మా ఊరిలో దసరా పండుగకు దుర్గమ్మను నిలబెట్టడం
ఇదే మొదటి సారీ..!
నిలబెట్టడానికి సహాయ పడిన అందరికీ ధన్యవాదాలు..!!



మా గ్రామాన్ని దత్తత తీసుకున్న పెద్దాయన ఎటుపోయీండో..
ఈ మధ్యలా మా ఊరికి రావడమే మానేసిండు..!

దత్తత తీసుకున్నారని చెప్పి, మీ ఆస్థులను పంచియ్యమని అడుగుతలేము సారు..
అప్పుల భాధతో రైతులు సచ్చిపోతున్నారు సారు..
నేనున్నానని మా ఊరికొచ్చి భరోసా ఇవ్వండి చాలు..
ఆటు పాలకులు రాకుండా, ఇటు మీరు రాకుంటే ఎవరు సారు మాకు దిక్కు..!!

మన సంస్కృతి, సంప్రదాయాలు మన తర్వాతి తరాలకు
వారసత్వంగా ఇవ్వాలంటే ఊరు బాగుండాలే...
ప్రతి రైతు కండ్లల్లో ఆనందం నిండలే..
అప్పుడే పల్లె ప్రజల జీవితాలలలో సంస్కృతి, సంప్రదాయం బ్రతికి బట్టకడుతుంది...
బతుకమ్మ పాటలు ( అరవ రోజు )
ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చెన పొయెన ఉయ్యలో
ఎట్లోత్తు చెల్లెలా ఉయ్యాలో ఏఅరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపు తాళలు ఉయ్యాలో వెందివే చీలలు ఉయ్యాలో
వెండి చీలకింది ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో తక్కెడెపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో ఎళ్ళె్న ఆపత్తి ఉయ్యాలో
ఆప్త్తి తిసుకొని ఉయ్యాలో ఏడికిపొయిరి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలో
తొమ్మిది రోజుల ఉయ్యాలో
తొమ్మిది రోజుల ఉయ్యాలో నమ్మికతొడుండు ఉయ్యాలో
అల్లరి గుమ్మాడి పూవ్వులు ఉయ్యాలో అరుగులు వెరుూంచీ ఉయ్యాలో
గొరింట పూవ్వులు ఉయ్యాలో గొడలు పెట్టీంచె ఉయ్యాలో
తామర పూవ్వులు ఉయ్యాలో ద్వారల పెట్టీంచె ఉయ్యాలో
మొగిలీ పూవ్వులు ఉయ్యాలో మొగరాలు ఎక్కించె ఉయ్యాలో
వారుూలి పూవ్వులు ఉయ్యాలో వసాలు వెరుూంచె ఉయ్యాలో
పొన్న పూవ్వులు ఉయ్యాలో ఇల్లును కప్పించి ఉయ్యాలో
దోస పూవ్వులు ఉయ్యాలో తొరణాలు కట్టించి ఉయ్యాలో
పసుపుముద్దను చేసి ఉయ్యాలో గౌరమ్మను నిలిపి ఉయ్యాలో
చేమంతి పూవ్వులు ఉయ్యాలో చెలియను పూజించిరుయ్యలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో చుట్టుతా తిరిగుయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో కాంతలందరికి ఉయ్యాలో
అడిగిన వారికి ఉయ్యాలో ఆరోగ్యాము కల్గు ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో పాడీపంటలు కల్గు ఉయ్యాలో
విన్నట్టివారికి ఉయ్యాలో విష్ణు పథము కల్గు ఉయ్యాలో
మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్
బతుకమ్మ & దసరా పండుగలు  , తెలంగాణా ప్రాంతాల్లో  పెద్ద పండుగలు..
తెలంగాణా బిడ్డలందరూ ఈ పండుగకు తప్పకుండా వారివారి సొంత ఊరికి చేరుకుంటారు..
తమ చిన్ననాటి స్నేహితులంతా ఒక్కదగ్గర చేరి, కష్టసుఖాలను  పంచుకుంటారు...
కుటుంబ కలయికతో   ఇంటిల్లపాది  సందడి నెలకొంటుంది..
కొత్త దుస్తువుల కళకళలు.. పిండి వంటల గుమగుమలు..
ఈ పండుగకు ఆడపడుచులు , గ్రామా ప్రజలు అందరు తప్పకుండా
తమ తమ గ్రామాలకు వెళ్లి ..
మీ కుటుంబ సభ్యులతో, తోటి మిత్రులతో సంతోషంగా గడపాలని
కోరుకుంటూ..


