరవీరులకు.. జోహార్లు జోహార్లు..
కడవెండి వీర పుత్రులకు జోహార్ జోహార్..

మీ
కడవెండి సీతారాంపురం

స్వచ్చ భరత్

  పరిశుభ్ర భరత్:

 గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని, కోసం మోడీ గారు  పరిశుభ్ర భరత్ కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమనికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ కనిపితుంది. దీనిలో బాగంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమన్ని చేపడుతున్నారు చాల సంతోషం కాని...

ఈ  కార్యక్రమం గ్రామా , పట్టణ పరిదిలో  నిర్వహించే అధికారులు, నాయకులూ, పేపెర్ లో ఫోటోలకు పోజులు ఇవ్వడానికే అన్నట్లు నిర్వహిస్తున్నారు. వేస్తుకున్న బట్టలకు ఇస్తిరి  అచ్చులు  కుడా నలగకుండా రోడ్లు ఉడుస్తున్నారంటే  ఎంత విడ్డూరమో అర్ధం చేసుకోవాలి. మన దేశంలో ఎ కార్యక్రమం మొదలు పెట్టిన ఎక్కడలేని అర్బాటంతో మొదలవుతుంది కానీ లక్ష్యం నెరవేరే వరకు ఈ ఉచ్చాహం మన లో ఉండదు. ఈ  పరిశుభ్ర భరత్ చాల గొప్పది... మనం నివసించే దగ్గర పరిసరాలు పరిశుభ్రంగా ఉంటె , మన కు ఎలాంటి రోగాలు రావు, కాలుష్యానికి కూడా తావుండదు తద్వారా అందరు ఆరోగ్యంగా ఉండి దేశాబివృద్దిలో పలుపంచుకోవచును అని ఆనాడే గాంధీ గారు గుర్తించారు. ఈ పని అప్పుడే చేసివుంటే బారత్ అబివృద్ది చెందిన దేశంగా మొదటి స్థానం లో ఉండేటిది, ఆలస్యం ఐన మోడీ గారు గుర్తించి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు మోదిగారికి ధన్యవాదాలు.. ఇక నిర్లక్యం చేయకుండా ప్రతి ఒక్కరు "పరిశుభ్ర భరత్ " కోసం పనిచేద్దాం.

మన ఇంటి వద్ద నుండే   చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండిలలోని వేద్దాం. మన వంతుగా మొదటి అడుగు వేద్దాం.


మీ,
కడవెండి సీతారాంపురం.

దసరా పండుగ మా ఊరిలో...

దసరా పండుగ మా ఊరిలో...

చిన్నగున్నపుడు  దసరా, బతుకమ్మ  పండుగలు వస్తునాయంటే  చాల  సంతోషంగా ఉండేడిది.స్కూలుకు సెలవులు వస్తునాయని, మేనత్తో లేక  అక్కో వారిపిల్లలతో  ఇల్లు సందడిగుడేడిది. నలుగు రోజుల ముందే వచ్చేటోల్లు , పిల్లలందరూ గౌరమ్మ లను పేర్చి ఇంటి ముందు అడుకుటోల్లు, ఊర్లో గల్లికోగౌరమ్మని పేటి ఆడుతుంటే చూసి ఎన్ని రోజులైందో. ఈ ఆదునిక కాలంలో ఒక్క రోజు పండుగకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు మన ఆడపడుచులు. కాలం మారుతుంది మన సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవడం ఇకముందు గగనమే కావస్తుంది కాబోలు. బతుకమ్మల చుట్టూ చప్పట్లతో, బతుకు పాటలతో చూడ చక్కగా అడుకుటోల్లు మన అమ్మలు, అమ్మమ్మలు మరి ఇప్పుడు బతుకమ్మలాడే ఆడపడుచులు ఆదునిక పోకడలతో డాన్సులు, కోలాటాలు , పిచ్చిపిచ్చి డాన్సులతో మన సంస్కృతిని పక్కదోవ పట్టిస్తున్నారు.  ఆంధ్ర పాలకులు  మన  సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగు చేశారు. ఏది మన సంస్కృతో , ఏది మన పండుగో తెలియకుండా మొత్తం వారి సంస్కృతి గురించే తెలుసుకొనేల చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది మన సంస్కృతి,సంప్రదాయాలను మన పిల్లలకు,వారి పిల్లలకు అందించాలి కావున పాశ్చత్య   పోకడలకు పోకుండా మన తెలంగాణా సంస్కృతి ని మనం పాటించి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలి.

