ప్రేమించినోడు హీరో.. కని పెంచినోల్లు విలన్లు..

ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!!
ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడిది బాస్ అంత కామమే..!
ఈ కామానికి ఆకర్షితులై ఒకటౌతున్నారే తప్ప ప్రేమ ఎక్కడిది బాస్..
తమ కామసుఖం కోసం..
తమను ప్రేమించే తల్లిదండ్రులను కలదాన్నే వాళ్ళు ఎందఱో..యువకుడి చేతిలో మోసపోయే యువతి..యువతి నట ప్రేమలో మోసపోయే యువకులను ఎంత మందిని చూడలేదు..లేచిపోయీ.. కని పెంచినోల్ల మానమర్యాదలను బుగ్గిపాలు చేసి,నలుగు దినాలకే మోసపోయీ ఇంటికి చేరిన వాళ్ళను చూస్తూనే ఉన్నాను..కుల, మతాంతర నట ప్రేమలు ఈ రోజు ఎంత వరకు సక్సెస్ అవుతున్నాయో..రోజు పేపర్ లో చూస్తూనే ఉన్నాం..అప్పట్లో ప్రేమకంటూ కొన్ని విలువలు ఉండేటివి.తను ప్రేమించిన యువతి లేదా యువకుడు తనకు దక్కకున్న..తన సుఖ సౌఖ్యాలను కాంక్షించేవారు..మరి నేడు..యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు, మానబంగాలు , హత్యలు, ఆత్మహత్యలు..వద్దు బాస్ మనకి ప్రేమలు..ఈ వాలెంటైన్ డే లు..కన్నోల్లు ఏమి చెప్పిన అది మన మంచి కోసమే...మీరు నిజంగానే ప్రేమలో ఉన్నాము అని బ్రమిస్తే..మీ మీ తల్లి దండ్రులకు చెప్పి ఓప్పించి, పెళ్లి చేసుకోండి బాస్..అంతే గాని కని పెంచినోల్లును విలన్లుగా చూడకండి.
విషరసాయనాల పుణ్యమా అని, 
అంతరించిపోతున్న ఆరుద్ర పురుగులు..!
ఇకపై ఫోటోలలోనే చూసుకోవాలి కాబోలు..!!
 
మొహం నిండా పసుపు...
నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు...
కళ్లకు కాటుక..
ఒళ్ళు మొత్తం పసుపు దుస్తువులు..
మెడలో బంతి పూల దండ...
అందమైన రుద్రాక్ష ధారణ..
కాళ్ళకు, మోచేతి పై గజ్జెకట్టు...
చేతిలో కొరడా ...
మొహంలో పోతరాజు హావభావాల విన్యాసాలతో
సందడి చేస్తున్న ఈ చిన్నోడు ఎవరా అని చూస్తున్నారా..?
పోతరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి మన గ్రామా బిడ్డడే...!
మన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే పోతరాజు వేషం వేసిన
"పుప్పల సోమరాజు" (తండ్రి :పుప్పల రాంచందర్) కు " కడవెండి సీతారాంపురం" అబినందనలు... ధన్యవాదాలు తెలుపుతుంది.

మన తెలంగాణా సంస్కృతిని దేశ నలుమూలలా...
వ్యాపించేలా ఈ కార్యక్రమం చేపట్టిన పంజాబ్ రాష్ట "లవ్ లీ యూనివర్శిటీ" యాజమాన్యానికి మన తెలుగు విద్యార్ధి లోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ...
తెలుగు విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మనసారా కోరుకుంటూ....
మీ,
కడవెండి సీతారాంపురం.


 