బతుకమ్మ పాటలు ( ఐదవ రోజు )


నీలకంఠుని రాణి ఉయ్యాలో
నిన్ను పూజింతు ఉయ్యాలో
సాంబ్రాణి ధూపము ఉయ్యాలో
శాంభవీ నీకిత్తు ఉయ్యాలో

గౌరీ నీ సన్నిధిని ఉయ్యాలో
దీపంబు నీకిత్తు ఉయ్యాలో
చారపలుకుల పప్పు ఉయ్యాలో
నారికేళంబులు ఉయ్యాలో
నాతిరో నీకిదే ఉయ్యాలో

నైవేద్యమిచ్చెద ఉయ్యాలో
శంభుని రాణి ఉయ్యాలో
తాంబూల మిచ్చెద ఉయ్యాలో
దాక్షాయి నీకు ఉయ్యాలో
దక్షిణ గైకొమ్ము ఉయ్యాలో

మానినీ చేకొమ్మ ఉయ్యాలో
మంత్రపుష్పం ఇదే ఉయ్యాలో
దేవి ప్రదక్షిణము ఉయ్యాలో
సావిత్రి దేవీ ఉయ్యాలో
అంగనా మణి నీకు ఉయ్యాలో

మంగళహారతి ఉయ్యాలో
గన్నేరు పువ్వుల ఉయ్యాలో
గౌరి నిను పూజింతు ఉయ్యాలో
గోరంట పువ్వుల ఉయ్యాలో
కోరినిను పూజింతు ఉయ్యాలో
చేమంతి పువ్వుల ఉయ్యాలో
చేరి నిను పూజింతు ఉయ్యాలో

కలువ పూలతో ఉయ్యాలో
యింపుగా పూజింతు ఉయ్యాలో
సంపెంగ పూలతో ఉయ్యాలో
యింపుగా పూజింతు ఉయ్యాలో
బంతిపూలను తెచ్చి ఉయ్యాలో

యింతి నీకర్పింతు ఉయ్యాలో
శంఖు పూలు ఉయ్యాలో
శాంకరీ నీకిత్తు ఉయ్యాలో
తంగేడు పువ్వుల ఉయ్యాలో
తల్లి నిను పూజింతు ఉయ్యాలో

పొన్న పూవుల తోటి ఉయ్యాలో
పార్వతిని పూజింతు ఉయ్యాలో
మందార పూలతో ఉయ్యాలో
మగువ నిను పూజింతు ఉయ్యాలో
మల్లెపూలు తెచ్చి ఉయ్యాలో

మా తల్లి పూజింతు ఉయ్యాలో
కాంత నీ పాదాల ఉయ్యాలో
కడిగి తరియింతును ఉయ్యాలో
అంబిక నీకిదే ఉయ్యాలో
అర్ఘ్యంబులిచ్చెదా ఉయ్యాలో

పంచామృతంచే ఉయ్యాలో
పడతిరోనిత్తు ఉయ్యాలో
జలజాక్షి పన్నీరు ఉయ్యాలో
జలకమాడుము ఉయ్యాలో

జల్తారు చీరను ఉయ్యాలో
శాంభవీ గైకొనుము ఉయ్యాలో
రాగి సొమ్ము దాల్చి ఉయ్యాలో
రంజిల్లు గౌరమ్మ ఉయ్యాలో
అందమైన మెడకు ఉయ్యాలో