                                  

         ఒక్క తెలంగాణా రాష్టంలోనే   పుష్పాలపండగ(బతుకమ్మ)ను  జరుపుకోవడం అంటే మన తెలంగాణా ప్రజలకు ప్రకృతి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. బతుకమ్మ పండుగ అంటే   ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని, ప్రకృతిని ప్రేమించే గడ్డ మిద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ సోదర భావంతో, ప్రకృతి పై సహృదయ భావాలను పెంచుకొంటూ సమాజంలో అప్తుడువై మేలుగొందుతూ  జీవించాలి. మన బతుకమ్మ పండుగను ఈ మధ్యకాలంలో విదేశాలలో ఉన్న మన తెలంగాణా ఆడపడుచులు గణంగా జరుపుకుంటున్నారు కూడా, ఇప్పుడు మన తెలంగాణా రాష్టం ఏర్పడినందున ఎన్నడు లేని విదంగా ప్రతి ఒక్కరు, దేశ విదెశల్లొఉన్న మన పౌరులు, ఇక్కడున్న మన  మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా చాలా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా బతుకమ్మల సందడి కనబడింది. తద్వారా  అంతర్జాతీయ పండుగలాగా చూడముచ్చటగా అనిపించింది.
ప్రతి గ్రామంలో బతుకమ్మలను ఎన్నడు లేని విదంగా చాల బాగా జరుపుకున్నారు ఇక ముందు ఇంక బాగా జరుపుకొని మనము కలలు కంటున్నా  బంగారు తెలంగాణకు అందరు సహకరించాలని కోరుకొంటూ.....


మీ,
కడవెండి సీతారాంపురం. 

మాజీ సర్పంచ్‌ రాంనర్సయ్య కన్నుమూత:

కడవెండి సీతారాంపురం న్యూస్ లైన్ (07/09/14):- సీతారాంపురం మాజీ సర్పంచ్ బస్వ రాంనర్సయ్య కన్నుమూశారు.ఆయన కొంత కాలంగా పచ్చవాతం తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాలుజారి బాత్రూంలో పడడంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ చికిత్య పొందుతూ నిన్న మధ్యాహ్నం తన చివరి శ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో సుధీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి, గ్రామానికి ప్రధమ సర్పంచ్ గా 1996లో ఎన్నికై చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆప్తుడు, నిగర్వి,స్నేహశీలి, ముక్కుసూటితనం, మంచితనం గ్రామానికి సేవలందించేలా చేసింది.


గ్రామాభివృద్ధిలో రాం నర్సయ్య


గ్రామంలో మంచి నీటి కోసం అనేక బోర్లను, చేతి పంపులను వేయీంచారువాడ వాడకు నీటిని నిలువచేసే నీటి ట్యాంక్ లను నిర్మించి గ్రామా ప్రజలకు నీటి సమస్య నుండి విముక్తి చేశారు. ఇంటింటికీ నీటి అవసరాన్ని తీర్చడానికి వాడవాడకు నీటి పైపులైను లను వేయీంచి ప్రతి ఇంటికి నాల్లాలను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఉన్న గ్రామా పంచాయతి,బడిలో ఉన్న కొత్త బిల్డింగ్ ను కూడా వీరే కట్టించారు.పాత మొరిలను, చెరువుల వద్ద, అనేక చెక్డంలు నిర్మించారు.వీరి హయంలో ఓవర్ ట్యాంక్ నిర్మాణం, చాల మందికి ఇందిరమ్మ ఇండ్లు, లేట్రూమ్లు, అనేక ప్రభుత్వ పథకాలు మన గ్రామా ప్రజలకు అందేలా చూశారు..గ్రామా ప్రజల పంచాయతీలు అనేకం పరిష్కరించి, గ్రామానికి పెద్ద దిక్కుగా కొనసాగారు.వారి కష్టసుఖములలో పలు పంచుకునే వారు . ఈయన మరణం గ్రామానికి తీరనిలోటు అని గ్రామస్థులు తెలిపారు. ప్రతి వారితోను స్నేహశిలిగా మెలిగే వారని, గ్రామంలోని ప్రజలందరినీ వరసలతో ప్రేమబిమనలతో పిలిచేవా
రని,చిన్న, పెద్ద తేడాలు లేకుండా ప్రతి వారితో ప్రేమగా మాట్లాడే వారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. గ్రామానికి పెద్ద దిక్కు కోలుపోయమని గ్రామస్తులు దిర్బంతిని వ్యక్తంచేశారు.