మనకు తెలియని,మన తెలంగాణా చారిత్రక ఆధారాలు..
నిజాలు..
ఎన్నో..
మరెన్నో...
ఆంధ్రోల్ల పాలనలో అనిచివేయబడినవి. 
మన చరిత్ర..
మనోల్ల పోరాట పటిమ..
ప్రాణాత్యాగాలు..
దైర్యసాహసాలు..
వెలుగులోకి రాలేదు.
నిజాం నిరంకుశత్వానికి,
రజాకార్లు,దేశ్ ముఖ్ ల అరాచకాలకు వ్యతిరేకంగా..
పోరాటం చేసిన వారు ఎందఱో మన గ్రామంలో ఉన్నారు.
వారి పోరాటాలను
ఆప్పటి ఆంధ్ర ప్రభుత్వాలు ఎవ్వరు గుర్థించనూ లేదు కదా..
ఆసలు ఇది విమోచనమా? విలినమా? అని మినామేశాలను లెక్కిస్తూ కాలం గడిపాయీ..
మన దూరదుష్టం ఏంటంటే మన ప్రత్యేక తెలంగాణా రాస్తాంలోకూడా ఇదే పోకటలో నడుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే,
మన కడవెండి గ్రామంలో
ఇలాంటి నల్ల వజ్రమ్మలు
ఎందఱో మరుగున పడిపొయరూ...
ఇలాంటి వజ్రాలు మీ ఇంటిలో కూడా ఉండొచ్చు..
కనుక మీ వజ్రాన్ని కూడా వెలుగులోకి తేవలసిన బాద్యత..
మనవడివైన , మనవరాలి వైన నీపై ఉంది.
మీ వజ్రాన్ని వెలుగులోకి తేవాలని కోరుకుంటూ...
మీ,
కడవెండి సీతారాంపురం.
అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు.
ధ్వజ స్తంబం ప్రతిష్టా మహొత్సవ ఆహువనం...

(january)
ఈ నెల 26 సోమవారం నుండి 30 శుక్రవారం వరకు గ్రామ శివాలయంలో జరుగు ధ్వజ స్థంభ ప్రతిష్టా కార్యక్రమానికి గ్రామా ప్రజలందరూ రావలసిందిగా గ్రామా పెద్దల తరుపున మరియు దేవస్తాన కమిటి తరుపున తెలియజేస్తూ....
శివ, విష్ణు , ఆంజనేయ ఆలయాలో ద్వాజస్తంబం కనిపిస్తుంది. అయితే ఒకే ప్రదేశంలో అందరి దేవుళ్ళని ప్రతిష్టించి ధ్వజ స్థంబం పెట్టడం లేదు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం, దేవత మూర్తి ఒక దిశగా ఉంటుంది. అ దేవత బ్రుకుటి మద్య నుంచి ఒక సరళ రేఖ నుంచి 45డిగ్రీల కోణం నుంచి ఆ సరళ రేఖను ఎక్కడ అది ఖండిస్తుందో అక్కడ ధ్వజ స్తంబని ఏర్పాటు చేయాలి.
సరళ రేఖ నుండి ఎంత దూరం లో ఉందొ అంతే ఎత్తు లో ద్వాజస్తమబం ఉండాలి. ఆలయ ప్రాంగణం లో దేవుడి ఎదురుగా ద్వాజస్తంబని ఏర్పాటు చేస్తారు.
ప్రకృతిలో ఉండే ప్రాణ శక్తి ని, గుడిలో ప్రతిష్టించిన యంత్రం, స్తోత్ర పారాయణ వలన ప్రాణ శక్తిద్వాజస్తంబం తీసుకుంటుంది రక్షణ చేస్తుంది. దీనివలన పిడుగులు పడకుండా కాపాడుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే ద్వాజస్తంబం ఎంత. ఉరిలో ఎక్కడయినా గుడిలో ద్వాజస్తంబం ఉంటె అక్కడ దానికంటే ఎత్తులో ఎవరు ఇల్లు కట్టేవాలు కాదు. ఎందుకంటే ద్వజస్తంబం కంటే ఎత్తులో ఇల్లు ఉండడం వలన అవి ప్రకృతి వైపరీత్యాల వలన రక్షిమ్పబడవు.
శైవ దేవాలయానికి ముందు కొంత దూరం వరకు ఇల్లు కట్టుకోకుడదు, శక్తి దేవాలయానికి వెనక కట్టుకోకుడదు , గుడి నీడ పడకూడదు.
గుడి పైన ఉండే కలశం మీదుండే సూచి సికరం ఉంటుంది, దానికి ఉండే స్వభావం ఏంటి అంటే అది ప్రకృతి లో ఉండే ప్రాణ శక్తి ని తీసుకుని, దాని నీడ ఎక్కడ పడుతుందో అక్కడ జీవం ఉండదు.
ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం నిర్మాణం లేకపోయిన, ధ్వజస్తంభం లేకపోయినా అక్కడ శక్తి ఉండదు అని అలంటి చోట్లకి వెళ్ళకూడదు అని శాస్త్రం చెపుతుంది. 4 గోడలు కట్టి దేవుడి విగ్రహాలు పెట్టి పూజ చేసిననంత మాత్రాన అది గుడి అనిపించుకోదు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం ఎంత ఎత్తు ఉండాలో , విగ్రహం ఎంత ఎత్తు ఉండాలి, ఏ కోణం లో ఉండాలి , ఏ అభిముకం గ ఉండాలి , ఎలాంటి పూజ చేయాలి అనేవి తెలుసుకుని పాటించాలి. కొత్త దేవాలయం కట్టడం కంటే నిర్జీవం అయిపోతున దేవాలయం పునర్నిర్మాణం , పూర్వ వైభవం కోసం చేసే పనుల వలన రెండింతలు ఎక్కువ పుణ్యం వస్తుంది అని శాస్త్ర వాక్కు.
ఇట్లు,
మీ రాక కోసం ఎదురు చూస్తూ...
కడవెండి సీతారాంపురం.