అంబ నీ పాదాల ఉయ్యాలో
పునుగు జువ్వాజితో ఉయ్యాలో
పూజింతు నిన్ను ఉయ్యాలో
పసుపు కుంకుమ బెట్టి ఉయ్యాలో

పూజింతు గౌరమ్మ ఉయ్యాలో
పారిజాతంబులు ఉయ్యాలో
పార్వతి నినుకొలుతు ఉయ్యాలో
మారేడు దళముల ఉయ్యాలో
మాత నిను పూజింతు ఉయ్యాలో

మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్ 
బతుకమ్మ తెలంగాణకు సంకేతం...
బతుకునే అమ్మ గా భావించే సంస్కృతి మనది..!
ఆలనాటి బతుకులే బతుకమ్మ పాటలకు ఆధారాం..
నేటి తెలంగాణా.. బతుకు పోరులో ఓడిపోతున్న
అన్నదాతలు , నిరుద్యోగులు..!
మా చీకటి బతుకులను పట్టించుకునే దెవరు..
మా బతుకు బండిని నడిపెదేవారు..!
రైతు కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయీ..
బంగారు బతుకమ్మను చేసేదెప్పుడు..!
బతుకమ్మ పాటలు ( నాలుగవ రోజు )
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !! 2
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! అన్నీ పెట్టింది ఉయ్యాలో! ..... 2
అప్పుడూ అక్కెమ్మ ఉయ్యాలో! తిన్నట్టు తిని ఉయ్యాలో! ....2
తిన్నట్టు తినీ ఉయ్యాలో! పారేసినాది ఉయ్యాలో! 2
పెద్దోడు రామన్న ఉయ్యాలో! బుద్ధిమంతుడాని ఉయ్యాలో! 2
ఏడు రోజుల్ల ఉయ్యాలో! చెల్లెరో అక్కెమ్మ ఉయ్యాలో! 2
అక్కెమ్మా కురులు ఉయ్యాలో! దురవాసినాయి ఉయ్యాలో! 2
అందరానికాడ ఉయ్యాలో! ఆకు అందుకోని ఉయ్యాలో! 2
ముట్టరాని కాడ ఉయ్యాలో! ముల్లు ముట్టుకోని ఉయ్యాలో! 2
పెద్ద నేలు రాత ఉయ్యాలో! పేరువాడా రాసి ఉయ్యాలో! 2
సిటికెనేలూ రాత ఉయ్యాలో! సిక్కువాడా రాసి ఉయ్యాలో! 2
రాకి గొంట బొయ్యి ఉయ్యాలో! రామన్న కిచ్చె ఉయ్యాలో! 2
కూసుండి రామన్న ఉయ్యాలో! రాకి గట్టుకోని ఉయ్యాలో! 2
రాయనాసి నచ్చి ఉయ్యాలో! పోయెనాసి నచ్చి ఉయ్యాలో! 2
బుడ్డెడూ నూనె ఉయ్యాలో! తీసుకా పోయింది ఉయ్యాలో! 2
చారెడంత నూనె ఉయ్యాలో! చదిరి తలకంటి ఉయ్యాలో! 2
కడివెడంత నూనె ఉయ్యాలో! కొట్టి తలకంటి ఉయ్యాలో! 2
గిద్దెడంత నూనె ఉయ్యాలో! గిద్ది తలకంటి ఉయ్యాలో! 2
ఆరసోడూ నూనె ఉయ్యాలో! అందంగ తలకంటి ఉయ్యాలో! 2
సోలెడూ నూనే ఉయ్యాలో! సోకిచ్చే తల ఉయ్యాలో! 2
వెండి దువ్వెనా ఉయ్యాలో! వెయ్యి చిక్కూతీసె ఉయ్యాలో! 2
తల్లి రావే తల్లి ఉయ్యాలో! తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో! 2
నాకునూ కష్టాలు ఉయ్యాలో! ఎందమ్మా తల్లి ఉయ్యాలో! 2
ఏమి కష్టాలనూ ఉయ్యాలో! తలపెట్టినావమ్మ ఉయ్యాలో! 2
పిడికెడంత మిరెము ఉయ్యాలో! కండ్లల్ల పోసె ఉయ్యాలో! 2
మంట అనీ అంటె ఉయ్యాలో! సంతోషపడుదును ఉయ్యాలో! 2
అట్లయిన మంచిదె ఉయ్యాలో! సప్పుడే చెయ్యదీ ఉయ్యాలో! 2
పొగాకు కండెమూ ఉయ్యాలో! తీసినాడు దేవుడూ ఉయ్యాలో! 2
కాళ్లకిందా యేసి ఉయ్యాలో! నలిపినాడుదేవుడు ఉయ్యాలో! 2
నశ్యమూ జేసిండు ఉయ్యాలో! ముక్కులాపెడ్టిండు ఉయ్యాలో! 2
ఒక్క తుమ్మన్న ఉయ్యాలో! తుమ్మినా గానీ ఉయ్యాలో! 2
నాయినీ భ్రమలూ ఉయ్యాలో! తీరునేమో గానీ ఉయ్యాలో! 2
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!
ఏడున్నొక్క మేడలూ ఉయ్యాలో! కాలికూలాబట్టె ఉయ్యాలో! 2
ఏడు దొడ్ల బాసి ఉయ్యాలో! కాలికూలబట్టె ఉయ్యాలో! 2
బుచ్చపోళ్ల ఏసెమూ ఉయ్యాలో! సేసినాడు దేవుడు ఉయ్యాలో! 2
అక్కెమ్మ తల్లిగారు ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడువా బట్టిరీ ఉయ్యాలో! తూడువా బట్టిరీ ఉయ్యాలో! 2