బస్వ రాం నర్సయ్య కుటుంబానికి, గ్రామ ప్రజలకు కడవెండి సీతారాంపురం తరుపున ప్రగాఢ సానుబూతిని తెలియ జేస్తూ,వారి ఆత్మకు శాంతి చేకురాలను కోరుకుంటూ ........
మీ
కడవెండి సీతారాంపురం.

మా ఊరి బోనాలు:

మా ఊరి  బోనాలు:


మా ఊరిలో బోనాల పండగని చాల బాగా జరుపుకొంటాం. ఉదయం పూట కుమ్మరి కులస్థుల వారు పోచమ్మ గుడికి కొత్త సున్నం వేసి గుడి చుట్టూ పక్కల శుభ్రం చేసి అమ్మ వారికీ కొబ్బరికాయ,పూలతో తొలి పూజ చేస్తారు.  ఇక్కడ  పూజారులుగా  కుమ్మరి వారే ఉంటారు.  పోచమ్మ తల్లి  అనుగ్రహం పొందాలని, వారి కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని, తల్లి ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె అని   అమ్మవారికి కోరుకుంటూ ఉదయం గ్రామప్రజలు ఒకొక్కరుగా పోచమ్మ గుడి వద్ద కోళ్ళు, మేక పోతులూ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే జంతువు నోటిలో, చెవుల్లో  నీళ్లు పోస్తారు. అది వణుకుతుంది. దీన్ని జడిపించుట అంటారు. జంతువును జడిపిస్తే ఆ జంతువును దేవత ఇష్టపడుతుందన్నమాట.ఇక్కడున్న చాకలి వాళ్ళు ఈ  జంతువు తలనరికి రక్తాన్ని గుడి ముందు ఆరపోస్తారు తరువాత జంతువుకుడి మోకాలు కోసి వేపచెట్టుకు కడుతారు.ఇలా మధ్యాహ్నం సమయం వరకు గ్రామా ప్రజలు వచ్చి వారి కోరికలను కోరుకుంటూ బలి ఇస్తారు.
గ్రామా ప్రజలు వారి ఇంటి వద్ద దేవతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్ళను వండుకొని తింటారు. గ్రామా మహిళలు ఒక్కోకరుగా అమ్మవారి దగరికి వెళ్లి తాము ధరించే  వస్త్రాలను అమ్మ దగ్గర పెట్టి పుజిస్తారు. అమ్మవారికి కొత్త బియ్యంతో కొత్త కుండలో బువ్వ  వండుతారు.మన గ్రామంలో మొదటి సరిగా అమ్మకు బోనం పెట్టేది కమ్మరి, వడ్ల, పద్మశాలి కులస్తులవారు( జంజనం ధరించేవారు) పెటిన తర్వాతనే గ్రామా ప్రజలందరూ పెట్టటం  అనవయతిగా వస్తుంది.