ఎవడు నిజమైన ఫ్రెండు..?

ఎవడు నిజమైన ఫ్రెండు..?
ఎమ్ ఇప్పుడే గుర్తోచిందా నేను ఒకడిని ఉన్నానని !
నాకొక్క ఎస్.ఎం.ఎస్ పంపితే సరిపోతుదనుకున్నవా..?
ఇదేనా ఫ్రెండ్షిప్ కు నీవిచ్చే అర్ధం.

* డబ్బులున్నోనిని ఏరికోరి ఫ్రెండ్స్ ని చేసుకుటున్నారే ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ?
*నలుగురు కలిస్తే నలుగు డబ్బులు పోగుచిసి నాలుగు బిరుబటిల్లు, బిర్యానీ పొట్లంతో పార్టి చేస్తే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారా ?
*అదే నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరికి ఆపద వస్తే నాలుగు చేతులు ఎందుకు ముందుకు రావడం లేదురా ఇదేనరా ఫ్రెండ్షిపు ..?
*అందరం ఒకే కంచంలో తిని,ఒకే దగ్గర పడుకున్నమే మరిచిపోయావరా ?
* నివు ఒక్కడివి సెటిల్ అయితే సరిపోతుందనుకున్నవా , లేక ని ఫ్రెండ్స్ అందరు నికిందనే ఉడాలని కోరుకుంటున్నావా ఫ్రెండ్ ?
* ఫ్రెండ్ అంటే మిగితా స్నేహితులందరికి అండగా ఉండేది పోయీ నలుగురిలో కించపరుచుట న్యాయమా మిత్రమా ?
* మీ అవసరానికి మాత్రమే ఈ ఫ్రెండ్ గుర్తుకోస్తాడా ?
* ఏమైంది ఫ్రెండ్ చిన్నపుడు బాగానే ఉన్నావు కదా ఫ్రెండ్ !
* ఇప్పుడు నీలో ఈ మార్పు ఎందుకు కొచ్చింది ఫ్రెండ్ !!
* చిన్నపుడు నాకే ముందు చక్లేటు ఇచ్చి ఆతర్వతనే కదా నివు తినేవాడివి.
* మరి ఇప్పుడేట్ల మరిచిపోయావు ఫ్రెండ్ నేను ఇంకా ఈ భుమి మీదనే ఉన్నానని.
* నీ దగ్గరున్న ఈ డబ్బు జీవితాంతం నీతోనే ఉంటాదనుకుటునవా ?
* నిజమైన ఫ్రెండ్ నువ్వు కాదురా ?

ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి సహయతో తమ జీవితంలో విజయం సాదించినవారే , మరిచి పోకు మిత్రమా నీకు సహాయం చేసినవారిని , నివు కుడా నలుగురికి చేతనైన సహాయం చెయ్ ఫ్రెండ్. అప్పుడే ఈ మిత్రుడు నిన్ను క్షమిస్తాడు.
డబ్బులతో నీ స్నేహం, శాశ్వతం కాదురా !
నా గుండె లోతుల్లో, నిరూపంతో గుడి కట్టాను చూడరా !!

కడవెండి సీతారాంపురం