సెల్లె నొక్క సేత ఉయ్యాలో! బల్లె మొక్క సేత ఉయ్యాలో! 2
పట్టుకోని అన్నలూ ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలూ ఉయ్యాలో! చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! 2
చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! జంగలూ బాటనూ ఉయ్యాలో! 2
జంగలూ బాటనూ ఉయ్యాలో! అన్నలే బట్టిరీ ఉయ్యాలో! 2
ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాలో! నడుస్త ఉన్నరూ ఉయ్యాలో! 2
నడిచేటి కాళ్లకూ ఉయ్యాలో! పొక్కులొచ్చినాయి ఉయ్యాలో! 2
ఎండకాలం రోజు ఉయ్యాలో! దూపలూ కాబట్టె ఉయ్యాలో! 2
దూపైతాందాని ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
ఆకలైతాందనీ ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
వన దేవుని తల్లి ఉయ్యాలో! వనపున్నూ రాలు ఉయ్యాలో! 2
అప్పుడూ వనదేవుడు ఉయ్యాలో! ఏడుగురన్నలకూ ఉయ్యాలో! 2
ఏడుగురన్నలకూ ఉయ్యాలో! ఏడుపండ్లు ఇచ్చి ఉయ్యాలో! 2
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! వెన్న పండు యిచ్చె ఉయ్యాలో! 2
వెన్నె ముద్దపండు ఉయ్యాలో! పదాడబట్టింది ఉయ్యాలో! 2
ఏం పిల్లా నమ్మ ఉయ్యాలో! ఎందుకింతా గర్వం ఉయ్యాలో! 2
గొల్లాయినయి ఉయ్యాలో! పాలు తెచ్చినాడు ఉయ్యాలో! 2
ఏడుగురన్నలూ ఉయ్యాలో! పాలు తెచ్చినారు ఉయ్యాలో! 2
గిలాసెడూ పెరుగు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండ్లు ఉయ్యాలో! 2
వనదేవుడేమొ ఉయ్యాలో! గొల్ల వేషంతోని ఉయ్యాలో! 2
గొల్ల వేషంతోని ఉయ్యాలో! వచ్చినాడనుకొని ఉయ్యాలో! 2
వచ్చినాడనుకొని ఉయ్యాలో! అక్కెమ్మగూడా ఉయ్యాలో! 2
అక్కెమ్మ గూడా ఉయ్యాలో! అయినా పెరుగునూ ఉయ్యాలో!2
అయినా పెరుగునూ ఉయ్యాలో! పారా బోసింది ఉయ్యాలో! 2
చాలోడూ అయి ఉయ్యాలో! చీరెలూ తెచ్చిండు ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలకూ ఉయ్యాలో! ఏడు దోతులిచ్చి ఉయ్యాలో! 2
సన్నయి వొయ్యెలు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండు ఉయ్యాలో! 2
నాకు ఎందుకాని ఉయ్యాలో! పారేసీనాది ఉయ్యాలో! 2
ఆయినీ సీరెలూ ఉయ్యాలో! తీసుకుంటేనేమొ ఉయ్యాలో! 2
తీసుకుంటెనేమొ ఉయ్యాలో! వనదేవునికేమొ ఉయ్యాలో! 2
వనదేవుని కేమొ ఉయ్యాలో! బ్రమలూ తీరునూ ఉయ్యాలో! 2
అట్లనన్న బ్రమ ఉయ్యాలో! తీరుననుకున్నడు ఉయ్యాలో! 2
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో! ఆయినీ సీరెలను ఉయ్యాలో! 2
నాకు ఎందుకానీ ఉయ్యాలో! పారేసి నాది ఉయ్యాలో! 2
అట్లగాకపోతె ఉయ్యాలో! మరిఎట్ల జేతును ఉయ్యాలో! 2
తూర్పు దిక్కున ఉయ్యాలో! కొసినా కొరకలూ ఉయ్యాలో! 2
కోసినా కొరకలూ ఉయ్యాలో! పండుతాందీ పిల్ల ఉయ్యాలో! 2
ఆ పంట కోసమూ ఉయ్యాలో! మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! 2
మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! పోతారు పిల్ల ఉయ్యాలో! 2
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!
ఊల్లెకూ మీరు ఉయ్యాలో! చేరవచ్చే నేమొ ఉయ్యాలో! 2
సుంకరోన్నయి ఉయ్యాలో! నేను వస్తా పిల్ల ఉయ్యాలో! 2
మీ ఏడుగురన్నలూ ఉయ్యాలో! మనిషి కొక్కా దెబ్బ ఉయ్యాలో! 2
మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్