 
                          సాయత్రం గ్రామంలోని మహిళలు కొత్త వస్తాలు ధరించి,డప్పుల దరువుల మద్య  బోనాలు తలపై పెట్టుకుని గ్రామంలో గల ప్రధాన విధులగుండా గ్రామా పంచాయతి వద్దనుండి పోచమ్మ గుడికి చేరుకుంటారు. ఈ సారి ఎప్పుడు లేనంతగా చాల బోనాలు మన గ్రామం నుండి బయలుదేరినయీ. సమగ్ర కుటుంబ సర్వే(సర్వే తర్వాత రోజు 20 ఆగష్టు నా బోనాలు జరపడం వల్ల ) కోసం వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం బోనాలు చేయడంతో పోచమ్మ పరవశించింది. అమ్మ వారికీ మొక్కులుగా కల్లు ముంతలు సమర్పిస్తారు. కానీ  హైదరాబాద్లో మదిరిలగా  పోతురాజుల  వేషలు, తొట్టెల తీసుకవెళ్ళడాలు, అమ్మ బండి ముందు తీన్‌మార్‌ అడడలు ఉండవు. అంత ప్రశాంతంగా మహిళలు బోనాలతో అమ్మ వద్దకు చేరుకుంటారు. కొందరు  అమ్మవారి చెంతకు చేరగానే శక్తి ఆవహించి పూనకంతో ఊగిపోతారు.  వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తమకు ఉన్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. భక్తులు తమ బాధలను చెప్పుతూ పరిష్కారం అడుగుతారు. శక్తి ఆవహించినప్పుడు వారు చెప్పే మాటలు నిజాలన్ని నమ్ముతారు. దీనిలో బాగంగా  మన గ్రామంలో వర్షాలు పడక పోవడానికి, గ్రామం అబివ్రుద్దిలో వెకన బడటానికి కారణం  అమ్మ వారిని అడుగగా , గ్రామానికి కీడు పట్టుకుందని ఈ కీడు పోవాలంటే బొడ్డురాయి మునిగిందని ఆ  బొడ్డురాయి ని పైకి లేపి పండుగ చేయాలనీ చెప్పింది మరియు శివాలయంలోని గజస్తంబం నిలుపాలని సెలవిచ్చింది.ఇది విన్న బక్తులు అలాగే తల్లి పండుగను చేస్తాం అని చెప్పి శాంతిపజేశాలు.ఇంతలో బేషన్ పట్టుకొచ్చిన కుమ్మరోల్లు, తల్లికి బోనం సమర్పించాడని చెప్పగా తలో పిడుకడు బోనం ని సమర్పించారు. ఈ యేడు సల్లగ జూసి, కాలమై కరువుకాటకాలు దూరం కావాలె మా  ఇంట సిరులు పండాలి తల్లి అని వేడుకొంటు    తిరిగి మళ్ళి మహిళలందరూ బొనలను తలపై ఎత్తుకొని ఇంటికి చేరుకున్నారు  . అమ్మ కు పెట్టిన ఆ బోనం లోని బువ్వను అమృతంలాబావించి కుటుంబ సభ్యులంత కలసి  భుజిస్తారు. ఈ పండుగంత మన  పల్లెజీవన మనుగడకు అర్దం పడుతుంది. 
 మన తెలంగాణా రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది చాల సంతోషం. మన సంస్కృతి, సంప్రదాయాలను మన ముందు తరాల వారికీ తెలియజేయడం  మన బాద్యత. కానీ నిదులను అందించడంలో  మాత్రం వేనుకాడింది. వచ్చే సంవత్సరం ఐన అందిస్తుంది అని ఆశిస్తున్నాము.
*మన గ్రామా సర్పంచ్ గా ఎనికల్లో గెలుస్తే మల్లేష్ గారు పోచమ్మ కి గుడి కడుతానని  చెప్పారు కానీ  ఇంత వరకు ఎలాంటి పనులుగానీ, కనీసం మాటలుగాని మాట్లాడటం లేదు.* మన తెలంగాణా ప్రభుత్వం ప్రతి గ్రామంలో బోనాలు జరుపుకోవడానికి నిదులతో పాటు, గుడి కట్టించడానికి నిదులను విడుదల చేయాలి అని కోరుకుంటూన్నాను.



సదా పోచమ్మ దీవెనలు మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ....


మీ,

కడవెండి సీతారాంపురం.










దొడ్డి కొమురయ్య(doddi komuraiah)

దొడ్డి కొమురయ్య 68వ వర్దంతి (జూలై 4,2014) సందర్బంగా ....


భూమికోసం, భుక్తికోసం, శాంతియుతంగా సభలు సమావేశాల ద్వారా చేస్తున్న పోరాటాన్ని సాయుధ మార్గం లో నడిచినది మన దొడ్డి కొమురయ్య అమరత్వమే.