ఆడపిల్లను పుట్టనిద్దాం... బతుకమ్మను ఆడనిద్దాం..
స్త్రీలలో ఉన్న అభద్రతా భావాన్ని దూరంచేద్దాం...!
స్త్రీ హింస లేని తెలంగాణ సాదిద్దాం ...!!
బతుకమ్మ పాటలు ( మూడవ రోజు )
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
తంగేడు చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష చెట్టు కింద
ఆట సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
కాకర పువ్వొప్పునే గౌరమ్మ
కాకర కాయొప్పునే గౌరమ్మ
కాకర చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
చామంతి పువ్వొప్పునే గౌరమ్మ
చామంతి కాయొప్పునే గౌరమ్మ..
చామంతి చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఆ పూలు తెప్పించి పూజించి
గంధముల కడిగించి కుంకుమల జాడించి
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్

బతుకమ్మ పండుగ అనేది   పల్లె పడుచుల, స్త్రీమూర్తుల  వేడుక..
అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు
మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని..
బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే కావున
పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని...
అంటువ్యాధులు ప్రభలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది..
ఈ పండుగ పూట  ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవలని కోరుకుంటూ..

బతుకమ్మ  పాటలు  ( రెండవ రోజు )

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో


ఆడపిల్లను  పుట్టనిద్దాం... బతుకమ్మను ఆడనిద్దాం..

మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్