తెలంగాణ గడ్డపై రజాకారుల తుపాకి తూటాలకు మొట్ట మొదటి సారిగా దొడ్డి కొమురయ్య బలెైనాడు.

సభలు, సమావేశాల ద్వారా, శాంతి వచనాల ద్వారా భూస్వాములు దారికి రారని ప్రజలు తెలుసుకున్నరు. ప్రభుత్వం, అధికారులు , దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లకు తొత్తులేనని అర్థం చేసుకున్నరు.ఈ చైతన్యంతోనే.. ఆంధ్రమహాసభలోని అతివాదులు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి సాయుధ పోరాటాన్ని నడిపిండ్రు. ఈ సాయుధ పోరాటానికి నాంది పలికింది మన కడవెండి ముద్దు బిడ్డ కొమురన్న అమరత్వమే.

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుడు,

తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదని వీరుడు,

నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన గణుడు,

నాటి తెలంగాణా ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన విప్లవ వీరుడు.

ప్రజలనుండి వచ్చిన ప్రజల మనిషి,

పోరాటం ఒక అనివార్యంమైంది మన దొడ్డి కొమురన్నకి.

కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం (1946 జూలై 4) తర్వా త కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో ప్రజా ప్రతిఘటన సాయుధ పోరాట రూపం తీసుకుంది. రైతు కూలీలు, మహిళలు వీరోచితంగా, సాయుధం గా పోరాడారు. పల్లెల నుంచి భూస్వాములు మూటా ముల్లె సర్దుకుని పట్ణణాలకి పారిపోయారు. ఇందరు త్యాగధనుల పోరాట ఫలితంగా కొన్నివేల గ్రామాలు విముక్తమయ్యాయి. కొన్ని లక్షల ఎకరాలు ప్రజలకి పంచారు.

ఇదంతా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు మన దొడ్డి కొమురన్న అమరత్వంతో వచ్చిన విప్లవం మూలంగానే జరిగిందన్నది తెలంగాణా చారిత్రక వాస్తవం.

దొడ్డికొమురయ్య స్పూర్తితో తెలంగాణా ప్రజలు ప్రతేక తెలంగాణ రాష్ట ఉద్యమంలో పాల్గొని తెలంగాణాను సాదించుకొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కాని...

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా రాజకరులను ఎదిరించిన మన కొమురన్నకు తగిన గుర్తిపు దక్కిందా..?

మన తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసి,

నేటి తెలంగాణా సమాజానికి చరిత్రను వేత్తుకొనే పరిస్థితికి తీసుకొచ్చిన

ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణా అన్ని విదాలుగా నష్టపోయింది.

తెలంగాణాలోని మేధావులందరూ తెలంగాణా చరిత్రను, మన అస్తిత్వాన్ని

మన ముందు తరాలకు తెలియజేయాలి.

దీనిలో బాగంగా తెలంగాణా ప్రభుత్వం ఈ విదంగా చేయాలి

** తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర , దొడ్డి కొమురయ్య అమరత్వంతో వచ్చిన పరిణామాల గురించి స్కూల్ బుక్స్ లో పొందుపరచాలి.

** జనగాం ప్రాంతాన్ని జిల్లాగా గుర్తించి దొడ్డి కొమురయ్య జిల్లాగా నామకరణం చేయాలి.

**దొడ్డి కొమురయ్య అమరుడైన జూలై 4 నా " తెలంగాణా అమరవీరుల" రోజుగా గుర్తించి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలి.

**దొడ్డి కొమురయ్య ఫోటోతో కూడిన రెవెన్యు స్టంప్స్ ను విడుదల చేయాలి.

**నాటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణా రాష్ట ఆవిర్భావం వరకు జరిగిన పోరాట చరిత్ర తెలిసే విదంగా స్ముతికేంద్రాన్ని నిర్మించాలి.

** ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణా పోరాట అమరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి.


అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే

అమరహే దొడ్డి కొమురన్న .... అమరహే


మీ,
కడవెండి సీతారాంపురం.